Home /News /national /

INDIAS OLDEST RUNNING NEWS PAPER MUMBAI SAMACHAR ENTERS INTO 200TH YEAR HERE IS INTERESTING DETAILS GH SK

Mumbai Samachar: 200 ఇయర్స్ నాటౌట్.. మన దేశంలో అతి ప్రాచీన వార్తాపత్రిక విశేషాలివే

ముంబై సమాచార్ కార్యాలయం

ముంబై సమాచార్ కార్యాలయం

Mumbai Samachar: గతంలో ఈ పత్రికను బాంబే సమాచార్ అని పిలిచేవారు. బాంబే సమాచార్ మొదట్లో వార పత్రికగా ప్రయాణాన్ని ప్రారంభించింది. అప్పట్లో నావల రాకపోకలు, సముద్రయానం ద్వారా సరకు రవాణా, ఆస్తుల అమ్మకాలు, కొనుగోళ్ల సమాచారం.. వంటి వ్యాపార వార్తలను మాత్రమే ప్రచురించేవారు.

ఇంకా చదవండి ...
భారత్‌లో పంపిణీలో ఉన్న అత్యంత పురాతన వార్తా పత్రిక అయిన ముంబై సమాచార్ మరో ఘనతను తన ఖాతాలో వేసుకుంది. జూలై 1తో సంస్థకు 199 ఏళ్లు నిండి.. 200వ వసంతంలోకి అడుగుపెట్టింది. మరో ఏదాదిలో డబుల్ సెంచరీతో తిరుగులేని రికార్డును తన పేరుతో లిఖించనుంది. వార పత్రికగా మొదలైన ఈ గుజరాతీ వార్తాపత్రిక ప్రస్థానం ఇంకా కొనసాగుతోంది. ఈ న్యూస్ పేపర్‌ను 1822లో మొదటిసారి ప్రచురించారు. ముంబైలోని ఫోర్ట్ ఏరియాలో హార్నిమాన్ సర్కిల్ వద్ద ఉన్న కార్యాలయం నుంచి ఇది వెలువడింది. దీన్ని పార్సీ పండితుడు ఫర్దూన్జీ మురాజ్‌బాన్ స్థాపించారు. ఈ పత్రిక కోసం ఆయన ఇతర ప్రచురణ సంస్థల్లో పనిచేస్తూ, ప్రయోగాలు చేశారు.

గతంలో ఈ పత్రికను బాంబే సమాచార్ అని పిలిచేవారు. బాంబే సమాచార్ మొదట్లో వార పత్రికగా ప్రయాణాన్ని ప్రారంభించింది. అప్పట్లో నావల రాకపోకలు, సముద్రయానం ద్వారా సరకు రవాణా, ఆస్తుల అమ్మకాలు, కొనుగోళ్ల సమాచారం.. వంటి వ్యాపార వార్తలను మాత్రమే ప్రచురించేవారు. ఆ తరువాత ఎన్నో ఒడిదొడులను ఎదుర్కొంటూ సర్క్యులేషన్ పెంచుకుంది. ఈ క్రమంలో ఎంతోమంది చేతులు మారింది. ఒకానొక సమయంలో దివాలా తీసిన తరువాత.. ఈ సంస్థ 1933లో కామా కుటుంబం చేతుల్లోకి వెళ్లింది.

కామా నార్టన్ అండ్ కో సంస్థ.. గతంలో ప్రచురణకు అవసరమయ్యే సిరా, న్యూస్ ప్రింట్‌ను సరఫరా చేసేది. అయితే సంస్థ దివాలా తీసిన సందర్భంలో లిక్విడేషన్ చేయాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయి. దీంతో సిబ్బంది ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి ఉన్నందువల్ల.. సంస్థ యాజమాన్య హక్కులను ముంచెర్జీ కామాకు బదిలీ చేయాలని కోర్టు నిర్ణయించింది. ప్రస్తుతం ముంబై సమాచార్ డైరెక్టర్‌గా ఉన్న హోర్ముస్జీ కామా.. 40 సంవత్సరాల క్రితం ఆ బాధ్యతలు స్వీకరించారు. ఒక వార్తాపత్రిక 200 ఏళ్లు మనుగడ సాధించడం గొప్పవిషయమని, 300 ఏళ్ల వరకు కూడా సంస్థ ప్రయాణం కొనసాగుతుందని చెబుతున్నారు హోర్ముస్జీ కామా.

బ్రిటీష్ కాలం నాటి ఎర్రటి భవనంలో వెలిసిన ఈ వార్తా సంస్థ.. ఇప్పటికే ఆ భవనం కేంద్రంగానే పనిచేస్తోంది. ప్రస్తుతం ముంబై, నాలుగు ఇతర కేంద్రాలలో సంస్థ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఇక్కడ 200 మందికి పైగా సిబ్బంది పనిచేస్తున్నారు. బాంబే సమాచర్ భారత్‌లో అతి పురాతనమైన దేశీయ భాషా వార్తాపత్రికగా గుర్తింపు సాధించింది. 2003లో నీలేష్ దవే ఈ దినపత్రికకు ఎడిటర్‌గా నియమితులయ్యారు. ముంబై సమాచార్‌ సంస్థలో భాగం కావడం తన జీవిత స్వప్నమని ఆయన చెబుతున్నారు. మహమ్మారి కారణంగా మొత్తం ప్రింటింగ్ ప్రెస్ పరిశ్రమ ఒకిదొడుకులు ఎదుర్కొంటున్నప్పటికీ, నకిలీ వార్తలకు స్థానం లేని ఏకైక మాధ్యమంగా ఉన్న ప్రింట్ న్యూస్ త్వరలోనే పూర్వ స్థితికి వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Published by:Shiva Kumar Addula
First published:

Tags: Maharashtra, Mumbai

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు