Home /News /national /

INDIAS VICTORY INCASE OF WAR WITH CHINA ARMY CHIEFS LATEST STATEMENT GH VB

Indian Army Chief: చైనాతో యుద్ధం వస్తే భారత్‌దే గెలుపు.. ఆర్మీ ఛీఫ్ తాజా ప్రకటన..

ఆర్మీ చీప్ (ఫైల్)

ఆర్మీ చీప్ (ఫైల్)

దేశాల మధ్య యుద్ధం అనేది చివరి ప్రయత్నం మాత్రమే కావాలని భారత ఆర్మీ చీఫ్‌ ఉద్ఘాటించారు. చైనాతో యుద్ధం జరిగితే భారత్‌ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సరిహద్దు వివాదంపై చైనాతో ఓవైపు చర్చలు, మరోవైపు ఘర్షణలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇంకా చదవండి ...
దేశాల మధ్య యుద్ధం(War) అనేది చివరి ప్రయత్నం మాత్రమే కావాలని భారత ఆర్మీ చీఫ్‌(Bharath Army Chief) ఉద్ఘాటించారు. చైనాతో(China) యుద్ధం జరిగితే భారత్‌ విజయం(Win) సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సరిహద్దు వివాదంపై చైనాతో ఓవైపు చర్చలు, మరోవైపు ఘర్షణలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ(International) సరిహద్దు వెంబడి అలజడి సృష్టిస్తూ.. చైనా(China) బెదిరింపు ధోరణిని కొనసాగిస్తోందని మండిపడ్డారు. చైనా తాజాగా తీసుకొచ్చిన సరిహద్దు చట్టాన్ని నిర్ద్వద్వంగా తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. అంతేగాక పలు కీలక అంశాలను మీడియాతో(Media) పంచుకున్నారు. ‘చైనాతో సంబంధాలను బలోపేతం చేసుకునే ప్రయత్నాలు కొనసాగుతాయి. భారత్​కు చైనా నుంచి ముప్పు ఏ విధంగానూ తగ్గలేదు.

Crisis: భారీ ఆర్థిక సంక్షోభంలో పొరుగు దేశం.. చుక్కలనంటిన ధరలతో విలవిల..


భూటాన్(Bhutan) సరిహద్దులో పలు నిర్మాణాలను చైనా వేగవంతం చేసింది. కానీ చైనాతో యుద్ధం వస్తే గెలుపు మాత్రం భారత్​దే. ప్రస్తుతం లద్దాఖ్​లో పరిస్థితి నిలకడగా ఉంది. సరిహద్దు సమస్యల పరిష్కారానికి ఇరు దేశాలు చర్చలు జరుపుతున్నాయి. ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు భారత సైన్యం సిద్ధంగా ఉంది’ అని జనరల్ నరవాణే తెలిపారు.

సరిహద్దుల్లో ప్రస్తుత పరిస్థితి నియంత్రణలో ఉందని నరవణే వెల్లడించారు. అనుకున్నట్లుగానే చర్చలు జరుగుతున్నాయన్నారు. చర్చల సమయంలో ఆశావాద థృక్పథంతో ఉండాలని తెలిపారు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఇప్పుడే అంచనా వేయలేం... అయితే ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చాలా నమ్మకంగా చెప్పగలను అని నరవణే అన్నారు.
ఎల్​ఏసీ వద్ద నెలకొన్న ప్రతిష్టంభనను పరిష్కరించేందుకు భారత్- చైనాల మధ్య 14వ దఫా చర్చలు జరిగిన రోజే నరవణే నుంచి ఈ ప్రకటన వచ్చింది. 13 గంటల పాటు కొనసాగిన చర్చల సారాంశాన్ని గమనిస్తే..

హాట్ స్ప్రింగ్స్ (PP15) వద్ద సమస్యల పరిష్కారం కాగలవని ఆశిస్తున్నట్లు తాజా చర్చల అనంతరం భారత్ పేర్కొంది. దేప్సాంగ్​తో పాటు.. డెమ్‌చోక్‌లోని అపరిష్కృత అంశాలపై భారతదేశం చైనాతో కీలక చర్చలు జరిపింది. ఈ క్రమంలో ఇరుదేశాల మధ్య ఉన్న విభేదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని.. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న పీపీ17, పీపీ 15 ప్రాంతాలపై ఉన్న వివాదాలపై చర్చలు జరిగాయని నరవణే అన్నారు. అయితే సరిహద్దు సమస్యల పరిష్కారానికి చర్చలు కొనసాగుతున్నప్పటికీ.. చైనా నుంచి ముప్పు ఇంకా తొలగిపోలేదని అభిప్రాయపడ్డారు.

సరిహద్దు చట్టంపై కీలక ప్రకటన..
జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చిన వివాదాస్పద చైనా భూ సరిహద్దు చట్టాన్ని భారత ఆర్మీ చీఫ్ తిరస్కరించారు. ఇది భారత్‌పై ఎలాంటి ప్రభావం చూపదన్నారు. ఈ చట్టం వల్ల మా ద్వైపాక్షిక సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపదని, దానిని అంగీకరించబోమని ఇప్పటికే విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. గతంలో అమల్లో ఉన్న ఇతర ఒప్పందాలు, ప్రోటోకాల్‌లు మన వద్ద ఉన్నాయని, తాజాగా చైనా ఆమెదించిన కొత్త చట్టానికి చట్టబద్ధత లేదని భారత వర్గాలు తెలిపాయి.

SSD Storage: మీ ల్యాప్‌టాప్‌ స్లో అవుతోందా..? బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అందించే ఈ SSD స్టోరేజ్​ ప్రొడక్ట్స్‌ను ప్రయత్నించండి..


ఏంటీ వివాదాస్పద చట్టం?
మనదేశంలోని అరుణాచల్ ప్రదేశ్‌ని తమదిగా పేర్కొంటూ చైనా ఇటీవల పలు ప్రాంతాల పేర్లను మార్చింది. తూర్పు లద్దాఖ్‌లో సరిహద్దు ప్రతిష్టంభన అపరిష్కృతంగా ఉన్న సమయంలోనే ఈ చట్టాన్ని ఆమోదించడం గమనార్హం. కొత్త చట్టం ప్రకారం.. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత పవిత్రమైనవి. వాటిని ఉల్లంఘించలేం. సరిహద్దు ప్రాంతాల్లో ప్రజా సేవలు, మౌలిక సదుపాయాలను మెరుగుపరచేందుకు చర్యలు తీసుకునే అధికారం చైనాకు ఉంది.అక్కడి నిర్మాణాల వేగవంతం..
భూటాన్‌తో సరిహద్దు వెంబడి మౌలిక సదుపాయాల కల్పనను చైనా వేగవంతం చేసింది. ఈ ప్రాంతంలో చైనా సుమారు 200 నిర్మాణాలను నిర్మిస్తోందని పలు నివేదికలు సూచిస్తున్నాయి. భూటాన్ సరిహద్దుకు సమీపంలో బీజింగ్ ఆరు ప్రాంతాల్లో ఆవాసాలను నిర్మిస్తోందని ఉపగ్రహ చిత్రాల విశ్లేషణలో తేలింది. ఈ ప్రాంతంలో నిర్మాణ సంబంధిత కార్యకలాపాలు 2020 నుండి కొనసాగుతున్నాయి. మొదట్లో రైల్వే ట్రాక్‌లను నిర్మించింది. చైనా, భూటాన్‌ల మధ్య వివాదాస్పద భూభాగంలో కొత్తగా ఆవాసాలు కనిపిస్తున్నాయని నివేదికలు చెబుతున్నాయి. భూటాన్ భూభాగంలో నిర్మించిన చైనా స్థావరాలు భారత సరిహద్దు సమీపంలోని డోక్లామ్ పీఠభూమికి చాలా దగ్గరగా ఉన్నాయి.

భూటాన్ "చికెన్​ నెక్​"కు సమీపంగా చైనా?
టిబెట్, భూటాన్‌లలో సైనికులకు సౌకర్యాల కల్పన, గ్రామాల నిర్మాణం ద్వారా చైనా తన ప్రభావాన్ని పెంచుకుంటుందని నిపుణులు చెబుతున్నారు. డోక్లామ్ సెక్టార్ భారత్‌కు ముఖ్యమైనది. ఎందుకంటే ఇది చైనాలోని జోంపెల్రీ శిఖరానికి దగ్గరగా ఉంది. 'చికెన్ నెక్'గా పిలిచే సిలిగురి కారిడార్.. భారతదేశాన్ని ఈశాన్య ప్రాంతంతో అనుసంధానిస్తోంది. ఈశాన్య రాష్ట్రాలను దేశంలోని మిగిలిన ప్రాంతాలతో కలుపుతున్నందున ఈ కారిడార్ భారత్​కు ఎంతో ముఖ్యమైన ప్రాంతం. టిబెట్‌కు దగ్గరగా ఉండటం వల్ల చైనాపై భారత్ నిఘా ఉంచగలదు. గత కొన్నేళ్లుగా టిబెట్, భూటాన్ సరిహద్దు ప్రాంతాలను పటిష్ఠపరిచేందుకు చైనా భారీగా పెట్టుబడులు పెడుతోంది.
Published by:Veera Babu
First published:

Tags: Bharath, China, War

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు