మన పక్క దేశం చైనా (China)లో కరోనా విలయ తాండవం (Covid-19 Pandemic) చేస్తుండడంతో.. ఇక్కడ కూడా కొంత టెన్షన్ నెలకొంది. మళ్లీ కరోనా మహమ్మారి పడగ విప్పుతుందా అని ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే అందరూ బూస్టర్ డోస్ తీసుకునేందుకు మొగ్గుచూపుతున్నారు. మనదేశంలో ఇప్పటికే చాలా మంది రెండు డోసుల టీకాను తీసుకున్నారు. కానీ బూస్టర్ డోస్ పట్ల మాత్రం నిర్లక్ష్యం వహించారు. చాలా మంది తీసుకోలేదు. ఇప్పుడు చైనా సహా పలు దేశాల్లో విజృంభిస్తుండడంతో.. ఇప్పుడు ప్రికాషన్ డోస్ తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఐతే ఇప్పటికే మనదేశంలో కోవాగ్జిన్ (Covaxin),కోవిషీల్డ్ (covishield), స్పుత్నిక్ (Sputnik), కొర్బెవాక్స్ (Corbevax) టీకాలు అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ సూది ద్వారా ఇచ్చే టీకాలు. కానీ మనదేశంలో తొలిసారిగా ముక్కు ద్వారా వేసుకునే కోవిడ్ టీకా వచ్చేసింది. అదే ఇన్ కొవాక్ (InCovacc). కొవాగ్జిన్ టీకాను తయారుచేసిన భారత్ బయోటెక్ (హైదరాబాద్) కంపెనీయే.. దీనిని కూడా అభివృద్ధి చేసింది.
COVID: మళ్లీ రేగుతున్న కొవిడ్ కలవరం..వర్క్ ఫ్రమ్ హోమ్ వైపు చూస్తున్న కంపెనీలు
ఇన్ కొవాక్ టీకా (Incovacc Vaccine)ను ముక్కు ద్వారా రెండు చుక్కలు వేస్తారు. ప్రభుత్వ ఆస్పత్రులు, ఆరోగ్య, టీకా కేంద్రాలకు ఇన్ కొవాక్ టీకాను రూ.325గా నిర్ధారించారు. జీఎస్టీ అదనం. ప్రైవేటు ఆస్పత్రుల్లో మాత్రం దీని ధర రూ.800గా ఉంది. ఐతే ప్రైవేట్ ఆస్పత్రుల్లో.. ఐదు శాతం జీఎస్టీ రూ.40తో పాటు రూ.150 మేర అడ్మినిస్ట్రేటివ్ చార్జీల కింద వసూలు చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ లెక్కన ప్రైవేటు ఆస్పత్రుల్లో ఐకొవాక్ టీకా సింగిల్ డోసు ధర దాదాపుగా రూ.1000 మేర ఉంటుంది. ఐతేఈ వ్యాక్సిన్ ఇంకా టీకా కేంద్రాల్లో లభించడం లేదు. జనవరి నాలుగో వారం నుంచి కోవిన్ పోర్టల్‌లో ఇన్ కొవాక్ అందుబాటులో ఉంటుంది.
Covid-19: చైనాను చూసి భయపడాల్సిన అవసరం లేదు..మనకు కరోనా ముప్పు లేదు.. కానీ..
ఇలా బుక్ చేసుకోండి:
కోవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ డోస్ తీసుకోవాలనుకునే వారు COWIN పోర్టల్‌లోకి వెళ్లాలి. కొత్తగా రిజిస్ట్రేషన్ అవసరం లేదు. ఆల్రెడీ రెండు డోసుల టీకాలు తీసుకొని ఉంటారు కనుక మీ నెంబర్ రిజిస్టరయ్యి ఉంటుంది. ఆ నెంబర్‌తో కోవిన్ పోర్టల్‌లో లాగిన్ అవ్వాలి. ఓటీపీ ద్వారా వెరిఫై చేసుకోవాలి.
లాగిన్ అయిన తర్వాత.. అక్కడ మీ వివరాలు కనిపిస్తాయి. ఇప్పటికే తీసుకున్న వ్యాక్సిన్ వివరాలు ఉంటాయి. మొదటి రెండు పూర్తయ్యాయని.. గ్రీన్ కలర్‌లో టిక్ మార్క్ ఉంటుంది. ఆ పక్కనే రెడ్ కలర్ ప్రికాషన్ డోస్ అని ఉంటుంది. అక్కడ షెడ్యూల్ ఆప్షన్ క్లిక్ చేయాలి.
అనంతరం మీ జిల్లా లేదా పిన్ కోడ్ ఎంటర్ చేస్తే.. మీ సమీపంలో ఉన్న వాక్సిన్ కేంద్రాలు కనిపిస్తాయి. ఏయే తేదీల్లో ఏ వ్యాక్సిన్ అందుబాటులో ఉందో అక్కడ చూపిస్తుంది. మీకు వ్యాక్సిన్ వేసుకోవాలనుకున్న తేదీని క్లిక్ చేసి.. సెంటర్‌ని సెలక్ట్ చేసుకోవాలి. అనంతరం టైమ్ స్లాట్ ఎంచుకోవాలి.
ఆ సమయానికి కోవిడ్ వ్యాక్సిన్ కేంద్రానికి వెళ్లి.. మీ వివరాలు అందజేసి.. ప్రికాషన్ డోస్ తీసుకోవాలి. అనంతరం అదే కోవిడ్ యాప్ ద్వారా ప్రికాషన్ డోస్‌కి సంబంధించిన వ్యాక్సినేషన్ సర్టిఫికేట్‌ను డౌన్ లోడో చేసుకోవాలి. నాసల్ వ్యాక్సిన్ వద్దనుకుంటే.. గతంలో మీరు తీసుకున్న టీకానే తీసుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Corona cases, Corona Vaccine, Coronavirus, Covid-19