హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Hottest Summer: 122 ఏళ్లలో అత్యధిక ఉష్ణోగ్రత -మార్చిలోనే మాడు పగిలింది -ఏప్రిల్‌లో మంటలే!

Hottest Summer: 122 ఏళ్లలో అత్యధిక ఉష్ణోగ్రత -మార్చిలోనే మాడు పగిలింది -ఏప్రిల్‌లో మంటలే!

భానుడు మరింత భగభగ మండుతున్నాడు. మార్చిలోనే మంటలు మండించాడు. ఏప్రిల్ ఎలా ఉండబోతోందో తలుచుకుంటేనే వణుకుపుట్టే పరిస్థితి. ఐఎండీ చెప్పిన కీలక విషయాలివే..

భానుడు మరింత భగభగ మండుతున్నాడు. మార్చిలోనే మంటలు మండించాడు. ఏప్రిల్ ఎలా ఉండబోతోందో తలుచుకుంటేనే వణుకుపుట్టే పరిస్థితి. ఐఎండీ చెప్పిన కీలక విషయాలివే..

భానుడు మరింత భగభగ మండుతున్నాడు. మార్చిలోనే మంటలు మండించాడు. ఏప్రిల్ ఎలా ఉండబోతోందో తలుచుకుంటేనే వణుకుపుట్టే పరిస్థితి. ఐఎండీ చెప్పిన కీలక విషయాలివే..

  ఈ వేసవిలో భానుడు మరింత భగభగ మండుతున్నాడు. మార్చిలోనే మంటలు మండించాడు. ఏప్రిల్ ఎలా ఉండబోతోందో తలుచుకుంటేనే వణుకుపుట్టే పరిస్థితి. ప్రస్తుతం ఉదయం 8 గంటల నుంచే ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. భానుడి ప్రతాపానికి మాడు పగిలిపోతోంది. మిట్ట మధ్యాహ్నం వేళల్లో జనాలు బయటకు రావడానికే జంకుతున్నారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండ తీవ్రతకు రోడ్లన్ని నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. పెరిగిన ఎండలకు సంబంధించి భారత వాతావరణ శాఖ పలు కీలక విషయాలను వెల్లడించింది. గత 122 ఏళ్ల నుంచి భారతదేశ చరిత్రలోనే ఈ ఏడాది(2022) మార్చి అత్యంత వేడి నెలగా నమోదైందని ప్రకటించింది.

  ఇది 2010లో నమోదైన ఆల్ టైమ్-సగటు గరిష్ఠ ఉష్ణోగ్రత రికార్డును బద్దలు కొట్టింది. మార్చి 2010లో భారతదేశం సగటు నెలవారీ ఉష్ణోగ్రత 33.09 డిగ్రీల సెల్సియస్‌కు పెరిగింది. అయితే, గత నెలలో సగటు నెలవారీ ఉష్ణోగ్రత 33.1 డిగ్రీలుగా నమోదైంది. 1901 నుంచి మార్చి నెలలో నమోదైన అన్ని అధిక ఉష్ణోగ్రతల రికార్డులను ఇది అధిగమించింది. ఈ ఏడాది మార్చి 20న ఢిల్లీలోని పితంపుర పర్యవేక్షణ స్టేషన్‌లో 39.9 డిగ్రీల సెల్సియస్ గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఇదే ఈ ఏడాది అత్యంత వేడి రోజుగా నమోదైనట్లు ఐఎండీ తెలిపింది. హిమాచల్ ప్రదేశ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్‌లోని చాలా ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4.5 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి.

  Vastu Tips: మీ ఇంట్లో వీటిని ఉంచుకుంటే శుభం, పనులు విజయవంతం -Lucky Charm

  గతకొన్నేళ్ల నుంచి మార్చి నెలలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి. 2020, 2021లో మార్చి ఉష్ణోగ్రతలు గత రికార్డులను బద్దలు కొట్టాయి. IMD ప్రకారం, నెలవారీ సగటు గరిష్ఠ ఉష్ణోగ్రత పరంగా 2021 మార్చి నెల గత 121 ఏళ్లలో మూడో అత్యంత వేడి నెలగా నమోదైంది.

  మార్చి నెలలో నమోదైన ఉష్ణోగ్రతలపై IMD సమీక్షలో కీలక విషయాలు వెలుగు చూశాయి. ఈ ఏడాది మార్చిలో దేశం మొత్తం మీద నెలవారీ సగటు గరిష్ఠ, కనిష్ఠ, సగటు ఉష్ణోగ్రతలు వరుసగా 32.65 డిగ్రీల సెల్సియస్, 19.95 , 26.30 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు కాగా, 1981-2010 మధ్య మార్చిలో దేశం మొత్తం మీద నెలవారీ సగటు గరిష్ఠ, కనిష్ఠ సగటు ఉష్ణోగ్రతలు వరుసగా 31.24 డిగ్రీల సెల్సియస్, 18.87 డిగ్రీల సెల్సియస్, 25.06 డిగ్రీల సెల్సియస్‌గా నమోదు అయ్యాయి. ఈ ఏడాది మార్చిలో దేశంలోని పలు ప్రాంతాల్లో 40 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రత నమోదు కావడం గమనార్హం.

  Unmarried Daughter: పెళ్లి కాని మహిళలు పేరెంట్స్ నుంచి వివాహ ఖర్చులు తీసుకోవచ్చు: హైకోర్టు

  IMD నేషనల్ వెదర్ ఫోర్‌ క్యాస్టింగ్ సెంటర్ శాస్త్రవేత్త రాజేంద్ర జెనామణి మాట్లాడుతూ.. ‘ప్రపంచవ్యాప్తంగా గత రెండు దశాబ్దాలలో అత్యంత వేడి నమోదైన సంవత్సరాలు ఉన్నాయి. వాతావరణ మార్పులు భారతదేశంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వేడిగాలులు, తతుపాను తీవ్రత లేదా భారీ వర్షపాతం కూడా ఇందుకు కారణం కావచ్చు’ అని ఆయన అభిప్రాయపడ్డారు.

  KCR ఇష్టం, కానీ MLAsతో కష్టం -సిట్టింగ్‌లపై ప్రశాంత్ కిషోర్ షాకింగ్ రిపోర్ట్ -వీరికి ఈసారి టికెట్ లేనట్టే

  వాయవ్య, మధ్య భారతం, ఈశాన్య ప్రాంతాల్లో ఏప్రిల్‌లో సాధారణం కంటే గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని IMD తెలిపింది. ఇక దక్షిణం, తూర్పు ప్రాంతాలు, ఈశాన్య పరిసర ప్రాంతాలలో సాధారణం లేదా అంత కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ డైరక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహపాత్ర తెలిపారు.

  First published:

  ఉత్తమ కథలు