Home /News /national /

Vande Bharat Trains: త్వరలోనే మరిన్ని వందేభారత్​ రైళ్లు ప్రారంభం.. రైల్వే శాఖ కీలక నిర్ణయం..

Vande Bharat Trains: త్వరలోనే మరిన్ని వందేభారత్​ రైళ్లు ప్రారంభం.. రైల్వే శాఖ కీలక నిర్ణయం..

వందే భారత్ రైళ్లు

వందే భారత్ రైళ్లు

Vande Bharat Trains: వందేభారత్ ట్రైన్​కు మొత్తం 16 కోచ్​లు ఉంటుండగా.. సెమీ హైస్పీడ్​ ట్రైన్స్​గా నడుస్తున్నాయి. ఈ సెల్ఫ్ ప్రొపెల్డ్ ట్రైన్​కు ఇంజిన్ అవసరం ఉండదు. ట్రాక్షన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ విధానంలో ఇవి పనిచేస్తాయి.

సెమీస్పీడ్​ ట్రైన్ల సంఖ్యను పెంచడంలో భాగంగా వందేభారత్​ రైళ్లు మరిన్నింటిని తీసుకొచ్చేందుకు భారతీయ రైల్వే శాఖ సిద్ధమైంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తికానున్న సందర్భాన్ని పురస్కరించుకొని వచ్చే ఏడాది ఆగస్టు కల్లా దేశవ్యాప్తంగా మరో 10 వందేభారత్​ రైళ్లను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది.మొత్తం 40 నగరాలను కలుపుతూ ఈ రైళ్లను నడపాలని నిశ్చయించింది. రైల్వే శాఖ మంత్రిగా ఇటీవల బాధ్యతలు తీసుకున్న అశ్వినీ వైష్ణవ్​.. వందే భారత్​ ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించారు. అందులో భాగంగా ఈ మిషన్​ను వేగవంతం చేయాలని సంకల్పించారు. ఈ మేరకు ఆగస్టు 2022 కల్లా 40 నగరాలను కలుపుతూ వందేభారత్ రైళ్లు ప్రారంభమవ్వాలని మంత్రి వైష్ణవ్ అధికారులను ఆదేశించారు. అలాగే రైల్వేల్లో మరింత మెరుగుదల కనిపించేలా చర్యలు చేపట్టాలని సూచించారు.

మరోవైపు ఉత్పత్తి ప్రణాళికలను వేగవంతం చేయాలని హైదరాబాద్​కు చెందిన ఇంజినీరింగ్ సంస్థ మేధాకు కూడా రైల్వే శాఖ సూచనలు జారీ చేసింది. వచ్చే ఏడాది మార్చి కల్లాపనులు పూర్తి చేయాలని కోరింది. 44 వందేభారత్​ రైళ్లకు ఎలక్ట్రిక్​ సిస్టంను సరఫరా చేసేందుకు ఈ ఏడాది ఫిబ్రవరిలో మేధా కాంట్రాక్టు దక్కించుకుంది. వందేభారత్ ప్రొటోటైప్ ట్రైన్​ లక్ష కిలోమీటర్ల కమర్షియల్ రన్ పూర్తి చేసుకున్నాక మిగిలిన వాటిని ఉత్పత్తి చేసేందుకు గ్రీన్​సిగ్నల్ ఇస్తామని మేధాకు ఇచ్చిన కాంట్రాక్టులో రైల్వే శాఖ స్పష్టంగా పేర్కొంది.అయితే పూర్తిస్థాయిలో కొత్త వందే భారత్ రైళ్లు ​ 2022 చివర్లో లేదా 2023 ప్రారంభంలో పట్టాలెక్కే అవకాశం ఉంది.

వందేభారత్ ట్రైన్​కు మొత్తం 16 కోచ్​లు ఉంటుండగా.. సెమీ హైస్పీడ్​ ట్రైన్స్​గా నడుస్తున్నాయి. ఈ సెల్ఫ్ ప్రొపెల్డ్ ట్రైన్​కు ఇంజిన్ అవసరం ఉండదు. ట్రాక్షన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ విధానంలో ఇవి పనిచేస్తాయి. ఇటీవలి కాలంలో ప్రపంచ వ్యాప్తంగా ఈ టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు. వందేభారత్​ ట్రైన్లు భారత ఆధునిక రైళ్లలో వలే సౌకర్యవంతంగాప్రయాణించవచ్చు.వందేభారత్ రైళ్లలో ఆటోమేటిక్​ డోర్లు, విమానాల్లో ఉండేలాంటి సీట్లతో పాటు ప్రయాణికులకు సకల సదుపాయాలు కల్పించేందుకు అనేక ఏర్పాట్లు చేస్తున్నారు.విమాన ప్రయాణాన్ని తలపించేలా ఈ వందేభారత్ ట్రైన్లు ఉండనున్నాయి.

ప్రస్తుతం దేశంలో రెండు వందేభారత్ ట్రైన్లు నడుస్తున్నాయి. ఒకటి ఢిల్లీ నుంచి వారణాసి మధ్య వీటిని అందుబాటులోకి తెచ్చారు. వీటిని2019లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. కాగా మరొకటి ఢిల్లీ నుంచి కట్రా మధ్య నడుస్తోంది. ఈ రైళ్లకు మంచి ఆదరణ లభించడంతో ఎక్కువ దృష్టి సారించింది రైల్వే శాఖ.
Published by:Kishore Akkaladevi
First published:

Tags: Indian Railways

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు