హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

cervical cancer vaccine: గర్భాశయ క్యాన్సర్ నుంచి మహిళలకు విముక్తి.. స్వదేశీ టీకా వచ్చేసింది

cervical cancer vaccine: గర్భాశయ క్యాన్సర్ నుంచి మహిళలకు విముక్తి.. స్వదేశీ టీకా వచ్చేసింది

ప్రతీకాత్మక చిత్రం)

ప్రతీకాత్మక చిత్రం)

Cervical cancer vaccine: భారతదేశంలో ప్రతి సంవత్సరం 1.23 లక్షల గర్భాశయ క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. ఇందులో దాదాపు 67,000 మంది మహిళలు మరణిస్తున్నారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  మనదేశంలో మహిళలను పట్టిపీడిస్తున్న ప్రాణాంతకమైన వ్యాధుల్లో గర్భాశయ క్యాన్సర్ కూడా ఒకటి. ఈ వ్యాధి బారిన పడి ఏటా ఎంతో మంది మహిళలు చనిపోతున్నారు. ఐతే   గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ (Cervical cancer) నుంచి మహిళలకు విముక్తి కల్పించే ఔషధం వచ్చేసింది. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌కు స్వదేశీ వ్యాక్సిన్‌ను నేడు ఢిల్లీ (New Delhi)లో లాంచ్ చేయనున్నారు. సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా,  డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ సంయుక్తంగా ఈ టీకాను అభివృద్ధి చేశాయి. ఇది మొదటి క్వాడ్రివాలెంట్ హ్యూమన్ పాపిల్లోమావైరస్ టీకా (qHPV). క్యూహెచ్‌వీపీ టీకాను కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ కాసేపట్లో ఢిల్లీలో ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమంలో సీరం ఇన్‌స్టిట్యూట్‌, బయోటెక్నాలజీ విభాగానికి చెందిన సీనియర్‌ అధికారులు, వైద్యులు హాజరుకానున్నారు.LPG Price: భారీగా తగ్గిన ఎల్పీజీ సిలిండర్ ధర.. సెప్టెంబర్ మొదటి రోజే అదిరిపోయే శుభవార్త
  ఈ టీకా సాయంతో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ వ్యాధిని నివారించడం సులభతరం అవుతుంది. ఈ వ్యాక్సిన్‌‌కు డగ్ర్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీజీసీఐ) జూలై 12న అనుమతి ఇచ్చింది. నేషనల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాం కింద 9-14 ఏళ్ల బాలికలకు గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ టీకా ఇవ్వనున్నారు. త్వరలోనే దేశవ్యాప్తంగా టీకా పంపిణీ ప్రారంభమవుతుంది. 85-90 శాతం గర్భాశయ క్యాన్సర్ కేసులు హ్యామన్ పాపిల్లోమా వైరస్ వల్లే వస్తుంది. క్యూహెచ్‌వీపీ టీకా ఈ వైరస్‌ను నిరోధించి గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. చిన్న పిల్లలకు ఇస్తే దాదాపుగా 30 ఏళ్ల వరకు క్యాన్సర్ రాకుండా అడ్డుకోగలదని డాక్టర్లు చెబుతున్నారు.


  WHOకి చెందిన ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ (IARC-WHO) డేటా ప్రకారం.., భారతదేశంలో ప్రతి సంవత్సరం 1.23 లక్షల గర్భాశయ క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. ఇందులో దాదాపు 67,000 మంది మహిళలు మరణిస్తున్నారు. గర్భాశయ క్యాన్సర్‌లో భారతదేశం ప్రపంచంలో ఐదవ స్థానంలో ఉంది. క్యానర్‌లో సర్వైకల్ క్యాన్సర్ రెండో అత్యంత సాధారణమైనది. గణాంకాల ప్రకారం.. 15 నుండి 44 సంవత్సరాల వయస్సు గల మహిళల్లో క్యాన్సర్ మరణాలకు గర్భాశయ క్యాన్సర్ రెండవ ప్రధాన కారణం.


  సర్వైకల్ క్యాన్సర్ అనేది గర్భాశయ ముఖద్వారంలో మొదలయ్యే ఒక రకమైన క్యాన్సర్. నిజానికి స్త్రీ గర్భాశయం కింది భాగంలో గర్భాశయాన్ని, యోనిని కలిపే సిలిండర్ ఆకారంలో ఉండే దానినే గర్భాశయ ముఖద్వారాం (సర్విక్స్) అంటారు. చాలా వరకు గర్భాశయ క్యాన్సర్లు గర్భాశయం బయటి ఉపరితలంపై ఉన్న కణాల నుంచి ప్రారంభమవుతాయి. అసాధారణ రక్త ప్రసరణ, కటిలో నొప్పి, మూత్ర విసర్జన సమయంలో నొప్పి వంటి లక్షణాలు ఉంటాయి. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే.. ఏ మాత్రం ఆలస్యం చేయవద్దు. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలి.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Cancer, New Delhi

  ఉత్తమ కథలు