నిరుద్యోగ భారతం : సమస్య ఎంత తీవ్రంగా ఉందో వెల్లడించిన CMIE

India's Unemployment Climbs to 7.2% : భారత్‌లో నిరుద్యోగ సమస్య ప్రస్తావన వచ్చిన ప్రతీసారి ప్రధాని మోదీ తమ ప్రభుత్వం చాలానే చేసిందని చెబుతున్నారు. ఉపాధి, ఉద్యోగ రంగాల్లో భారత్ పురోగమిస్తోందని.. గత నాలుగేళ్లలో 6లక్షల మంది ప్రొఫెషనల్స్ ఉపాధి పొందారని ఇటీవల వెల్లడించారు. అయితే వాస్తవాలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయని సర్వేలు, పలు నివేదికలు చెబుతున్నాయి.

news18-telugu
Updated: March 6, 2019, 9:49 AM IST
నిరుద్యోగ భారతం : సమస్య ఎంత తీవ్రంగా ఉందో వెల్లడించిన CMIE
ప్రతీకాత్మక చిత్రం (Artwork by Mir Suhail)
  • Share this:
భారత్‌లో నిరుద్యోగ సమస్య ఎంతలా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ప్రభుత్వ శాఖల్లో ఏ చిన్న అటెండర్ పోస్టుకు నోటిఫికేషన్ విడుదలైనా.. పీజీలు, పీహెచ్‌డీలు చేసినవారు కూడా దరఖాస్తులు చేసుకుంటున్న పరిస్థితి. దేశంలో నిరుద్యోగానికి సంబంధించి సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ(CMIE) సంస్థ తాజాగా ఆసక్తికర విషయాలు వెల్లడించింది.
2016 సెప్టెంబర్ నుంచి ఇప్పటివరకు నమోదైన నిరుద్యోగ రేటును పరిశీలిస్తే.. ఫిబ్రవరిలో అత్యధికంగా 7.2శాతం నిరుద్యోగ రేటు నమోదైంది. గతేడాది 2018, ఫిబ్రవరి నెలలో నిరుద్యోగ రేటు 5.9శాతం ఉండగా ఇప్పుడది మరింత పెరిగింది.దేశవ్యాప్తంగా కొన్ని వేల ఇళ్ల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం.. ఈ సర్వే నివేదికను తయారుచేసినట్టు CMIE తెలిపింది.

ముంబైలోని థింక్ ట్యాంక్ సంస్థ ఛైర్మన్ మహేష్ వ్యాస్ తెలిపిన వివరాల ప్రకారం.. గతేడాది ఫిబ్రవరి నాటికి ఇండియాలో 406 మిలియన్ల ఉద్యోగస్తులు ఉండగా.. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి అది 400 మిలియన్లకే పరిమితమైంది. భారత్‌లో నిరుద్యోగ సమస్య ప్రస్తావన వచ్చిన ప్రతీసారి ప్రధాని మోదీ తమ ప్రభుత్వం చాలానే చేసిందని చెబుతున్నారు. ఉపాధి, ఉద్యోగ రంగాల్లో భారత్ పురోగమిస్తోందని.. గత నాలుగేళ్లలో 6లక్షల మంది ప్రొఫెషనల్స్ ఉపాధి పొందారని ఇటీవల వెల్లడించారు. అయితే వాస్తవాలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయని సర్వేలు, పలు నివేదికలు చెబుతున్నాయి.

నిరుద్యోగానికి సంబంధించి కొన్ని వారాల క్రితం ఓ వార్తా పత్రిక కొన్ని లెక్కలను బయటపెట్టింది. అయితే అధికారులు మాత్రం దాన్ని కొట్టిపారేశారు. సదరు పత్రిక బయటపెట్టిన వివరాల ప్రకారం.. దేశంలో గత 45ఏళ్లలో ఎన్నడూ లేనంతగా 2017-18లో నిరుద్యోగ సమస్య తీవ్రమైంది.
జవనవరిలో CMIE విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం.. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ అమలు తర్వాత 2018లో దాదాపు 11మిలియన్ల మంది తమ ఉద్యోగాలు కోల్పోయారు.
ప్రభుత్వం మాత్రం దీనిపై ఎలాంటి వివరణ ఇవ్వలేదు. నోట్ల రద్దు ప్రభావం ఉద్యోగాలు, చిన్న తరహా పరిశ్రమలపై ఎలాంటి ప్రభావం చూపించిందన్న దానికి సంబంధించి తమవద్ద ఎలాంటి డేటా లేదని గత నెలలో ప్రభుత్వం ప్రకటించింది.

ఇది కూడా చదవండి : 9 లక్షల ఉద్యోగాలు కల్పించామని బెంగాల్ చెబుతోంది.. ఇక జాబ్స్ లేనిదెక్కడ? : మోదీ
First published: March 6, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>