ఇంటర్నెట్‌లో ఆగని అశ్లీలత... పోర్న్ వెబ్‌సైట్స్‌కు చెక్ పెట్టలేరా ?

ఉత్తరాఖండ్‌లో చోటు చేసుకున్న ఓ రేప్ ఘటనతో అశ్లీల వెబ్ సైట్లను నిషేధించాలన్న అంశం తెరపైకి వచ్చింది. కోర్టుకు హాజరైన బాలుడు... రేప్ చేసే ముందు పోర్న్ వెబ్ సైట్లు చూశానని తెలిపాడు.

news18-telugu
Updated: November 26, 2018, 10:53 AM IST
ఇంటర్నెట్‌లో ఆగని అశ్లీలత... పోర్న్ వెబ్‌సైట్స్‌కు చెక్ పెట్టలేరా ?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఎన్నిచట్టాలు తీసుకొస్తున్నా.. నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నా... పోర్న్ వెబ్ సైట్స్ మాత్రం హద్దుమీరుతూనే ఉన్నాయి. ఇలాంటి సైట్లపై ప్రభుత్వం బ్యాన్ విధించిన వాటిని ఎక్కడ అమలు చేయడం లేదు. రెచ్చిపోయి అశ్లీలాన్ని సైట్లలో చూపిస్తూనే ఉన్నాయి. దీంతో అవి చూసిన కొంతమంది హద్దుమీరుతూ.. అనేక నేరాలకు పాల్పడుతున్నారు.

దేశంలో జరుగుతున్న అనేక అత్యాచార ఘటనలకు కారణమైన పోర్న్ సైట్లను నిషేధించాలంటూ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికామ్‌కు పంపింది. అయినా సైట్ల నిర్వాహకులు మాత్రం మారడం లేదు. ప్రభుత్వ ఆదేశాల్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. సైట్ల పేర్లలో కొద్దిపాటి మార్పులు చేస్తూ యధావిధిగా మళ్లీ పోర్న్ సైట్లను అందుబాటులోకి తీసుకొచ్చారు.

ఉత్తరాఖండ్‌లో చోటు చేసుకున్న ఓ రేప్ ఘటనతో అశ్లీల వెబ్ సైట్లను నిషేధించాలన్న అంశం తెరపైకి వచ్చింది. ఉత్తరాఖండ్ హైకోర్టులో రేప్ కేసు విచారణ జరిగింది. ఈ ఘటనలో ఓ స్కూల్ అమ్మాయిపై తోటి విద్యార్థి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో కోర్టుకు హాజరైన బాలుడు... రేప్ చేసే ముందు పోర్న్ వెబ్ సైట్లు చూశానని తెలిపాడు. దీనిపై స్పందించిన కోర్టు అత్యాచారాలకు కారణమవుతున్న ఇలాంటి సైట్లను నిషేధించాలని కేంద్రానికి ఆదేశాలిచ్చింది.

నవంబర్ 15 లోగా పోర్న్ వెబ్ సైట్లను నిషేధించాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికాంకు ఆదేశాలు అందాయి. దీంతో దేశంలో 827 పోర్న్‌ వెబ్‌సైట్లను గుర్తించి బ్లాక్‌ చేశారు. అంతేకాకుండా ఈ జాబితాలోని సైట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ రన్‌ చేయవద్దని ఇంటర్నెట్‌ సంస్థలకు నోటీసులు కూడా పంపారు. టెలికామ్‌ సంస్థలు కూడా ఈ నిషేధాన్ని అమలు చేస్తున్నట్లు ప్రకటించాయి. అయితే పోర్న్ వెబ్ సైట్లను బ్యాన్ చేస్తారన్న సమాచారం ముందు తెలుసుకున్న ఆయా సైట్ల నిర్వాహకులు ముందే తెలుసుకున్నారు. దీంతో ఐటీ అడ్రాస్. యూఆర్ఎల్ లింకులు, వెబ్ సైట్ అడ్రాస్‌లో చిన్న చిన్న స్పెల్లింగ్స్ మార్చి తిరిగి రన్ చేస్తున్నారు. దీంతో పాత సైట్లన్నీ తిరిగి చిన్న చిన్నమార్పులతో అందుబాటులోకి వచ్చాశాయి. తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా 1350 పోర్న్, పైరసీ సినిమా సైట్లను గుర్తించారు పోలీసులు. అయితే

పోర్న్‌ వెబ్‌సైట్లపై నిషేధం విధిస్తారని ఆయా వెబ్‌సైట్ల నిర్వాహకులకు ముందే తెలుసు. అలాగే 2 వారాలుగా ఆన్‌లైన్లో వీటిని శోధించినా ఎవరికీ దొరకలేదు. దీంతో వీక్షకులు తగ్గిపోయిన విషయాన్ని ఆయా సైట్‌ నిర్వాహకులు గుర్తించారు. అందుకే వాటి ఐపీ అడ్రెస్‌లు, యూఆర్‌ఎల్‌ లింకులు, వెబ్‌సైట్‌ చిరునామా( డొమైన్‌ నేమ్‌) స్పెల్లింగ్‌లో స్వల్ప మార్పులు చేసి తిరిగి రన్‌ చేస్తున్నారు. ఆ పాత సైట్లన్నీ స్పెల్లింగ్‌లో స్వల్ప మార్పులతో తిరిగి నెట్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి. రాష్ట్రంలో అయితే దాదాపు 1,350 పోర్న్‌తోపాటు పైరసీ సినిమా వెబ్‌సైట్లను పోలీసులు గుర్తించి వాటిని నిషేధించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పోర్న్ వీడియోలూ చూసే దేశంలో 2015లో భారత్ 4వ స్థానంలో నిలిచింది. 2016లో మాత్రం 3వ స్థానానికి చేరింది. ఇక తొలి రెండు స్థానాల్లో మాత్రం బ్రెజిల్, ఫిలిప్పీన్స్ దేశాలు నిలిచాయి.
First published: November 26, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading