Home /News /national /

INDIAS FEDERAL STRUCTURE BECAME ROLE MODEL DURING COVID SAYS PM NARENDRA MODI AT NITI AAYOG MEET SK

NITI Aayog: సమాఖ్య స్ఫూర్తితోనే ఈ విజయం.. సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు ప్రధాని మోదీ కౌంటరిచ్చారా?

కేసీఆర్, మోదీ (ఫైల్ ఫొటోలు)

కేసీఆర్, మోదీ (ఫైల్ ఫొటోలు)

NITI Aayog: నివారం నీతి ఆయోగ్‌పై సీఎం కేసీఆర్ తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ప్లానింగ్ కమిషన్‌కు ప్రత్యామ్నాయంగా బీజేపీ తీసుకొచ్చిన నీతి ఆయోగ్ సాధించినదేమీ లేదని విమర్శించారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    రాష్ట్రాల సమిష్టి కృషి వల్లే భారత దేశం కరోనా మహమ్మారి నుంచి బయటపడిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సహకార సమాఖ్య స్ఫూర్తితోనే అన్ని రాష్ట్రాలు కలిసికట్టుగా కరోనాను ఎదుర్కొన్నాయని పేర్కొన్నారు. ఇవాళ జరిగిన నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ప్రధాని మోదీ కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా కరోనా పోరాటంలో రాష్ట్రాలు చేసిన కృషిని అభినందించారు. తద్వారా అభివృద్ధి చెందుతున్న ప్రపంచ దేశాలకు భారత్ దిక్సూచిలా నిలిచిందని ప్రశంసించారు. నీతి ఆయోగ్ ఏడవ గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ ఆదివారం ఢిల్లీలో జరిగింది. ఈ సమావేశంలో ప్రధాని మోదీతో పాటు 23 మంది ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా పాల్గొన్నారు.

    నీతి ఆయోగ్ సమావేశంలో వ్యవసాయంతో పాటు పలు అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. వ్యవసాయ రంగంలో భారత్ ప్రపంచంలనే నెంబర్ వన్‌గా ఎదగాలని ఆకాంక్షించారు. ఎప్పుడూ ఒకే పంటలు కాకుండా.. పంటల వైవిధ్యంపై అన్ని రాష్ట్రాలు దృష్టి సారించాలని అభిప్రాయపడ్డారు. ఇక భారత సమాఖ్య వ్యవస్థ యావత్ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. కాగా, 2019 జులై నీతి ఆయోగ్ సమావేశం తర్వాత సభ్యులు మళ్లీ భౌతికంగా హాజరుకానుండడం ఇదే తొలిసారి. కరోనా వల్ల ఈ భేటీని రెండేళ్ల పాటు భౌతికంగా నిర్వహించలేదు. ఐతే నీతి ఆయోగ్ సమావేశానికి తెలంగాణ సీఎం కేసీఆర్, బీహార్ సీఎం నితీష్ కుమార్ హాజరు కాలేదు.

    సమావేశానికి ఒక రోజు ముందు.. అంటే శనివారం నీతి ఆయోగ్‌పై సీఎం కేసీఆర్ తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ప్లానింగ్ కమిషన్‌కు ప్రత్యామ్నాయంగా బీజేపీ తీసుకొచ్చిన నీతి ఆయోగ్ సాధించినదేమీ లేదని విమర్శించారు. నీతి ఆయోగ్‌లో నీతి లేదని.. దాని వల్ల ఎవరికీ పైసా ఉపయోగం లేదని మండిపడ్డారు. నీతి ఆయోగ్‌ను నిరర్థకంగా మార్చారని.. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్లే.. ఇలా జరిగిందని అన్నారు.  సమాఖ్య స్ఫూర్తిని సర్వనాశనం చేశారని విరుచుకుపడ్డారు. కేంద్ర వైఖరికి నిరసనగా నీతి ఆయోగ్ సమావేశానికి హాజరుకావడం లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఐతే ప్రధాని మోదీని ఎదుర్కోలేకే సమావేశానికి డుమ్మాకొట్టారని బీజేపీ నేతలు మండిపడ్డాయి.



    అటు నీతి ఆయోగ్ సైతం తెలంగాణ ముఖ్యమంత్రి ఆరోపణలను ఖండించింది. అవి అర్థరహితమని విమర్శించింది. సమాఖ్య స్ఫూర్తి బలోపేతం కోసమే నీతి ఆయోగ్ ఏర్పడిందని పేర్కొంది. కేంద్రం రాష్ట్రాలకు ఆర్థికంగా అన్ని రకాలుగా సహకరిస్తుందని తెలిపింది. 2015-16లో రూ. 2 ,03, 740 కోట్లు... 2022-23 ఏడాదికి రూ.4,42,781 కోట్లకు చేరిందని వెల్లడించింది. జల్‌జీవన్‌ మిషన్‌ కింద తెలంగాణకు రూ.3,982 కోట్లు కేటాయింపులు జరిగాయని.. కానీ తెలంగాణ కేవలం రూ.200 కోట్లు మాత్రమే వినియోగించుకుందని స్పష్టం చేసింది నీతి ఆయోగ్. పీఎంకేఎస్‌వై-ఏబీపీ స్కీం కింద రూ.1,195 కోట్లు విడుదల అయ్యాయని.. ని గణాంకాలతో సహా సీఎం కేసీఆర్‌ ఆరోపణలకు కౌంటర్‌ ఇచ్చింది.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: CM KCR, Niti Aayog, PM Narendra Modi

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు