Home /News /national /

INDIAS BIGGEST VACCINATION DRIVE LAGAYAKYA SA

భారతదేశంలో గ్రామీణ & పట్టణ ప్రాంతాల వారీగా కొవిడ్ 19 వ్యాక్సినేషన్!

VACCINATION DRIVE

VACCINATION DRIVE

మే నుండి జులై 2021 వరకు ఈ విశ్లేషణ నిజమేనని అనిపించింది. ఈ కాలంలో పట్టణ ప్రాంతాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లో వ్యాక్సిన్ కవరేజీ చాలా తక్కువగా ఉంది.

  భారతదేశంలో దాదాపుగా 60 నుండి 70 శాతం జనాభా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తోంది. According to the 2011 జనాభా అంచనాల ప్రకారం, పట్టణ, మిశ్రమ, గ్రామీణ జిల్లాల్లో నివసించే వారి శాతం వరుసగా 13.6%, 13.6%, 72.8% ఉంది. అయితే సరైన పబ్లిక్ హెల్త్ అవస్థాపన ఉండి, గ్రామీణ ప్రజలతో పోల్చితే పట్టణాల్లో ఉండేవారికి వ్యాక్సిన్ కవరేజీ ఎక్కువగా ఉంటుందని చాలా మంది అంచనా వేశారు. భారతదేశంలో కొవిడ్-19 వ్యాక్సిన్ ప్రారంభమైనప్పుడు ఈ అంచనా ఒక సమస్యగా మారింది. జూన్ 2021 నాటి Hindustan Times (హిందుస్థాన్ టైమ్స్) వారి విశ్లేషణ ప్రకారం, సెమీ-పట్టణ నగరాల్లో నివసించే వారితో పోల్చితే, పట్ణణ భారతంలో ఉండే వారికి రెండు రెట్లు ఎక్కువగా వ్యాక్సిన్ దొరికే అవకాశం ఉందని తెలిసింది.  మే నుండి జులై 2021 వరకు ఈ విశ్లేషణ నిజమేనని అనిపించింది. ఈ కాలంలో పట్టణ ప్రాంతాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లో వ్యాక్సిన్ కవరేజీ చాలా తక్కువగా ఉంది. అయితే, గత రెండు మూడు నెలలుగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా వ్యాక్సినేషన్ కవరేజీ క్రమేపీ పెరగడం ఒక ట్రెండ్‌గా మారింది. అంటే, రాష్ట్ర స్థాయిలో తేడాలు ఉన్నాయనుకోండి. ఏదేమైనా, ఈ విషయంలో గ్రామీణ జిల్లాలు పూర్తిస్థాయిలో బాగానే ముందంజలో ఉన్నట్లుగా అనిపిస్తోంది. Mint (మింట్)లో ప్రచురితమైన కథనం ప్రకారం, సెప్టెంబర్ 1వ తేదీ నాటికి, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రతి 1000 మందికి 489 డోసులు అందాయి, పట్టణ ప్రాంతాల్లో ఈ సంఖ్య 451గా మాత్రమే ఉంది. అయితే, దీంతో సంతృప్తి పడటం సబబు కాదు. ఏడాది చివరి నాటికి 18 ఏళ్లు పైబడిన వారందరికీ 100 శాతం వ్యాధినిరోధక శక్తిని సాధించే క్రమంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల వారికి వ్యాక్సినేషన్ అందించే విషయంలో ఎన్నో ఎత్తుపల్లాలను ఎదుర్కొని ప్రభుత్వం వారికి సౌకర్యాలను మెరుగుపరచాలి. పట్టణ భారతంతో పోల్చి చూస్తే గ్రామీణ భూభాగాల్లో ఎదురయ్యే ఇబ్బందులు చాలా ఎక్కువ.  గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య అవస్థాపనా సౌకర్యాలు చాలా తక్కువ అని అందరికీ తెలిసిందే. భారతదేశవ్యాప్తంగా ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో డాక్టర్లు, నర్సులు, శిక్షణ పొందిన ఆరోగ్య సిబ్బంది అందుబాటులో ఉండడం చాలా తక్కువ, ఇక గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఈ పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. పట్టణ ప్రాంతాలతో పోల్చితే ఇక్కడ ఆరోగ్యసేవలు అందుకోవడంలో సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. కాబట్టి కోల్డ్ చెయిన్ మేనేజ్‌మెంట్, వ్యాక్సిన్‌ను సుదూరంగా ఉన్న గ్రామీణ జిల్లాకు తీసుకెళ్లడం లాంటివి సవాలుగా మారాయి. అంతేకాకుండా, దివ్యాంగులకు, పెద్దవాళ్లకు, దీర్ఘకాలికంగా జబ్బు పడిన వారికి వ్యాక్సిన్ అందించాలంటే ప్రయాణ సౌకర్యాల మీద కూడా దృష్టిసారించాలి. ఎక్కువ వ్యాక్సిన్ కవరేజీ పొందిన కమ్యూనిటీల్లో త్వరలో రానున్న మూడో వేవ్ ప్రభావం చాలా తక్కువగా ఉండనుంది.  CO-WIN డాష్‌బోర్డ్‌లో స్లాట్ బుకింగ్ చేయడం, ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేయడం రాని వారి కోసం, అలాగే సాంకేతికత అందుబాటులో లేని వారి కోసం కొన్ని జిల్లాల్లో ప్రత్యేకంగా ఆన్-ద-స్పాట్ రిజిస్ట్రేషన్లతో వాక్-ఇన్ వ్యాక్సినేషన్ సేవలను అందిస్తున్నారు. ఈ ప్రోత్సహదాయక విధానం వల్ల వ్యాక్సిన్ కవరేజీ పెరిగింది. అయితే, వ్యాక్సినేషన్ కేంద్రాల వద్ద పెద్ద పెద్ద క్యూలైన్లు, ప్రజలు గుమిగూడటం వల్ల వారిని నియంత్రించడానికి సరిపడ మెడికల్ సిబ్బంది లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అంతేకాకుండా క్యూలైన్లలో గంటల తరబడి నిలబడి, చివరికి వారికి అవకాశం వచ్చే సమయానికి వ్యాక్సిన్ డోసు మిగలకపోవడం, మళ్లీ రేపు లేదా ఇంకెప్పుడైనా రమ్మనడం కూడా సమస్యగా మారింది. చాలా సందర్భాల్లో రెండో డోసు కోసం క్యూలైన్లలో నిలబడి, వారి అవకాశం వచ్చే సమయానికి అది వారు మొదటి డోసులో వేసుకున్న వ్యాక్సిన్ కాదని తెలియడం వల్ల కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అలాంటి సందర్భాల్లో కొవిడ్ సహిత ప్రవర్తన (CAB) కూడా సమస్యగా మారి, వ్యాక్సినేషన్ కేంద్రమే ఇన్ఫెక్షన్ హబ్ మాదిరిగా మారుతున్న పరిస్థితి నెలకొంటోంది.

  ఈ సవాళ్లను ఎదుర్కోవాలంటే వ్యాక్సిన్‌ను రెగ్యులర్‌గా సరఫరా చేయాలి, అలాగే వ్యాక్సిన్ అందుబాటు గురించి ప్రజలకు ముందే తెలియజేయాలి. గ్రామీణ భారతదేశంలో చాలా మంది రోజువారీ కూలీ మీద ఆధారపడి జీవనం సాగిస్తుంటారు, వ్యాక్సిన్ కోసం వారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వరకు ప్రయాణం చేయలేరు. తరచుగా రావడం వల్ల వారి ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంది.

  అర్హత గల అందరినీ ఇమ్యూనైజ్ చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుని, ఆ దిశగా మేము నెమ్మదిగా ప్రయాణం చేస్తున్నాం. అయితే, ఈ క్రమంలో భారతదేశ మారుమూల ప్రాంతాలకు వ్యాక్సిన్ తీసుకెళ్లి వారికి అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉంది. పిల్లలకు వ్యాక్సిన్ ఇవ్వడం, పెద్దలకు బూస్టర్ డోసులు ఇవ్వడం ప్రారంభమయ్యేనాటికి సరైన అవస్థాపనా సౌకర్యాలు, డెలివరీ సౌకర్యాలను మెరుగుపరచాల్సి ఉంది.

  అనిల్ పర్మార్,

  వైస్ ప్రెసిడెంట్, కమ్యూనిటీ ఇన్వెస్ట్‌మెంట్, యునైటెడ్ వే ముంబై
  Published by:Rekulapally Saichand
  First published:

  Tags: Vaccinated for Covid 19

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు