Home /News /national /

INDIAS COVID 19 VACCINES SPUTNIK V COVISHIELD COVAXIN SA

భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో గల COVID-19 టీకాలు

Corona-vaccine-34234234326

Corona-vaccine-34234234326

భారతదేశం COVID-19 మహమ్మారి సెకండ్ వేవ్‌తో పోరాడుతున్న ఈ సమయంలో, దేశవ్యాప్తంగా టీకాల సరఫరా మరియు వాటి విస్తరణ  వేగవంతం అయింది

  భారతదేశం COVID-19 మహమ్మారి సెకండ్ వేవ్‌తో పోరాడుతున్న ఈ సమయంలో, దేశవ్యాప్తంగా టీకాల సరఫరా మరియు వాటి విస్తరణ  వేగవంతం అయింది. 28 మే 2021 నాటికి 120,656,061 మంది ప్రజలు మొదటి డోసు టీకా తీసుకోగా, 4,41,23,192 మంది ప్రజలు రెండు డోసులు తీసుకోవడం జరిగింది. భారతదేశంలో Covaxin మరియు Covishield అనే రెండు టీకాలకు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) అత్యవసర వినియోగ అధికారాన్ని మంజూరు చేసి, ప్రజలందరికీ అందిస్తుంది.

  Covaxin అనేది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసర్చ్ (ICMR)-నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV) సహకారంతో భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన టీకా. క్రియాశీలక కరోనా వైరస్‌లను కలిగి ఉండే ఈ టీకా శరీరంలోకి పంపినప్పుడు రోగనిరోధక కణాల ద్వారా గుర్తించబడుతుంది. ఇది వైరస్‌కు వ్యతిరేకంగా ప్రతిరోధకాలను తయారుచేసేలా రోగనిరోధక శక్తిని ప్రేరేపిస్తుంది. Covaxin క్లినికల్ ట్రయల్ 3 వ దశ మధ్యంతర విశ్లేషణలో ఇది సాధారణ, ఒక మోస్తరు, తీవ్రమైన కేసులకు వ్యతిరేకంగా 78% సామర్థ్యాన్ని, ఆసుపత్రి సదుపాయాలతో కూడిన తీవ్రమైన కోవిడ్ కేసులకు వ్యతిరేకంగా 100% సామర్థ్యాన్ని ప్రకటించింది. ఈ టీకా ప్రస్తుతం 4 నుండి 6 వారాల వ్యవధిలో రెండు మోతాదులలో ఇవ్వబడుతుంది.

  మనకు అందుబాటులో ఉన్న మరో టీకా Covishield, దీనిని ఆక్స్‌ఫోర్డ్-ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేయగా, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా స్థానికంగా తయారుచేసింది. వైరల్ వెక్టార్ టీకా అయిన ఈ Covishield టీకా శరీరంలోని కణాలకు ముఖ్యమైన సమాచారాన్ని అందించడానికి సవరించబడిన వేరే వైరస్ లేదా వెక్టార్‌ను ఉపయోగిస్తుంది. COVID-19 కు కారణమయ్యే కరోనా వైరస్‌ల ఉపరితలంపై ఉండే కిరీటం లాంటి ముళ్ళను స్పైక్ ప్రోటీన్లు అని పిలుస్తారు. ఈ టీకా ఈ స్పైక్ ప్రొటీన్ల కాపీలను సృష్టించేందుకు శరీరానికి అనుమతిస్తుంది. ఫలితంగా, శరీరం వైరస్‌ను గుర్తించి, వ్యాధికి గురైన సమయంలో దానితో పోరాడగలదు. Covishield, SARS-CoV-2 సంక్రమణకు వ్యక్తిరేకంగా 76%, ఆసుపత్రి సదుపాయాలతో తీవ్రమైన లేదా క్లిష్టమైన సమయంలో 100% మరియు 65 లేదా అంతకంటే ఎక్కువ వయసు గల వారిలో 85% వరకూ COVID-19 కు వ్యతిరేకంగా సంరక్షణను అందిస్తుంది. భారత ప్రభుత్వ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (MoHFW), 12-16 వారాల వ్యవధిలో రెండు డోసులు తీసుకోవాలని సిఫార్సు చేసింది.

  ఈ ఏడాది ఏప్రిల్‌లో, రష్యన్ టీకా Sputnik V కి అత్యవసర వినియోగ అనుమతి లభించింది, అలాగే అతిత్వరలో దేశంలోని టీకా కేంద్రాల్లో అందుబాటులోకి రానుంది. Covishield మాదిరిగానే, Sputnik V కూడా వైరల్ వెక్టార్ టీకా, దీని చివరిదశ ట్రయల్స్ సమయంలో కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా 91.6% సామర్థ్యాన్ని కనబరిచింది. ఈ Sputnik V టీకా కూడా 21 రోజుల వ్యవధిలో 2 డోసులు ఇవ్వడం జరుగుతుంది. అయినప్పటికీ ఇతర టీకాల మాదిరిగా కాకుండా రెండు డోసులు ఒకదానికొకటి కొద్దిగా భిన్నంగా ఉంటాయి. ఈ రెండు రోగనోరోధక మందుల వాడకం మరింత దీర్ఘకాలిక మరియు సమర్థవంతమైన రోగనిరోధక శక్తిని అందించి వ్యాధి నుండి సంరక్షణనిస్తుంది, టీకాలోని ప్రతీ జాబ్ విభిన్న వెక్టార్‌లు/ క్రియారహిత వైరస్‌ను ఉపయోగిస్తుంది. Sputnik Light అనబడే సింగిల్ జాబ్ వెర్షన్ కూడా అభివృద్ధి దశలో ఉంది.

  ప్రపంచంలోని ఇతర దేశాలలో Pfizer, Moderna, Johnson & Johnson (Janssen), Sinopharm, CoronaVac, Novavac వంటి టీకాలు అందుబాటులో ఉన్నాయి. Pfizer మరియు Moderna లు mRNA-ఆధారిత టీకాలు, ఇవి అంటువ్యాధుల నివారణకు కొత్త రకం టీకాలు. ఈ mRNA టీకాలు శరీరంలోకి బలహీనమైన లేదా క్రియారహిత వైరస్‌లను ప్రవేశపెట్టడానికి బదులుగా శరీరంలోని రోగనిరోధక ప్రతిస్పందనను సక్రియం చేసే ప్రోటీన్ లేదా ప్రోటీన్ భాగాన్ని తయారు చేసేందుకు కణాలకు అనుమతినిస్తుంది. ఒకవేళ శరీరం అసలైన వైరస్‌కు గురైనప్పుడు, రోగ నిరోధక ప్రతిస్పందన దానితో పోరాడడానికి ప్రతిరోధకాలను ఉత్పత్తి చేస్తుంది. Pfizer మాత్రమే 12 సంవత్సరాల వయసు పైబడిన వారందరికీ అనుమతించబడిన ఏకైక టీకా. Johnson & Johnson (Janssen) ఒకే డోసుతో కూడిన వైరల్ వెక్టార్ టీకా, Sinopharm మరియు CoronaVac క్రియారహిత Sinopharm మరియు CoronaVac వైరస్‌ను ఉపయోగిస్తాయి.

  ఈ టీకాలు వాటి ట్రయల్ దశలలో సమర్థవంతమైన ఫలితాలు అందించినప్పటికీ, వాటి అసలైన ప్రభావం మాత్రం కాలం మాత్రమే నిర్ణయించగలదు. భారత ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకారం టీకాలకు పరిమిత ఉపయోగం కోసం అత్యవసర వినియోగ అనుమతులు అందించినప్పటికీ, అవి అందించగల రక్షణ వ్యవధిని అంచనా వేసేందుకు ట్రయల్ ఫాలో-అప్ 1-2 సంవత్సరాలు కొనసాగుతుంది. వ్యాక్సిన్ ఎఫికాసి అనేది టీకా ట్రయల్ సమయంలో వ్యాధి నుండి అది అందించే రక్షణా సామర్థ్యాన్ని కొలవడం. COVID-19 టీకాల సామర్ధ్యాన్ని అంచనా వేసేటప్పుడు తరచుగా దానికి తగిన వ్యాధికి వ్యతిరేకంగా వాటి సమర్ధతపై అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. అయినప్పటికీ పరిగణించవలసిన ముఖ్యమైన అంశం ఏమిటంటే తీవ్రమైన వ్యాధి, ఆసుపత్రిలో చేరడం, మరణాల నుండి రక్షించే సామర్థ్యం.

  చాలా టీకాలు గ్లోబల్ ఏజెన్సీలు నిర్ణయించిన 50-60% సమర్ధత బెంచ్ మార్కుకు వ్యతిరేకంగా 70-90% సామర్ధ్యాన్ని చూపాయి, అందువలన అవి సురక్షితమైనవి, ఉపయోగించడానికి ప్రభావవంతమైన ఔషధంగా పరిగణించబడతాయి. ఈ టీకాలను చాలా జాగ్రత్తగా ఒకదానితో మరొకటి పోల్చాలి, ఎందుకంటే వీటిలో ఉపయోగించిన సాంకేతిక పరిజ్ఞానం మరియు ట్రయల్ పరిస్థితులలో చాలా తేడాలు ఉన్నాయి, వీటిలో ప్రతీ ఒక్కటి పరీక్షించబడతాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ, వ్యాధుల నియంత్రణ మరియు నివారణా కేంద్రాలు ఒకదానితో మరొకటి పోల్చకుండా అందుబాటులో ఉన్న మొదటి టీకా తీసుకోవాలని సిఫార్సు చేస్తున్నాయి. ఈ మహమ్మారి థర్డ్ వేవ్‌ కూడా తాకే అవకాశం ఉన్నందున, గంటకు ఎక్కువమంది ప్రజల చొప్పున టీకాలు వేయడం అవససరం. వ్యాధి తీవ్రతను బట్టి దాని నుండి ఏ స్థాయిలో అయినా రక్షణ అందించడంలో సహాయపడుతుంది.

  టీకాతయారీ సంస్థ

   

  టీకా రకం
  COVID-19 ను నివారించగల సమర్థతఆసుపత్రిపాలవడ, తీవ్రమైన/క్లిష్టమైన వ్యాధి నివారణా సమర్థతడోసులు సంఖ్యమొదటి మరియు రెండవ డోసుల మధ్య ఉండవలసిన వ్యవధిభారతదేశంలో లభ్యత
  పీఫైజర్ బీఎన్‌టీ162బీ2పీఫైజర్, ఇన్‌కార్పొరేటెడ్,అండ్ బయోఎన్‌టెక్ఎంఆర్ఎన్ఏ95%100%221 రోజులులేదు
  మోడర్నా ఎంఆర్ఎన్ఏ-1273మోడర్నా టీఎక్స్, ఇన్‌కార్పొరేటెడ్ఎంఆర్ఎన్ఏ94.1%NA228 రోజులులేదు
  ఆక్స్‌ఫోర్డ్-ఆస్ట్రాజెనెకా ఏజెడ్‌డీ1222సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ( కోవిషీల్డ్) ఎస్‌కేబయో (రిపబ్లిక్ ఆఫ్ కొరియా)వైరల్ వెక్టార్76%100%212 నుండి 16 వారాలుకలదు
  స్పూత్నిక్ వి (గామాలేయ)ఆర్‌డీఐఎఫ్ అండ్ పనాసియా బయోటెక్ ( ఇన్ ఇండియా)వైరల్ వెక్టార్91·6%100%221 రోజులుత్వరలో వస్తుంది


  జాన్సన్ అండ్ జాన్సన్ (జాన్సెన్)

  జేఎన్‌జే-78436735
  జాన్సెన్ ఫార్మాస్యుటికల్స్ కంపెనీస్ ఆఫ్ జాన్సన్ అండ్ జాన్సన్వైరల్ వెక్టార్72%86%1NAలేదు
  కరోనావాక్ (సినోవాక్)సినోవాక్ లైఫ్ సైన్సెస్, బీజింగ్, చైనాక్రియారహిత వైరస్50.65% మరియు 83.5%221 రోజులులేదు
  సినోఫార్మ్బీజింగ్ బయో ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోలాజికల్ ప్రొడక్ట్స్ కో లిమిటెడ్క్రియారహిత వైరస్79%79%23 నుండి 4 వారాలు  లేదు
  కోవాక్సిన్భారత్ బయోటెక్క్రియారహిత వైరస్78%100%24 నుండి 6 వారాలుకలదు
  నోవావాక్స్ *నోవావాక్స్ప్రోటీన్ ఆధారిత మైనది96.4%100%23 వారాలులేదు  *ఇంకా క్లినికల్ ట్రయల్స్ కొనసాగుతున్నాయి.

  ఐశ్వర్య అయ్యర్

  కోఆర్డినేటర్, కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్,

  యునైటెడ్ వే ముంబై

  మూలాలు:

  https://www.bbc.com/news/world-asia-india-55748124

  https://www.thelancet.com/action/showPdf?pii=S0140-6736%2821%2900234-8

  https://www.bmj.com/content/373/bmj.n969

  https://www.bharatbiotech.com/images/covaxin/covaxin-factsheet1.pdf

  https://vaccine.icmr.org.in/covid-19-vaccine

  https://www.pfizer.com/news/hot-topics/the_facts_about_pfizer_and_biontech_s_covid_19_vaccine

  https://extranet.who.int/pqweb/sites/default/files/documents/Status_COVID_VAX_28May2021.pdf

  https://www.mohfw.gov.in/covid_vaccination/vaccination/faqs.html

  https://www.cdc.gov/coronavirus/2019-ncov/vaccines/different-vaccines/Pfizer-BioNTech.html

  https://www.cdc.gov/coronavirus/2019-ncov/vaccines/different-vaccines/Moderna.html

  https://www.cdc.gov/coronavirus/2019-ncov/vaccines/different-vaccines/janssen.html

  https://www.bharatbiotech.com/covaxin.html

  https://www.who.int/news-room/feature-stories/detail/the-oxford-astrazeneca-covid-19-vaccine-what-you-need-to-know

  https://www.thelancet.com/action/showPdf?pii=S0140-6736%2821%2900234-8

  https://www.who.int/news/item/07-05-2021-who-lists-additional-covid-19-vaccine-for-emergency-use-and-issues-interim-policy-recommendations

  https://www.mohfw.gov.in/pdf/CumulativeCovidVaccinationCoverageReport28thMay2021.pdf

  https://www.astrazeneca.com/media-centre/press-releases/2021/azd1222-us-phase-iii-primary-analysis-confirms-safety-and-efficacy.html

  https://www.afro.who.int/news/what-covid-19-vaccine-efficacy

  https://www.yalemedicine.org/news/covid-19-vaccine-comparison

  https://www.who.int/news-room/feature-stories/detail/the-sinopharm-covid-19-vaccine-what-you-need-to-know
  Published by:Rekulapally Saichand
  First published:

  Tags: Covaxin

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు