ఓడలో గోవా యాత్ర..ఆంగ్రియాలో విహరిద్దాం రండి..!

9 అంతస్తులున్న ఆంగ్రియా క్రూయిజ్‌లో మొత్తం 104 గదులు ఉంటాయి. నౌక సిబ్బంది కాకుండా 346 మంది ప్రయాణించవచ్చు. వీటిని డార్మిటరీ, డీలక్స్‌, లగ్జరీ సహా మొత్తం ఎనిమిది కేటగిరీలుగా విభజించారు.

news18-telugu
Updated: October 21, 2018, 4:26 PM IST
ఓడలో గోవా యాత్ర..ఆంగ్రియాలో విహరిద్దాం రండి..!
ఆంగ్రియా క్రూయిజ్
  • Share this:
గోవా..పర్యాటకుల స్వర్గధామం..! విహారయాత్రకు వెళ్లేవారికి గోవా ఎప్పుడూ ఫస్ట్ చాయిస్‌గా ఉంటుంది. అరేబియా తీరం, అందమైన బీచ్‌లు, క్యాసినోలు, వాటర్ గేమ్స్, సీ ఫుడ్..ఇలా ఒక్కటా రెండా గోవా టూర్‌ ఆద్యంతం మరుపురాని అనుభూతులను మిగుల్చుతుంది. ఐతే గోవా వెళ్లే పర్యాటకులు ఎక్కువగా విమానాలు, బస్సుల్లోనే వెళ్తుంటారు. కానీ నడి సంద్రంలో అలల మీద తెలియాడుతూ ఉంటే..ఆ కిక్కే వేరు..! అరేబియా తీరంలో విహరిస్తూ గోవా అందాలను వీక్షిస్తే..ఆ మజానే వేరు..! ఇలాంటి ఆహ్లాదం, ఆనందం కోరుకునే వారి కోసమే ఆంగ్రియా క్రూయిజ్ అందుబాటులోకి వచ్చింది.

ఆంగ్రియా..ఇండియాలో మొట్టమొదటి విలాసవంతమైన పర్యాటన నౌక. ముంబై నుంచి గోవాకు రాకపోకలు సాగించే ఈ లగ్జరీ క్రూయిజ్‌ను కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఈ నెల 20న ప్రిన్సెస్ డాక్ నుంచి జెండా ఊపి ప్రారంభించారు. ఈ నెల 24 నుంచి సాధారణ ప్రయాణికులకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. రోజు విడిచి రోజు ముంబయి నుంచి సాయంత్రం 4 గంటలకు బయల్దేరి మరుసటి రోు ఉదయం 9 గంటలకల్లా గోవాకు చేరుతుంది. మొత్తం 16 గంటలపాటు నాన్‌స్టాప్‌ ప్రయాణం సాగుతుంది. ఈ ప్రయాణంలో ఓ సూర్యాస్తమయం, ఓ సూర్యోదయాన్ని ప్రయాణికులు వీక్షించవచ్చు.

భారత తొలి నావల్ కమాండర్ సర్ఖేల్ కన్హోజి ఆంగ్రి స్మారకార్థం ఈ నౌకకు ఆంగ్రియా పేరు పెట్టారు. ఛత్రపతి శివాజి సైన్యంలో కన్హోజి ఆంగ్రి పనిచేశారు. జల ముప్పులను ఎదుర్కొనేందుకు ప్రత్యేక సైన్యం ఉండాలని శివాజి నమ్మేవారు.


ఆంగ్రియా ప్రత్యేకతలు:


9 అంతస్తులున్న ఆంగ్రియా క్రూయిజ్‌లో మొత్తం 104 గదులు ఉంటాయి. నౌక సిబ్బంది కాకుండా 346 మంది ప్రయాణించవచ్చు. వీటిని డార్మిటరీ, డీలక్స్‌, లగ్జరీ సహా మొత్తం ఎనిమిది కేటగిరీలుగా విభజించారు. ఆయా గదుల ఎంపికను బట్టి టికెట్ ధరలు ఉంటాయి. జపాన్‌లో దీన్ని తయారు చేశారు. ఆంగ్రియాలో 2 రెస్టారెంట్లతో పాటు 6 బార్లు, ఒక విలాసవంతమైన స్విమ్మింగ్‌పూల్‌, స్పా, పబ్‌ వంటి అత్యాధునిక సౌకర్యాలున్నాయి. ముంబై నుంచి గోవాకు టికెట్‌ ధర రూ. 6,000, సూట్‌ రూమ్‌ రూ.10,000. ఇందులో స్నాక్స్, డిన్నర్, బ్రేక్‌ఫాస్ట్‌ కలిసి ఉన్నాయి.

India's First Luxury Cruise Has Everything From Infinity Pools to Helideck. Take a Glimpse Inside
ఆంగ్రియా క్రూయిజ్ లోపలి భాగం


India's First Luxury Cruise Has Everything From Infinity Pools to Helideck. Take a Glimpse Inside
ఆంగ్రియా క్రూయిజ్ లోపలి భాగం
India's First Luxury Cruise Has Everything From Infinity Pools to Helideck. Take a Glimpse Inside
ఆంగ్రియా క్రూయిజ్ లోపలి భాగం
First published: October 21, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు