హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

పౌరసత్వ సవరణ బిల్లు.. సుప్రీంలో సవాల్ చేసిన ముస్లిం లీగ్..

పౌరసత్వ సవరణ బిల్లు.. సుప్రీంలో సవాల్ చేసిన ముస్లిం లీగ్..

దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసుపై విచారణకు సుప్రీం కోర్టు త్రిసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసింది. వీఎస్ సిర్పుర్కార్,రేఖ,కార్తీకేయన్‌లతో కమిషన్‌ను ఏర్పాటు చేసింది.

    పౌరసత్వ సవరణ బిల్లుపై ఈశాన్య రాష్ట్రాలతో పాటు ముస్లిం వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ముస్లిమేతరులకు మాత్రమే పౌరసత్వం కల్పించడంపై ముస్లిం వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఇది కేవలం ముస్లింలను లక్ష్యంగా చేసుకుని రూపొందించిన బిల్లు అని ప్రతిపక్షాలు సైతం విమర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంటులో ఆమోదం పొందిన పౌరసత్వ సవరణ బిల్లును ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్(IUML) సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. ఈ మేరకు రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ బిల్లు ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేదిగా ఉందని పిటిషన్‌లో పేర్కొంది. బిల్లును రాజ్యాంగ విరుద్దమని ప్రకటించాలని కోరింది. ఐయూఎంఎల్ తరుపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ కోర్టులో వాదనలు వినిపించనున్నారు.

    కాగా,పౌరసత్వ సవరణ బిల్లు బుధవారం పార్లమెంటులో ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. బిల్లుకు అనుకూలంగా 125 ఓట్లు,వ్యతిరేకంగా 99 ఓట్లు వచ్చాయి. దాదాపు ఆరున్నర గంటల సుదీర్ఘ చర్చ అనంతరం ఓటింగ్ నిర్వహించారు. ఉభయ సభల్లో బిల్లు ఆమోదం పొందడంతో రాష్ట్రపతి సంతకం కోసం పంపించనున్నారు.మరోవైపు బిల్లును వ్యతిరేకిస్తూ ఈశాన్య రాష్ట్రాల ప్రజలు ఆందోళన బాట పట్టారు. అసోం,త్రిపుర రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున నిరసనకారులు రోడ్డెక్కుతున్నారు. కర్ఫ్యూలను సైతం లెక్క చేయకుండా నిరసనలకు దిగుతున్నారు. ఆందోళనలు హింసాత్మక రూపం దాల్చుతుండటతో శాంతిభద్రతలను కాపాడేందుకు కేంద్రం నుంచి అదనపు బలగాలను మోహరించారు.

    First published:

    Tags: Disa Rape and Murder, Supreme Court

    ఉత్తమ కథలు