9mm Machine Pistol: సైనికుల కోసం స్వదేశీ పిస్టల్.. అస్మిగా నామకరణం

Image credits Twitter

9mm Machine Pistol: కరోనా సందర్భంగా గతేడాది ప్రధాని మోడీ తీసుకొచ్చిన ఆత్మనిర్భర భారత్ లో భాగంగా ఈ తుపాకీని తయారుచేసింది రక్షణ మంత్రిత్వ శాఖ. వీటిని ఎగుమతి చేసే ఆలోచన కూడా ఉన్నట్టు సంబంధిత శాఖ అధికారులు తెలిపారు.

  • News18
  • Last Updated :
  • Share this:
    భారత సైన్యం కోసం తొలిసారిగా దేశీయంగా తుపాకీని తయారుచేశారు. దీనిని రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో), ఇండియన్ ఆర్మీ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. పూణెలోని ఇన్ఫాంట్రీ స్కూల్, ఆయుధ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ (ఎఆర్డీఇ) లు ఈ తుపాకీని తయారుచేశాయి. ఈ ఆయుధాన్ని రికార్డు సమయంలో కేవలం నాలుగు నెలల కాలంలోనే తయారుచేయడం గమనార్హం. ప్రస్తుతం బలగాలు వాడుతున్న 9 ఎంఎం తుపాకుల స్థానంలో వీటిని వాడనున్నారు. త్రీడీ ప్రింటింగ్ తో తయారుచేసిన ఈ పిస్టల్ ను బుధవారం ఆర్మీ ఆవిష్కరణల కార్యక్రమం సందర్భంగా ఆవిష్కరించారు.

    ఈ తుపాకీ రేంజ్ 100 మీటర్లు. దీనిని తయారుచేయడానికి ఒక్కో తుపాకీకి రూ. 50 వేల కంటే తక్కువే ఖర్చయిందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ తుపాకీని కేవలం సైన్యం కోసమే గాక.. వీఐపీల రక్షణ కోసం నియమించే గార్డులకు కూడా ఇవ్వనున్నట్టు తెలుస్తున్నది. ఈ తుపాకీకి ‘అస్మి’ అని నామకరణం చేశారు. దీనికి అర్థం ‘గౌరవం’, ‘ఆత్మగౌరవం’..





    కరోనా సందర్భంగా గతేడాది ప్రధాని మోడీ తీసుకొచ్చిన ఆత్మనిర్భర భారత్ లో భాగంగా ఈ తుపాకీని తయారుచేసింది రక్షణ మంత్రిత్వ శాఖ. వీటిని ఎగుమతి చేసే ఆలోచన కూడా ఉన్నట్టు సంబంధిత శాఖ అధికారులు తెలిపారు.
    Published by:Srinivas Munigala
    First published: