Indian Railways: ప్రీమియం రైళ్లలో క్యాటరింగ్ సేవల పునఃప్రారంభం.. IRCTC వెబ్‌సైట్ ద్వారా ఫుడ్ ఎలా ఆర్డర్ చేయాలంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్యాక్ చేసిన భోజనాలను ఎక్కువ మంది తీసుకోలేదని, చాలామంది ప్రయాణికులు వండిన భోజనాన్ని ఇష్టపడుతున్నారని రైల్వే విభాగం ఇటీవల నిర్వహించిన సమీక్షలో తేలింది. దీంతో వండిన ఆహారాన్ని ప్రయాణికులకు అందించే ఏర్పాట్లు చేస్తోంది.

  • Share this:
భారత రైల్వే విభాగం (Indian Railways) కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని, శతాబ్ది, దురంతో, వందే భారత్, తేజస్, గతిమాన్ ఎక్స్‌ప్రెస్‌ సహా అన్ని ప్రీమియం రైళ్లలో వండిన ఆహారాన్ని (cooked food) అందించే క్యాటరింగ్ సేవలను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి అన్ని శాఖలు, విభాగాలకు ఇప్పటికే ఆర్డర్ జారీ అయినట్లు నివేదికలు చెబుతున్నాయి. రైలు ప్రయాణాలతో పాటు దేశవ్యాప్తంగా రెస్టారెంట్లు, హోటళ్లు, ఇతర ప్రదేశాలలో కోవిడ్ లాక్‌డౌన్ పరిమితులను సడలించిన నేపథ్యంలో.. ప్రీమియం రైళ్లలో ఆహారాన్ని అందించాలని రైల్వే శాఖ నిర్ణయించినట్లు CNN-News18 వార్తాసంస్థకు ఇటీవల అందిన నోటిఫికేషన్ ద్వారా తెలుస్తోంది. ఆప్ట్-అవుట్ ఆప్షన్‌తో లభించే ప్రీపెయిడ్ క్యాటరింగ్ సేవలను కూడా ప్రీమియం రైళ్లలో పునరుద్ధరించనున్నట్లు సదరు రిపోర్ట్ పేర్కొంది.

సేవల ఆధారంగా క్యాటరింగ్ ఖర్చులను జోనల్ రైల్వేలు నిర్ణయిస్తాయి. ఇందుకు వర్తించే టారిఫ్ జాబితాను త్వరలోనే PRS సాఫ్ట్‌వేర్‌లో అప్‌డేట్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ అప్‌డేట్ తరువాత టికెట్ బుకింగ్ సమయంలోనే ఫుడ్ క్యాటరింగ్ ఆప్షన్‌ను ప్రయాణికులు ఎంచుకునే వీలుంటుంది. ఈ రైళ్లలో ప్రయాణించేందుకు ఇప్పటికే టిక్కెట్లు బుక్ చేసుకున్న వారికి సైతం సేవలందించేందుకు రైల్వే ఏర్పాట్లు చేస్తుంది. అయితే క్యాటరింగ్ సర్వీస్‌ను తిరిగి ప్రారంభించే తేదీని ఇంకా నిర్ణయించలేదు.

నోటిఫికేషన్ ప్రకారం, ఇప్పటికే ఉన్న నిబంధనలు, షరతుల ప్రకారం బేస్ కిచెన్‌లలో భోజనం సిద్ధం చేయవచ్చు. ప్యాక్ చేసిన భోజనాలను ఎక్కువ మంది తీసుకోలేదని, చాలామంది ప్రయాణికులు వండిన భోజనాన్ని ఇష్టపడుతున్నారని రైల్వే విభాగం ఇటీవల నిర్వహించిన సమీక్షలో తేలింది. దీంతో వండిన ఆహారాన్ని ప్రయాణికులకు అందించే ఏర్పాట్లు చేస్తోంది.

ఈ సమీక్ష ప్రకారం, కేవలం 7 నుంచి 10 శాతం మంది ప్రయాణికులు మాత్రమే రెడీ మీల్స్ (ready meals) కొనుగోలు చేశారు. అయితే 40 నుంచి 70 శాతం మంది వండిన ఆహారాన్ని (cooked food) ఎంచుకున్నారు. ఈ క్రమంలో రైళ్లలో రెడీ-టు-ఈట్ భోజనం మాత్రమే అందిస్తామంటూ ఫిబ్రవరి 23న జారీ చేసిన ఉత్తర్వులను రైల్వే శాఖ ఉపసంహరించుకుంది. రైల్వే స్టేషన్లు, ప్లాట్‌ఫాంలలో ఇప్పటికే వండిన భోజనం లబిస్తోందని, ఈ విధానం కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు. అన్ని సాధారణ రైల్వే స్టేషన్ కార్యకలాపాలు తిరిగి ప్రారంభమవుతాయని నవంబర్ 12న కేంద్రం ప్రకటించింది. ఇప్పటికే 1,700కు పైగా ప్యాసింజర్ రైళ్లు నడుస్తున్నాయి.

Lizards: బల్లులతో ప్రమాదం.. వాటిని ఇంట్లో నుంచి తరిమేయండి ఇలా..

Walking: వాకింగ్ చేయడం ఆరోగ్యానికి ఎంతో మేలు.. అదే సమయంలో ఈ విషయాలు గుర్తుంచుకోండి

కీలక పదవి ఆ ముగ్గురిలో ఎవరికి ? KCR మనసులో ఉన్నదెవరు..? ట్విస్ట్ ఉంటుందా ?

Banana: అరటిపండ్లు తినడం వల్ల బరువు పెరుగుతాయా ?.. ఇందులో నిజమెంత ?

* IRCTC అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఫుడ్ ఎలా ఆర్డర్‌ చేయాలి?
ప్రయాణికులు IRCTCకి చెందిన eCatering అధికారిక వెబ్‌సైట్ https://www.ecatering.irctc.co.in/కి వెళ్లాలి. అనంతరం పది అంకెల PNR నంబర్‌ను ఎంటర్ చేసి, తరువాతి ప్రక్రియ కోసం ‘యారో’ (బాణం గుర్తు) సింబల్‌పై క్లిక్ చేయాలి. తరువాతి దశలో.. అందుబాటులో ఉన్న కేఫ్‌లు, అవుట్‌లెట్‌లు, క్విక్ సర్వీస్ రెస్టారెంట్‌ల జాబితా నుంచి ఆహారాన్ని ఎంచుకోవచ్చు. మీకు నచ్చిన ఆహారాన్ని ఆర్డర్ చేసి, పేమెంట్ మోడ్‌ను ఎంచుకోవాలి. ఆన్‌లైన్‌ పేమెంట్ లేదా క్యాష్ ఆన్ డెలివరీని విధానాన్ని ప్రయాణికులు ఎంచుకోవచ్చు. ఆర్డర్ చేసిన తర్వాత, ఆ ఆహారాన్ని మీ సీటు/బెర్త్‌కు డెలివరీ చేస్తారు.
Published by:Kishore Akkaladevi
First published: