హోమ్ /వార్తలు /జాతీయం /

#SayNoToWar: యుద్ధం వద్దంటున్న భారత్, పాక్ ప్రజలు

#SayNoToWar: యుద్ధం వద్దంటున్న భారత్, పాక్ ప్రజలు

#SayNoToWar: యుద్ధం వద్దంటున్న భారత్, పాక్ ప్రజలు

#SayNoToWar: యుద్ధం వద్దంటున్న భారత్, పాక్ ప్రజలు

#SayNotoWar అని రెండు దేశాల నెటిజన్లు ట్వీట్లు, పోస్టులు చేస్తున్నారు. శాంతిని కోరుకుంటున్నారు. యుద్ధం సమస్యకు పరిష్కారం కాదని, అదే జరిగితే రెండు దేశాల్లో ప్రాణ, ఆస్తి నష్టాలకు యుద్ధం కారణమవుతుందని అభిప్రాయపడుతున్నారు.

  భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడం ఇరు దేశాల ప్రజల్ని ఆందోళనకు గురి చేస్తోంది. రెండు దేశాల మధ్య యుద్ధం తప్పదా అన్నట్టుగా పరిణామాలు ఉండటంతో... యుద్ధం వద్దంటూ భారత్, పాకిస్తాన్ ప్రజలు ఆన్‌లైన్‌లో తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. భారత్, పాక్ ప్రభుత్వాలు ఎప్పుడు ఎలాంటి చర్యలకు దిగుతాయో తెలియని పరిస్థితిలో #SayNotoWar అని రెండు దేశాల నెటిజన్లు ట్వీట్లు, పోస్టులు చేస్తున్నారు. శాంతిని కోరుకుంటున్నారు. యుద్ధం సమస్యకు పరిష్కారం కాదని, అదే జరిగితే రెండు దేశాల్లో ప్రాణ, ఆస్తి నష్టాలకు యుద్ధం కారణమవుతుందని అభిప్రాయపడుతున్నారు. భారతదేశానికి చెందిన జర్నలిస్టులు, ఉద్యోగులు, రచయితలు, యువకులు యుద్ధం వద్దంటూ ట్విట్టర్‌లో తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

  మరోవైపు పాకిస్తాన్ ప్రజల నుంచి కూడా ఇలాంటి అభిప్రాయాలే వ్యక్తమయ్యాయి. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య రేహమ్ ఖాన్, నటి మహీరా ఖాన్, పాకిస్తాన్ మాజీ ప్రధాని జుల్ఫిఖర్ అలీ భుట్టో మనవరాలు ఫాతిమా భుట్టో, పాకిస్తానీ జర్నలిస్టులు, వ్యాపారవేత్తలు, సినీ నిర్మాతలు... ఇలా అనేక మంది యుద్ధం వద్దు అనే కోరుకుంటున్నారు.

  వ్యక్తిగత అభిప్రాయాలు ఎలా ఉన్నా రెండు దేశాల ప్రజలు మాత్రం తమతమ ప్రభుత్వాలకే మద్దతుగా నిలవడం విశేషం.

  Photos: అమరవీరుల స్మృతి చిహ్నం 'నేషనల్ వార్ మెమోరియల్'

  ఇవి కూడా చదవండి:

  పవర్ బ్యాంక్ కొంటున్నారా? ఈ విషయాలు మర్చిపోవద్దు

  WhatsApp Feature: వాట్సప్‌లో త్వరలో 'గ్రూప్ ఇన్విటేషన్ ఫీచర్'

  RRB Jobs: రైల్వేలో NTPC పోస్టులకు రేపే నోటిఫికేషన్

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: India VS Pakistan, Indian Air Force, Indian Army, Pulwama Terror Attack, Surgical Strike 2

  ఉత్తమ కథలు