Home /News /national /

INDIANS LOVE TO TRAVEL AGAIN AFTER COVID 19 SURVEY SHOWS THAT INDIA TOPS AS MOST BOOKING COUNTRY MS

Tourism: మళ్లీ బ్యాగులు సర్దుతున్నారు.. పుణ్యక్షేత్రాల్లో పూరికే ఎక్కువమంది పయనం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కొంతకాలంగా వివిధ దేశాలతో పాటు భారత్ లో కూడా లాక్డౌన్ సడలింపులు ఇస్తున్న విషయం తెలిసిందే. దీంతో మళ్లీ పర్యాటక రంగం కలకలలాడుతున్నది. ముఖ్యంగా భారత్ లో చాలా మంది తిరిగి ప్రయాణాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

  • News18
  • Last Updated :
    కోవిడ్-19 కారణంగా విధించిన లాక్డౌన్ వల్ల ప్రపంచ దేశాలన్నీ ఇంటికే పరిమితమయ్యాయి. ఇక పర్యాటక ప్రాంతాలను కోవిడ్ వ్యాప్తికంటే ముందే మూసేశారు. భారత్ లోనే గాక ప్రపంచంలో చాలా మంది పర్యాటక పరిశ్రమ మీద ఆధారపడి బతుకుతున్నారు. అయితే కరోనా వల్ల విధించిన లాక్డౌన్ తో వీరిలో చాలా మందికి ఉపాధి పోయింది. అయితే కొంతకాలంగా వివిధ దేశాలతో పాటు భారత్ లో కూడా సడలింపులు ఇస్తున్న విషయం తెలిసిందే. దీంతో మళ్లీ పర్యాటక రంగం కలకలలాడుతున్నది. ముఖ్యంగా భారత్ లో చాలా మంది తిరిగి ప్రయాణాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ విషయాన్ని ప్రముఖ సంస్థ ఓయో ట్రావెలోపీడియా (OYO Travelopedia) 2020 లో తెలిపింది.

    నివేదికలోని వివరాలు కింది విధంగా ఉన్నాయి.. ఓయో హోటళ్లలో బుక్ చేసుకున్న వారిలో అత్యధికంగా భారత్ నుంచే ఉన్నాయి. ఈ ఏడాదిలో ఢిల్లీ ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా బుకింగ్స్ సాధించడం గమనార్హం. ఈ ఏడాది జనవరిలో చాలా మంది ప్రయాణాలకు వెళ్లగా.. ఫిబ్రవరి, మార్చిలో అవి తగ్గాయి. ఇక ఏప్రిల్ నుంచి లాక్డౌన్ ప్రారంభమవగా.. పర్యాటక రంగం మొత్తం డీలా పడింది. కానీ ఇది మళ్లీ అక్టోబర్ నుంచి కొంత పుంజుకుంది. ఈ ఏడాది ఓయోలో కొత్తగా సుమారు 85 లక్షల కొత్త బుకింగులు కావడం గమనార్హం.

    గమ్యస్థానాల విషయానికొస్తే.. ఒడిషాలోని పూరికి చాలా మంది వెళ్లారు. పరి అత్యున్నత తీర్థయాత్ర గమ్యస్థానంగా అవతరించింది. దీని తర్వాత బృందావన్, తిరుపతి, షిర్డీ, వారణాసిలు ఉన్నాయి. ఇక బీచ్ ల విషయానికొస్తే.. ఎప్పటిలాగే గోవా అందరికీ ఫేవరేట్ స్పాట్ అయింది. ఆ తర్వాత కొచ్చి, వైజాగ్, పాండిచ్చేరి ఉన్నాయి. వ్యాపారపరంగా చూసుకుంటే.. ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ లకు రావడానికి ప్రయాణికులు ఎక్కువగా ఆసక్తి చూపారు. ఇక దేశీయ విశ్రాంతి ప్రదేశాలుగా జైపూర్ (రాజస్థాన్), కొచ్చి (కేరళ), గోవా లు నిలిచాయి. ఈ నెలలోనే అత్యధికంగా 17 లక్షలకు పైగా ప్రజలు ఓయో హోటళ్లలోకి వెళ్లారు. ఇక ఈ ఏడాది చివరిరోజైన డిసెంబర్ 31 న కూడా చాలా బుకింగ్సే వచ్చిఉంటాయని సమాచారం.

    దీనిపై ఓయో ప్రతినిధులు స్పందిస్తూ.. ‘ఓయో ట్రావెలోపీడియా ఫలితాలు భారతదేశ ప్రజలు మళ్ల ప్రయాణాలకు సిద్దమవుతున్నారని సూచిస్తున్నాయి. దానికోసం ఓయో కూడా సిద్దంగా ఉంది. మా వినియోగదారులకు సేవలందించడానికి మా సిబ్బంది ఎదురుచూస్తున్నారు. ఈ సంక్షోభం నుంచి బయటపడటానికి చాలా కష్టపడుతున్నాం. ఈ ఏడాదితో పోలిస్తే.. వచ్చే ఏడాది ప్రయాణాలు గణనీయమైన స్థాయిలో పెరుగుతాయనడంలో ఏమాత్రం సందేహం లేదు..’ అని తెలిపారు.
    Published by:Srinivas Munigala
    First published:

    Tags: Goa, Hyderabad, Jaipur, Kochi, Tourism

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు