Home /News /national /

INDIAN RAILWAYS WHY AHMEDABAD MUMBAI TEJAS EXPRESS SKIPS ANDHERI HALT WESTERN RAILWAYS PROBE ORDERED NK

Indian Railways: ప్రయాణికులకు చుక్కలు.. విచారణకు రైల్వే శాఖ ఆదేశం

ప్రయాణికులకు చుక్కలు.. విచారణకు రైల్వే శాఖ ఆదేశం (image credit - twitter)

ప్రయాణికులకు చుక్కలు.. విచారణకు రైల్వే శాఖ ఆదేశం (image credit - twitter)

Indian Railways: అప్పటివరకూ ప్రశాంతంగా రైల్లో ప్రయాణించిన వారంతా... ఆ ఘటన తర్వాత... చాలా టెన్షన్ పడ్డారు. రైలు ఆపాలనీ... దిగిపోతామని మొత్తుకున్నారు. ఎందుకో తెలుసుకుందాం.

    Indian Railways: బస్సు ప్రయాణం కంటే... రైలు ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుంది. ముఖ్యంగా గతుకులు, కుదుపుల వంటివి ఉండవు. కానీ... తాజాగా జరిగిన ఆ రైలు ఘటనతో... దాని కంటే బస్సే బెటరని ప్రయాణికులు మండిపడ్డారు. ఆ ఘటనపై పశ్చిమ రైల్వే విభాగం... దర్యాప్తుకి ఆదేశించింది. ఇంతకీ ఏమైందంటే... అహ్మదాబాద్ - ముంబై మధ్య నడిచే... తేజాస్ ఎక్స్‌ప్రెస్... అంధేరీ రైల్వే స్టేషన్‌లో ఆగకుండా వేగంగా వెళ్లిపోయింది. షెడ్యూల్ ప్రకారమైతే అక్కడ ఆగాలి. అలా ఆగకపోవడంతో... ప్రయాణికులు చాలా టెన్షన్ పడ్డారు. రైల్లో ఏదైనా టెక్నికల్ సమస్య వచ్చిందేమో... ఇక రైలు ఎక్కడా ఆగదేమో అని ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఎలాగొలా రైలు ఆపాలనీ... తాము దిగిపోతామని మొత్తుకున్నారు. చివరకు రైలును దాదర్ దగ్గర ఆపారు. నిజానికి అక్కడ హాల్ట్ షెడ్యూల్ లేదు. అయినా ప్రయాణికుల కోసం ఆపారు. అక్కడ 42 మంది రైలు దిగారు. వారంతా నిజానికి అంధేరీ స్టేషన్‌లో దిగాల్సిన వారు.

    దీనిపై వెస్ట్రన్ రైల్వే శాఖ ఓ స్టేట్‌మెంట్ రిలీజ్ చేసింది. జరిగిన దానిపై ఎంక్వైరీకి ఆదేశించినట్లు తెలిపింది.



    ఇది కూడా చదవండి: Mole theory: మీకు పుట్టుమచ్చలున్నాయా... వాటికి అర్థాలు తెలుసుకోండి

    నిజానికి కరోనా లాక్‌డౌన్ తర్వాత రైళ్లు పక్కాగా నడుస్తున్నాయి. టైమ్ ప్రకారం వెళ్తున్నాయి. ఎందుకంటే... ప్యాసింజర్లు లేకపోవడంతో... ఎక్స్‌ప్రెస్ రైళ్లు వెళ్లేందుకు ట్రాకులు సరిపడా ఉన్నాయి. అందువల్ల ఎక్కడా రైళ్లు ఆగకుండా టైమ్ ప్రకారం వెళ్తున్నాయి. దీనిపై ప్రయాణికులు కూడా ఆనందం వ్యక్తం చేస్తూనే... ప్యాసింజర్లను కూడా పట్టాలెక్కించాలని కోరుతున్నారు. ఇలాంటి సమయంలో జరిగిన ఈ ఘటన ప్రయాణికుల్లో ఒకింత అసంతృప్తిని కలిగించింది.
    Published by:Krishna Kumar N
    First published:

    Tags: Indian Railways

    తదుపరి వార్తలు