హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Indian Railways: మరికాసేపట్లో పరీక్ష.. రైలేమో 2 గంటలు ఆలస్యం.. చివరికి ఏం జరిగిదంటే..

Indian Railways: మరికాసేపట్లో పరీక్ష.. రైలేమో 2 గంటలు ఆలస్యం.. చివరికి ఏం జరిగిదంటే..

Indian Railways: రైలేమో రెండున్నర గంటలు ఆలస్యంగా నడుస్తోంది. మరి రైలు సమయానికి వెళ్తుందా? పరీక్ష రాస్తానా? అని ఆమె ఆందోళన నెలకొంది. కానీ చివరకు ఏం జరిగిందో తెలుసా..

  'నువ్వు ఎక్కాల్సిన రైలు.. ఓ జీవిత కాలం లేటు'. ఈ నానుడి గురించి అందరికీ తెలిసిందే. మన దేశంలో రైళ్లు సమయపాలన పాటించవనే అపవాదు ఎప్పటి నుంచో ఉంది. రైలు ఎక్కడం వరకే మనకు తెలుసు. కానీ అది గమ్యస్థానానికి ఎప్పుడు చేరుతుందో ఎవరికీ తెలియదు. ఐతే ఇప్పుడిప్పుడు మన రైళ్లు గాడినపడుతున్నాయి. సమయ పాలన పాటిస్తున్నాయి. ఐతే  రైళ్ల ఆలస్యానికి సంబంధించి ఫిబ్రవరి 3న ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓ అభ్యర్థి వేరొక ప్రాంతంలో పరీక్ష రాయాల్సి ఉంది. అందుకోసం రైలు ఎక్కింది. కానీ ఆ రైలేమో రెండున్నర గంటలు ఆలస్యంగా నడుస్తోంది. మరి రైలు సమయానికి వెళ్తుందా? పరీక్ష రాస్తానా? అని ఆమెలో ఆందోళన నెలకొంది. కానీ చివరకు ఏం జరిగిందో తెలుసా..

  యూపీలోని ఘాజీపూర్‌కు చెందిన నజియా తబుస్సమ్ అనే మహిళ ఫిబ్రవరి 3న DElEd రాయాల్సి ఉంది. వారణాసిలోని వల్లభ్ విద్యాపీఠ్ గర్ల్స్ కాలేజీలో పరీక్ష రాయాలి. మధ్యాహ్నం 12 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుంది. ఆమె తన సోదరుడితో కలిసి ఛప్రా వారణాసి సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కింది. కానీ పొగ మంచు వల్ల రైలేమో రెండున్నర గంటలు ఆలస్యంగా నడుస్తోంది. మరి ఇంత స్లోగా నడిస్తే పరీక్ష రాయలేనని అర్ధమయింది. ఏం చేయాలో పాలు పోలేదు. ఇంతలో ఆమె సోదరుడు అన్వర్ జమాల్‌కు ఓ ఐడియా వచ్చింది. వెంటనే తన సోదరి పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్ ఫొటో తీసి ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. రైలు రెండున్నర గంటలు ఆలస్యంగా నడుస్తోందని.. అంత నెమ్మదిగా వెళ్తే పరీక్ష రాయలేదని తెలిపాడు. ఆ ట్వీట్‌ను రైల్వే సేవాకు ట్యాగ్ చేశాడు.

  ఆ ట్వీట్‌ను పరిశీలించిన రైల్వే సేవా అధికారులు.. జమాల్ పేర్కొన్న వివరాలను పరిశీలించి.. నిజమేనని నిర్ధారించుకున్నారు. వెంటనే రైలు లోకో పైలట్‌కు ఫోన్‌కాల్ చేసి.. రైలు వేగం పెంచాలని, వీలైనంత త్వరగా వారణాసి చేరుకోవాలని చెప్పారు. వెంటే అతడు స్పీడ్ పెంచి ఎట్టకేలకు ఉదయం 11 గంటల కల్లా వారణాసి రైల్వే స్టేషన్‌లో ట్రైన్ నిలిపాడు. ఆమె అక్కడి నుంచి నేరుగా పరీక్షా కేంద్రానికి వెళ్లి పరీక్ష రాసింది. 'మేం సమయానికల్లా వారణాసి చేరుకున్నాం. థ్యాంక్యూ'.. అని ఆమె సోదరుడు మరో ట్వీట్ చేశాడు.

  రైలు ప్రయాణికులు సోషల్ మీడియాలో ఇచ్చే ఫిర్యాదులను పరిగణలోకి తీసుకొని, వాటి పరిష్కారానికి రైల్వే సేవా కృషి చేస్తున్న విషయం తెలిసిందే.

  First published:

  Tags: Indian Railways, IRCTC, Up news

  ఉత్తమ కథలు