Home /News /national /

INDIAN RAILWAYS TO RUN SPECIAL TRAINS FOR HOLI FESTIVAL HERE TIMINGS AND OTHER DETAILS NS GH

Holi-Special Trains: హోలీ కోసం స్పెషల్ ట్రైన్స్ నడుపుతున్న భారత రైల్వే.. పూర్తి వివరాలివే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కరోనా నేపథ్యంలో పూర్తిగా బంద్ అయిన రైల్వే సేవలు అన్ లాక్ అనంతరం ఒక్కొక్కటిగా ప్రారంభమవుతున్నాయి. తాజాగా హోళీ పండగ నేపథ్యంలో ఇండియన్ రైల్వే పలు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఆ ట్రైన్స్ వివరాలు ఇలా ఉన్నాయి.

హోలీ.. మన దేశంలో జరుపుకునే అతి పెద్ద పండగల్లో ఒకటి ఇది. వసంత రుతువు ఆగమనాన్ని గుర్తు చేసుకుంటూ రంగులు చల్లుకుంటూ ప్రజలంతా ఆనందోత్సాహాల్లో మునిగిపోయే పండగ ఇది. దక్షిణాదిలో కొద్దిగా తక్కువే కానీ ఉత్తరాదిలో మాత్రం ఈ పండుగను చాలా ఘనంగా జరుపుతారు. అందుకే ఎక్కడెక్కడి నుంచో ఈ పండగను చూసేందుకు, ఆనందంగా జరుపుకునేందుకు వివిధ ప్రాంతాలను సందర్శిస్తుంటారు చాలామంది. మరికొందరు పండగ సందర్భంగా తమ సొంత గ్రామాలకు వెళ్తుంటారు. ఈసారి వరుసగా సెలవులు కూడా రావడంతో చాలామంది ఈరోజే ప్రయాణాలకు సిద్ధమైపోయారు. కరోనా కారణంగా కాస్త వేడుకలు తగ్గినా హోలీ సందర్భంగా సొంత ఊళ్లకు, వివిధ ప్రాంతాలకు వెళ్లేవారి సంఖ్య ఏమాత్రం తగ్గలేదనే చెప్పుకోవాలి. వీరికోసం రైల్వే శాఖ ప్రత్యేక ట్రైన్లను కూడా ఏర్పాటు చేసింది. సాధారణ రైళ్లలో మార్చి రెండో వారం నుంచే రద్దీ బాగా పెరిగింది. దీంతో కరోనా గైడ్ లైన్స్ పాటిస్తూ ఫెస్టివల్ స్పెషల్స్ లో ప్రయాణం చేయవచ్చని ఆ శాఖ వెల్లడించింది. కొన్ని ప్రత్యేకమైన తేదీల్లోనే వేర్వేరు రూట్లలో ప్రత్యేక ట్రైన్లను ఏర్పాటు చేశామని చెప్పిన రైల్వే శాఖ వీటిని రోజూ, వారానికి రెండు, మూడు సార్లు, వారానికోసారి ఇలా రద్దీని అంచనా వేసి దానికి తగినట్లుగా రైళ్లను నడుపుతోంది.

హోలీ సందర్భంగా నడుస్తున్న ప్రత్యేక రైళ్ల వివరాలు మీకోసం..

03512 అసన్ సోల్ - టాటా నగర్ స్పెషల్ ట్రైన్ ( ఆది, మంగళ, శుక్రవారాలు)

03511 టాటానగర్ - అసన్ సోల్ స్పెషల్ ట్రైన్ (ఆది, మంగళ, శుక్రవారాలు)

03509 అసన్ సోల్ - గోండా స్పెషల్ ట్రైన్ (సోమవారం)

03507 అసన్ సోల్ - ఘోరఖ్ పూర్ స్పెషల్ ట్రైన్ (శుక్రవారం)

02335 బగల్ పూర్ - లోకమాన్య తిలక్ టర్మినల్ స్పెషల్ ట్రైన్ (రోజూ)

02336 లోకమాన్య తిలక్ టర్మినల్ - బగల్ పూర్ స్పెషల్ ట్రైన్ (రోజూ)

03510 గోండా - అసన్ సోల్ స్పెషల్ ట్రైన్ (బుధ వారం)

03508 ఘోరఖ్ పూర్ - అసన్ సోల్ స్పెషల్ ట్రైన్ (శనివారం)

03402 ధనాపుర్ - బగల్ పూర్ స్పెషల్ ట్రైన్ (రోజూ)

03419 బగల్ పూర్ - ముజఫరాపుర్ స్పెషల్ ట్రైన్ (రోజూ)

03420 ముజఫరాపుర్ - బగల్ పుర్ స్పెషల్ ట్రైన్ (రోజూ)

03023 హౌరా- గయా స్పెషల్ వయా సాహిబ్ గంజ్ ట్రైన్ (రోజూ)

03024 గయా- హౌరా స్పెషల్ వయా సాహిబ్ గంజ్ ట్రైన్ (రోజూ)

02315 కోల్ కతా - ఉదయ్ పూర్ సిటీ స్పెషల్ ట్రైన్ (గురువారం)

02316 ఉదయ్ పూర్ సిటీ - కోల్ కతా స్పెషల్ ట్రైన్ (సోమవారం)

02361 అసన్ సోల్ - CSTముంబై స్పెషల్ ట్రైన్ (ఆదివారం)

02362 CSTముంబై - అసన్ సోల్ స్పెషల్ ట్రైన్ (బుధ వారం)

03002 సివ్డీహవాడా స్పెషల్ ట్రైన్ (రోజూ)

03506 అసన్ సోల్ - ధిఘా స్పెషల్ ట్రైన్ (ఆదివారం)

03505 ధిఘా - అసన్ సోల్ స్పెషల్ ట్రైన్ (ఆది వారం)

03418 మాల్దా టౌన్ - ధిఘా స్పెషల్ ట్రైన్ (గురువారం)

03417 ధిఘా - మాల్దా టౌన్ స్పెషల్ ట్రైన్ (గురువారం)

03425 మాల్దా టౌన్ - సూరత్ స్పెషల్ ట్రైన్ (శనివారం)

03415 మాల్దా టౌన్ - పాట్నా స్పెషల్ ట్రైన్ (బుధ, శుక్ర, ఆది వారాలు)

03416 పాట్నా - మాల్దా టౌన్ స్పెషల్ ట్రైన్ (గురు, శని, సోమ వారాలు)

03165 కోల్ కతా - సీతామార్హి స్పెషల్ ట్రైన్ (శనివారం)

03166 సీతామర్హి - కోల్ కతా స్పెషల్ ట్రైన్ (ఆదివారం)

03502 అసన్ సోల్ - హాల్దియా స్పెషల్ ట్రైన్ (ఆదివారం తప్ప మిగిలిన అన్ని రోజులు)

03501 హాల్దియా - అసన్ సోల్ స్పెషల్ ట్రైన్ (ఆదివారం తప్ప మిగిలిన అన్ని రోజులు)

ప్యాసింజర్లందరూ తాము ప్రయాణించే ట్రైన్ టికెట్ ని ఆన్ లైన్ లో బుక్ చేసుకోవడంతో పాటు ట్రైన్ ఏ సమయానికి మనం అనుకున్న స్టేషన్ వస్తుంది. ఎన్ని గంటలకు బయల్దేరుతుంది. ఏ ప్లాట్ ఫాంపై ఆగుతుంది. అందులో ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయి వంటి విషయాలను కూడా IRCTC యాప్ లేదా వెబ్ సైట్లో చూసుకోవచ్చని రైల్వేశాఖ వెల్లడించింది. రద్దీని నివారించేందుకు ఆఖరి నిమిషంలో కాకుండా వీలైనంత ముందుగానే టికెట్ బుక్ చేసుకోవాలని వెల్లడించింది. ప్రతి ప్రయాణీకులు కరోనా గైడ్ లైన్స్ ని మాత్రం తప్పక పాటించాలని చెప్పింది రైల్వే శాఖ.
Published by:Nikhil Kumar S
First published:

Tags: Indian Railways, Special Trains

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు