Arjun Mk-1A: 118 అర్జున్ ఎంకే-1ఏ యుద్ధ ట్యాంకులకు ఆర్డర్ ఇచ్చిన కేంద్రం.. ఎందుకు? వాటి ప్రత్యేకతలేంటి?

ప్రతీకాత్మక చిత్రం

Arjun MK- 1A Battle tanks: యుద్ధ ట్యాంకులు పగలు, రాత్రి కచ్చితమైన సామర్థ్యాలతో పనిచేస్తాయని, అన్ని భూభాగాలపై వేగంగా కదులుతాయని రక్షణ శాఖ స్పష్టం చేసింది.

  • Share this:
భారత సైన్యంలో త్వరలో అధునాతన యుద్ధ ట్యాంకులు చేరనున్నాయి. యుద్ధ సామర్థ్యాలను మరింత మెరుగుపరిచేందుకు 118 అర్జున్ ఎంబీటీలను (Main Battle Tanks- MBTs) భారత రక్షణ శాఖ ఆర్డర్ చేసింది. ఈ ఒప్పందం విలువ రూ.7523 కోట్లు. అర్జున్‌ యుద్ధ ట్యాంకుల అప్‌గ్రేడ్ వెర్షన్ అయిన ఎంకే-1ఏ (Arjun Mk-1A) వేరియంట్‌ను రక్షణ శాఖ తాజాగా ఆర్డర్ చేసింది. చెన్నైలోని హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీ (HVF) వీటిని తయారు చేస్తోంది. ఈ ఎంబీటీ ఎంకే-1ఏ అనేది అర్జున్ ట్యాంకులోని అత్యాధునిక వేరియంట్. ఫైర్ పవర్, మొబిలిటీ, మనుగడను మెరుగుపరచడానికి దీన్ని సరికొత్తగా రూపొందించారు.

ఎంకే1 వేరియంట్‌లో 72 కొత్త ఫీచర్లు ఉంటాయి. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ ట్యాంకులను HVF నుంచి ఆర్మీ పొందనుంది. ఈ ఒప్పందానికి సంబంధించిన వివరాలను సెప్టెంబరు 23న రక్షణ మంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. "ఈ ఆర్డర్ విలువ రూ.7523 కోట్లు. రక్షణ రంగంలో మేకిన్ ఇండియా కార్యక్రమానికి మరింత ప్రోత్సాహాన్ని అందించడమే కాకుండా 'ఆత్మనిర్బర్ భారత్' లక్ష్యాన్ని సాధించడానికి ఇది ముందడుగు అవుతుంది" అని ఈ ప్రకటన పేర్కొంది.

నా భార్య స్నానం చేయదు.. అందుకే విడాకులు.. ఇలాంటి విచిత్ర భర్తను ఎక్కడా చూసి ఉండరు


ఈ యుద్ధ ట్యాంకులు పగలు, రాత్రి కచ్చితమైన సామర్థ్యాలతో పనిచేస్తాయని, అన్ని భూభాగాలపై వేగంగా కదులుతాయని రక్షణ శాఖ స్పష్టం చేసింది. అత్యాధునిక రక్షణ సాంకేతికతల్లో స్వదేశీ సామర్థ్యాన్ని ప్రదర్శించే ప్రధాన ప్రాజెక్ట్ అని తెలిపింది. ఈ యుద్ధ ట్యాంకుల్లో ఉన్నతమైన ఫైర్ పవర్, ఆల్ టెర్రియన్ మొబిలిటీ, అధునాతన సాంకేతికత, మల్టీ లేయర్డ్ ప్రొటెక్షన్ లాంటి ప్రత్యేకతలు ఉన్నాయని రక్షణ విభాగం వెల్లడించింది. వీటి ద్వారా హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీ దాదాపు 8 వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని స్పష్టం చేసింది.

నరేంద్ర గిరి కేసుపై యూపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. కేసు విచారణకు  రంగంలోకి దిగిన ఈ సంస్థ

ఇండియన్ ఆర్మీ కోసం ఆర్డర్ చేసిన ఈ యుద్ధ ట్యాంకులో డీఆర్డీఓ అనేక అప్‌గ్రేడ్స్ చేర్చింది. డీఆర్డీఓ, కంబాట్ వెహికల్స్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్(CVRDE) వీటిని అభివృద్ధి చేశాయి. కేవలం రెండేళ్లలోనే ఈ యుద్ధట్యాంకులను నిర్మించాయి. మొదటిసారి జూన్ 2010లో ఈ యుద్ధ ట్యాంకులకు ఈ రెండు సంస్థలు శ్రీకారం చుట్టాయి. 2012 జూన్‌లో ట్రయల్స్ నిర్వహించారు. 2012-15 మధ్య కాలంలో 7 వేల కిలోమీటర్లకుపైగా(డీఆర్డీఓ ట్రయల్స్ లో) కవర్ చేసింది. ఆటోమోటివ్, సబ్‌స్టాన్షియల్ ఫైరింగ్ లాంటి వివిధ దశలను ఉన్నతాధికారులు విస్తృతంగా పరిక్షించారు.
Published by:Shiva Kumar Addula
First published: