రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. టికెట్ల బుకింగ్‌లో మార్పులు

30 ఏసీ ట్రైన్స్‌కు సంబంధించి టికెట్ల బుకింగ్‌లో తాజాగా కొన్ని మార్పులు చేసింది. ఇప్పటి వరకు ఏడు రోజులకు మాత్రమే అడ్వాన్స్ బుకింగ్ సౌకర్యం ఉండగా ఇప్పుడు దానిని 30 రోజులకు పెంచింది.

news18-telugu
Updated: May 23, 2020, 2:25 PM IST
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. టికెట్ల బుకింగ్‌లో మార్పులు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ప్రయాణికులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా వైరస్ నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ వల్ల ప్రజారవాణ ఎక్కడికక్కడ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అయితే లాక్‌డౌన్ నిబంధనల్లో కేంద్ర ప్రభుత్వం కొంత సడలింపులను ఇచ్చింది. అందులో భాగంగానే భారతీయ రైల్వే జూన్ ఒకటో తేదీ నుంచి 200 రైళ్లను నడపాలని నిర్ణయించింది. అయితే ఆ రైళ్లలోని 30 ఏసీ ట్రైన్స్‌కు సంబంధించి టికెట్ల బుకింగ్‌లో తాజాగా కొన్ని మార్పులు చేసింది. ఇప్పటి వరకు ఏడు రోజులకు మాత్రమే అడ్వాన్స్ బుకింగ్ సౌకర్యం ఉండగా ఇప్పుడు దానిని 30 రోజులకు పెంచింది. అంతేకాకుండా ఆర్ఏసీ, వెయిటింగ్ లిస్ట్ టికెట్లను కూడా జారీ చేయనున్నట్టు తెలిపింది. వెయిటింగ్ లిస్ట్ టికెట్లు జారీ చేసినా కన్ఫామ్ కాని వారు ప్రయాణించేందుకు వీలు లేదని స్పష్టం చేసింది. అలాగే, ఇప్పటి వరకు రైలు బయలుదేరడానికి అరగంట ముందు చార్ట్‌ను విడుదల చేసేవారు. కానీ ఇప్పుడు ఈ నిబంధనను కూడా మార్చింది.

రైలు బయలుదేరే సమయానికి నాలుగు గంటల ముందు మొదటి చార్ట్, రెండు గంటల ముందు రెండో చార్ట్‌ను విడుదల చేయనుంది. టికెట్లను ఇప్పటి వరకు ఐఆర్‌సీటీసీ, యాప్‌ల ద్వారా మాత్రమే బుక్ చేసుకునే వెసులుబాటు ఉండగా, ఇప్పుడు రిజర్వేషన్ కౌంటర్లు, పోస్టాఫీసులు, ఐఆర్‌సీటీసీ అధీకృత ఏజెంట్ల నుంచి కూడా బుక్ చేసుకోవచ్చని తెలిపింది.
First published: May 23, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading