హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

India Food Security: ఇథనాల్ ప్రొడక్షన్ ప్లాన్‌తో ఆహార భద్రతకు ముప్పు.. ఆందోళన వ్యక్తం చేస్తున్న నిపుణులు

India Food Security: ఇథనాల్ ప్రొడక్షన్ ప్లాన్‌తో ఆహార భద్రతకు ముప్పు.. ఆందోళన వ్యక్తం చేస్తున్న నిపుణులు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించి ఇథనాల్‌పై దృష్టి సారించాలని భావిస్తోన్న కేంద్ర ప్రభుత్వం.. బియ్యం, మొక్కజొన్న, చక్కెర వంటి ఆహార పదార్థాలను ఇథనాల్‌ ఉత్పత్తికి ఉపయోగించాలని ప్లాన్ చేసింది. 2025 నాటికి 20% ఇథనాల్‌ని గ్యాసోలిన్‌తో కలపాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

ఇంకా చదవండి ...

భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఇథనాల్ ప్రొడక్షన్ ప్లాన్ పై (ETHANOL PRODUCTION ) పలువురు నిపుణుల నుంచి భారీ ఎత్తున విమర్శలు వస్తున్నాయి. దీనివల్ల ఆహారభద్రతకు (Food Security) ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇథనాల్ ఉత్పత్తికి భారత ప్రభుత్వం ఏకంగా లక్షల టన్నుల ఆహారధాన్యాలను వాడుకోవడానికి సిద్ధమైందని నివేదికలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరిలో ఆహార భద్రతపై ఆందోళనలు ఉధృతమవుతున్నాయి.

ఇండియాలో ఆహార భద్రతకు ముప్పు పొంచి ఉందా?

శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించి ఇథనాల్‌పై దృష్టి సారించాలని భావిస్తోన్న కేంద్ర ప్రభుత్వం.. బియ్యం, మొక్కజొన్న, చక్కెర వంటి ఆహార పదార్థాలను ఇథనాల్‌ ఉత్పత్తికి ఉపయోగించాలని ప్లాన్ చేసింది. 2025 నాటికి 20% ఇథనాల్‌ని గ్యాసోలిన్‌తో కలపాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2025 నాటికి ఇథనాల్‌ ఉత్పత్తిని రెట్టింపు చేయాలని ఈ ఏడాది జూన్‌లో సంబంధిత పరిశ్రమలను కోరింది. ఇథనాల్ ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోవడానికి బయోఫ్యూయల్ ఉత్పత్తిదారులకు ఆర్థికంగా చేయూత అందిస్తోంది. ఇథనాల్ ఉత్పత్తి కోసం డిస్టిలరీలకు దాదాపు 78,000 టన్నుల బియ్యాన్ని కేటాయించింది. పేద ప్రజల కోసం ఉద్దేశించిన సబ్సిడీ బియ్యం అంతా కూడా ఈ ప్రణాళిక వల్ల పక్కదారి పట్టే ప్రమాదం ఉందని పలువురు నిపుణులు భయం వ్యక్తం చేస్తున్నారు.

Electricity Bills: కరెంట్ బిల్ కట్టాలా? ఈ యాప్స్‌తో ఈజీగా బిల్ చెల్లించండి ఇలా

అడవుల నరికివేత (Deforestation) నేపథ్యంలో ఆహారం ధరలు (Food Prices) పెరుగుతుండగా అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఇథనాల్ ప్రణాళికలను నామమాత్రంగానే అమలు చేస్తున్నాయి. భారత్ మాత్రం ముడి చమురు దిగుమతులను (India Cruid Oil Imports) తగ్గించడం తప్ప ఇతర అంశాల గురించి ఆలోచించడం లేదు. ప్రణాళిక వల్ల 4 బిలియన్ల డాలర్లు ఆదా చేయొచ్చని ప్రభుత్వం చెబుతోంది. 2020-21లో పెట్రోలియం దిగుమతులకు 55 బిలియన్ డాలర్లు ఖర్చు పెట్టామని.. అదే 20% ఇథనాల్ ఉత్పత్తిని సాధిస్తే 4 బిలియన్ డాలర్లు ఆదా చేయొచ్చని ప్రభుత్వం తెలుపుతోంది. వాణిజ్య లోటును భర్తీ చేయడంతోపాటు ఈ ప్రణాళిక వల్ల కార్బన్ ఉద్గారాలను తగ్గించవచ్చని.. అలాగే రైతుల ఆదాయాన్ని పెంచొచ్చని మోదీ సర్కార్ వివరిస్తోంది.

Jio Plans: ఈ ప్లాన్స్ రీఛార్జ్ చేసి ఇండియా-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ ఫ్రీగా చూడండి

ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ గణాంకాలు

పేదలకు ఆహారం అందించడం కోసం భారత్ ఏళ్ల తరబడి పోరాడుతుందని.. ఇప్పుడు కొత్తగా ఈ ప్రణాళిక ఏంటని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు. హరిత విప్లవాన్ని ప్రోత్సహించినప్పటికీ, 2020 ప్రపంచ ఆకలి సూచికలో భారత్ 94వ స్థానానికి దిగజారిందని విమర్శకులు గుర్తుచేస్తున్నారు. గోధుమలు, బియ్యం అధికంగా ఎగుమతులు చేసే మనదేశం 107 దేశాల్లో 94వ స్థానానికి పడిపోవడం ఆందోళన చెందాల్సిన విషయమేనని అంటున్నారు. ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ ప్రకారం భారతదేశంలో 2018-2020 మధ్య కాలంలో పోషకాహార లోపంతో సుమారు 209 మిలియన్లు ప్రజలు బాధ పడ్డారు.

Global Hunger Index: ఏం తమాషాలు చేస్తున్నారా.. ఇండెక్స్‌లో ఎందుకు ఈ అవకతవకలంటూ..

కరోనాతో పేదల సంఖ్య పెరిగిపోయిందని.. ఆకలితో అలమటించే వారి సంఖ్య కూడా ఆందోళనకర స్థాయిలో పెరిగిందని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వెల్లడించింది. దేశం రెండు దశాబ్దాలుగా సాధించిన ప్రగతి మొత్తం బూడిదలో పోసిన పన్నీరు అయిందని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ నివేదిక ప్రస్ఫుటం చేస్తోంది.

Sri Lanka: కష్టాల్లో ఉన్నాం ఆదుకోండంటూ భారత్​ను అర్థించిన శ్రీలంక.. అప్పుగా 50 కోట్ల డాలర్లు ఇవ్వాలంటూ వేడుకోలు

శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించే క్రమంలో భారత్‌లో ఆహార సంక్షోభం ఏర్పడనుందా?

శిలాజ ఇంధన వినియోగాన్ని తగ్గించాలనే కొత్త ఇథనాల్ ప్లాన్ తో దేశంలో ఆహార భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని చాలామంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో భారతదేశం 2025-26 నాటికి ఆహార ధాన్యాల నుంచి 666 కోట్ల లీటర్ల ఇథనాల్ ఉత్పత్తి చేయాల్సి ఉందని ప్రభుత్వ నిపుణుల కమిటీ పేర్కొంటోంది. ఈ లక్ష్యాన్ని సాధించాలంటే దాదాపు 165 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు దేశానికి అవసరం అవుతాయి. ఒక టన్ను మొక్కజొన్న నుంచి సుమారు 350 లీటర్ల ఇథనాల్ ఉత్పత్తి అవుతుండగా.. ఒక టన్ను బియ్యం నుంచి సుమారు 450 లీటర్ల ఇథనాల్‌ ఉత్పత్తి అవుతోంది.

Moscow Metro: ఇది విన్నారా..? అక్కడ డబ్బులు మీ ముఖమే చెల్లిస్తుందట.. కార్డులూ, ఫోన్ పే, టికెట్​లు అవసరమే లేదు.. ఎక్కడో తెలుసా..?

అయితే ఆహార సంక్షోభం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నట్టు ప్రభుత్వ గణాంకాల ప్రకారం తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వ ఆధీనంలోని ఫుడ్ కార్పొరేషన్ గిడ్డంగులు తగినంత ధాన్యం నిల్వలను కలిగి ఉన్నట్లు సమాచారం. సెప్టెంబర్ 1 నాటికి 13.54 మిలియన్ టన్నుల బియ్యం అవసరం కానుండగా.. 21.8 మిలియన్ టన్నుల బియ్యాన్ని ప్రభుత్వం సేకరించిందట.

ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏం చెబుతోంది

ప్రస్తుతం 40 లక్షల టన్నుల ఆహార ధాన్యం పాడైందని ప్రభుత్వ నిపుణులు చెబుతున్నారు. కానీ కేవలం 1,850 టన్నుల ఆహార ధాన్యాలే నిరుపయోగంగా ఉన్నట్లు 2020-21 ఎఫ్‌సీఐ (FCI) నివేదిక స్పష్టం చేస్తోంది. దాంతో పలు అనుమానాలు పుట్టుకొస్తున్నాయి. మిగులు చెరకు ముడి పదార్థాల నుంచి ఇథనాల్ ఉత్పత్తి చేసేందుకు గత 6 ఏళ్లలో చక్కెర పరిశ్రమలో రూ. 35 వేల కోట్లను కుమ్మరించింది ప్రభుత్వం. ఆర్థిక వ్యయం, కనీస మద్దతు ధర కంటే తక్కువ ధరలకే ఆహార ధాన్యాలు డిస్టిలరీలకు అమ్ముతున్నారని పలువురు విమర్శకులు మండిపడుతున్నారు.

Unlucky Couple: అదృష్టం తలుపు తట్టేలోపు దురదృష్టం షేక్ హ్యాండ్.. లాటరీ గెల్చుకున్న తరువాత అష్టకష్టాలుపడ్డ దంపతులు

పేదల కోసం ఉద్దేశించిన ఆహారధాన్యాలను రాష్ట్రాలు ఫలానా ధరకు కొనుగోలు చేస్తుంటే.. ఆ ధరకంటే చాలా తక్కువ ధరకే డిస్టిలరీలు సరుకును సొంతం చేసుకుంటున్నాయని విమర్శకులు వివరిస్తున్నారు. బియ్యం ధరల అంచనా వ్యయం తెలుసుకుంటే.. రైతుల మద్దతు ధర క్వింటాల్‌కు రూ.2,895.5 గా నిర్ణయించారు. ఒక క్వింటాల్‌కు రూ.4,293.8 చొప్పున కొనుగోలు చేసేందుకు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ముందుకు వస్తోంది.

అయితే ఇథనాల్ ఉత్పత్తిదారులు మాత్రం క్వింటాల్‌కు కేవలం రూ.2,000లే చెల్లించి బియ్యం కొనుగోలు చేస్తున్నారు. ఇథనాల్ ఉత్పత్తుల పరిశ్రమలన్నీ కూడా ప్రస్తుతం ఫ్రెష్ ధాన్యాన్ని డిమాండ్ చేస్తున్నాయి. ఈ పరిశ్రమలు సంక్షోభ సమయంలో ధరలను పెంచి సంక్షోభాన్ని తీవ్రతరం చేసే ప్రమాదం లేకపోలేదు.

Photo Viral: ఆ బామ్మ చేసే పనికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.. ఇంతకు ఆమె ఏం చేస్తుందో తెలుసా..

నీటి సంక్షోభ ముప్పు

భారతదేశ సాగునీటిలో 80% నీటిని వరి, చెరకుతో సహా గోధుమ పంటలు వినియోగిస్తున్నాయి. కొత్త ఇథనాల్ విధానంతో రైతులు నీరు ఉపయోగం లేని పంటలకు పరిమితమయ్యేలా చేయకూడదని నిపుణులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోకపోతే దేశంలో నీటి సంక్షోభం రావడం ఖాయం. ముఖ్యంగా తీవ్రమైన నీటి కొరత ఎదుర్కొంటున్న ప్రాంతాల్లో సంక్షోభం తలెత్తే అవకాశాలు ఎక్కువ అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అసలు ప్రభుత్వం ఎందుకు ఈ ప్రణాళిక కోసం పోరాడుతోంది?

ఇథనాల్‌ని పెంచడం వల్ల భారతదేశ ఆహార భద్రతకు ఎలాంటి ముప్పు రాదని మోదీ ప్రభుత్వం చెబుతోంది. దేశంలో ఇంధన డిమాండ్ ఎప్పటికప్పుడు పెరుగుతున్నందున ఇథనాల్, బయోడీజిల్, కంప్రెస్డ్ బయోగ్యాస్ (CBG) ఉత్పత్తికి మార్గం సుగమం చేయాల్సిన అవసరం ఉందని పెట్రోలియం & సహజ వాయువు మంత్రిత్వ శాఖ అభిప్రాయపడింది.

First published:

ఉత్తమ కథలు