వర్షాకాలంలో అప్పుడప్పుడు రోడ్లపై బురదలో వాహనాలు నిలిచిపోతుంటాయి. బురదలో టైర్లు ఇరుక్కుపోయి ముందుకు కదలవు. ఇలాంటివి ఘటనలు వర్షాలు పడే సమయంలో చాలా సార్లు చూస్తుంటాం. కానీ విమానం కూడా బురదలో చిక్కుకోవడం ఎప్పుడైనా చూశారా..? మనదేశలోని అసోంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గురువారం జోర్హత్ విమానాశ్రయం (Zorhat Airport)లో ఇండిగో విమానానికి (Indigo Flight) తృటిలో పెను ప్రమాదం తప్పింది. విమానం టేకాఫ్ అవుతుండగా ప్రమాదవశాత్తూ రన్ వే నుంచి జారిపోయి.. విమానం టైరు బురదలో చిక్కుకుపోయింది. ముందుకు కదలకపోవడంగో విమాన సిబ్బంది అప్రమత్తమై.. ప్రయాణికులందరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.
IndiGo's Kolkata-bound flight skidded while taxing for take-off in Jorhat y'day. No passengers suffered injuries in the incident & a team constituted to probe the incident. During the initial inspection of the aircraft no abnormalities were observed, says IndiGo airlines. pic.twitter.com/97tLK2hHfV
— ANI (@ANI) July 29, 2022
దేశీయ విమాన సంస్థ ఇండిగోకు చెందిన 6E-757 విమానం గురువారం మధ్యాహ్నం అసోంలోని జోర్హత్ విమానాశ్రయం నుంచి కోల్‌కతాకు వెళ్లాల్సి ఉంది. టేకాఫ్ అయ్యేందుకు... రన్‌వేపై బయలుదేరింది. కొంత దూరం ముందుకు వెళ్లిన తర్వాత.. రన్ వే నుంచి పక్కకు జారిపోయియింది. రెండు టైర్లు బురదలో దిగబడి పోవడంతో.. విమానం ముందుకు కదలేదు. విమానం ఒక్కసారిగా స్కిడ్ కావడంతోప్రయాణికులు భయపడిపోయారు. ఐతే పైలట్ల వెంటనే అప్రమత్తమై.. విమానాన్ని నిలిపివేశారు. అనంతరం విమాన సిబ్బంది ప్రయాణికులను క్షేమంగా కిందకు దించేశారు. అనంతరం విమానాన్ని రద్దు చేశారు. సాంకేతిక లోపం తలెత్తడం వల్ల విమానాన్ని రద్దు చేసినట్లు ఇండియో తెలిపింది. అనంతరం వేరొక విమానంలో వారిని కోల్‌కతాకు తరలించారు.
మనదేశంలో కొంత కాలంగా పలు విమానాల్లో వరుసగా సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. గాల్లో ఉన్న సమయంలో ఇంజిన్‌లో లోపాలు తలెత్తడంతో.. ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసిన ఘటనలు కూడా జరిగాయి. గత ఏడాది జులై 1 నుంచి ఈ ఏడాది జూన్ 30 వరకు విమానాల్లో 478 సార్లు సాంకేతిక సమస్యలు తలెత్తాయని స్వయంగా కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా పార్లమెంట్లో తెలిపారు. ముఖ్యంగా స్పైస్ జెట్, ఇండిగో విమానాల్లో ఈ తరహా లోపాలు ఎక్కువగా బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో విమాన ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ క్రమంలోనే డీజీసీఏ చర్యలు చేపట్టింది. బేస్, ట్రాన్సిట్ స్టేషన్లలో నిపుణులు అనుమతించిన తర్వాతే విమానాలను బయటకు తీయాలనే నిబంధనను తప్పనిసరి చేసింది. B1/182 లైసెన్స్ కలిగిన ఎయిర్ క్రాఫ్ట్ మెయింటనెన్స్ ఇంజినీర్ నుంచి అనుమతి వచ్చాకే విమానాల టేకాఫ్‌కి అనుమతివ్వాలని స్పష్టం చేసంది. అంతేకాదు తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తులున్న స్పైస్ జెట్ విమానాలపై చర్యలకు దిగింది 8 వారాల పాటు స్పైస్ జెట్ విమానాలను 50 శాతం మాత్రమే నడపాలని డీజీసీఏ ఆంక్షలు విధించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.