• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • INDIAN RAILWAYS WILL NEVER BE PRIVATISED IT WILL ALWAYS REMAIN WITH GOVERNMENT OF INDIA SAYS PIYUSH GOYAL NK

Indian Railways: రైల్వేల ప్రైవేటీకరణపై కేంద్రం కీలక ప్రకటన... ఏం చెప్పిందంటే...

Indian Railways: రైల్వేల ప్రైవేటీకరణపై కేంద్రం కీలక ప్రకటన... ఏం చెప్పిందంటే...

రైల్వేల ప్రైవేటీకరణపై కేంద్రం కీలక ప్రకటన (File)

Indian Railways: ప్రైవేటీకరణ... ఇప్పుడీ పదం మనకు కరోనాలా రోజువారీ పదం అయిపోయింది. మరి రైల్వేల ప్రైవేటీకరణ అంశంపై కేంద్రం చేసిన కీలక ప్రకటన ఏంటో తెలుసుకుందాం.

  • Share this:
    Indian Railways: తెల్లారితే చాలు.. కేంద్రం ఏయే ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరిస్తున్నట్లు ప్రకటిస్తుందో అని ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు. విమానాశ్రయాల్ని పూర్తిగా ప్రైవేటీకరించేందుకు కేంద్రం రెడీ అవుతోంది అని తెలియగానే... మరి రైల్వేల సంగతేంటి... అని చాలా మంది అనుమానం వ్యక్తం చేశారు. ఇదో దుమారం రేపింది. విషయం కేంద్రం చెవిలో పడింది. వెంటనే కేంద్ర రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్... గుడ్ న్యూస్ చెప్పారు. రైల్వేలను ఎప్పటికీ ప్రైవేటీకరించబోము అని చెప్పారు. అది విన్న రైల్వే ఉద్యోగులు, సాధారణ ప్రజలు, మీడియా అంతా ఓకే అనుకున్నారు. అదే సమయంలో... పియూష్ గోయల్ గత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి యూపీఏ ప్రభుత్వం ఏవేవో హామీలు ఇచ్చి... వాటిని అమలు చెయ్యకుండా డ్రామాలు ఆడిందని విమర్శించారు.

    పీయూష్ గోయల్ (File)


    రైల్వే శాఖ ఎప్పటికీ కేంద్ర ప్రభుత్వంతోనే ఉంటుంది అని కచ్చితమైన ప్రకటన చేశారు పియూష్ గోయల్. "రైల్వేలను ప్రైవేటీకరిస్తామని మాపై విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. కానీ ప్రజలెప్పుడు... ప్రభుత్వ వాహనాలు మాత్రమే రోడ్లపై తిరగాలి అని చెప్పలేదు. ఎందుకంటే... ఆర్థిక వ్యవస్థ నడవాలంటే... ప్రభుత్వ, ప్రైవేట్ రంగ వాహనాలన్నీ నడవాల్సిందే. ప్రైవేట్ పెట్టుబడులు రైల్వేలలోకి రావడాన్ని మనం ఆహ్వానించాలి. ఎందుకంటే తద్వారా సేవలు మెరుగవుతాయి" అని పియూష్ గోయల్ లోక్‌సభలో చెప్పారు.

    తన వివరణను పొడిగిస్తూ ఆయన ఇలా కూడా అన్నారు. "ప్రధానమంత్రి నరేంద్ర మోదీ... మన దేశ రైల్వే మౌలిక వసతులను సరికొత్త విజన్‌తో చూస్తున్నారు. కొత్త విజన్ ద్వారా రైల్వేలు... దేశంలోని అన్ని రంగాల అభివృద్ధికీ ఉపయోగపడతాయి. దేశ అభివృద్ధికి ఇంజిన్‌లా మేము భారత రైల్వే చట్టాన్ని మార్చాలనుకుంటున్నాం." అన్నారు. ఈ ఏడాది ఆర్థిక బడ్జెట్‌లో రూ.2లక్షల కోట్లకు పైగా... రైల్వే మెరుగుదల కోసం కేటాయించినట్లు తెలిపారు.

    ఇది కూడా చదవండి: Sputnik vaccine: గుడ్ న్యూస్.. స్పుత్నిక్ వ్యాక్సిన్ ఫేజ్ 3 ట్రయల్స్ పూర్తి చేసిన డాక్టర్ రెడ్డీస్

    మొత్తానికి ఈ ప్రకటన ద్వారా... రైల్వేల ప్రైవేటీకరణ ఉండదు అని మనం అనుకోవచ్చు.
    Published by:Krishna Kumar N
    First published:

    అగ్ర కథనాలు