గ్రీన్ అండ్ క్లీన్... రైల్వేస్టేషన్లలో మొక్కల పెంపకానికి చర్యలు...

Indian Railways : ఇప్పటివరకూ స్వచ్ఛ భారత్‌లో భాగంగా రైల్వే స్టేషన్లను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రయత్నించారు. ఇకపై పచ్చదనం కూడా ఉండేందుకు చర్యలు తీసుకోబోతున్నారు.

Krishna Kumar N | news18-telugu
Updated: June 10, 2019, 6:20 AM IST
గ్రీన్ అండ్ క్లీన్... రైల్వేస్టేషన్లలో మొక్కల పెంపకానికి చర్యలు...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
భారతదేశంలో రైల్వే స్టేషన్లంటే... ఎక్కడ చూసినా చెత్త, ఈగలు ముసురుతూ దరిద్రంగా ఉండే పరిస్థితికి మోదీ సారధ్యంలోని గత ఎన్టీయే ప్రభుత్వం చెక్ పెట్టి... స్వచ్ఛ భారత్‌లో భాగంగా... రైల్వే స్టేషన్లకు ర్యాంకులు ఇచ్చి ప్రోత్సహించింది. ఫలితంగా చాలా రైల్వే స్టేషన్లు అందంగా రూపుదిద్దుకున్నాయి. అదే సమయంలో బయో టాయిలెట్లను రైళ్లలోని కోచ్‌లలో అమర్చడం ద్వారా... పట్టాలపై మూత్ర విసర్జన జరగకుండా అడ్డుకుంది. ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఇప్పటికీ జరుగుతోంది. ఈ సంవత్సరం చివరికి అన్ని కోచ్‌లలో బయో టాయిలెట్లను అమర్చేందుకు పట్టుదలతో ముందుకు సాగుతోంది కేంద్ర ప్రభుత్వం. అందుకే ఇప్పుడు రైల్వే శాఖ మరో మంచి ప్రయత్నం చెయ్యబోతోంది. అదే గ్రీన్ కారిడార్ల అభివృద్ధి.

రైల్వేస్టేషన్లు, రైల్వే లైన్లకు రెండు వైపులా ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు, చెట్లను పెంచబోతోంది ఇండియన్ రైల్వే. రైల్వే స్టేషన్ల చుట్టుపక్కల ఇప్పటికే పెద్ద ఎత్తున మొక్కల పెంపకం చేపట్టింది. కొన్నేళ్లుగా రైల్వే పట్టాల వెంట 817 కిలోమీటర్ల మార్గంలో 8 లక్షల మొక్కలు నాటిన రైల్వే... ఇటీవల మరింత జోరు పెంచి... మరో 706 హెక్టార్లలో 7లక్షల మొక్కలు నాటింది. అదే సమయంలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు 1040 కిలోమీటర్ల రైలు మార్గాలు కరెంటుతో పనిచేసేలా చేసి డీజిల్‌తో నడిచే ఇంజిన్ల వాడకాన్ని తగ్గించింది. దక్షిణ మధ్య రైల్వేలో 2020 నాటికి మొత్తం రైలు మార్గాలన్నింటినీ కరెంటీకరణ చెయ్యాలని టార్గెట్‌గా పెట్టుకుంది.


మహిళా ప్రయాణికుల కోసం ప్రధాన రైల్వేస్టేషన్లలో వెయిటింగ్ హాళ్లు, ఆఫీసుల్లో శానిటరీ నాప్కిన్లను ఏర్పాటు చేస్తున్నారు. సికింద్రాబాద్, కాచిగూడ, విజయవాడ వంటి 25 రైల్వేస్టేషన్లలో డిస్పోజబుల్ వాటర్ బాటిల్ క్రషింగ్ మిషన్లు పెట్టారు. రైల్వేస్టేషన్లలో వ్యర్థ పదార్థాల్ని రీసైక్లింగ్ ప్లాంట్‌కూ, డీ-కంపోజింగ్ మిషన్లకూ పంపుతున్నారు. సికింద్రాబాద్, కాచిగూడ స్టేషన్లలో ఈ మిషన్లు ఉన్నాయి. ఇలా చెయ్యడం ద్వారా చాలా చెత్త రీసైక్లింగ్ అవుతోంది, పొల్యూషన్ తగ్గుతోంది.

దక్షిణ మధ్య రైల్వేలో అన్ని రైల్వేస్టేషన్లు, సర్వీస్ భవనాలు, రైల్వే క్వార్టర్లు, ఎల్‌సీ గేట్ల దగ్గర 100 శాతం LED బల్పుల్ని ఏర్పాటు చేశారు. సోలార్ సిస్టం, హైబ్రీడ్ ప్లాంట్లు, సోలార్ వాటర్ హీటర్లు, డేలైట్ పైపులు వంటివి చాలా ఏర్పాటు చేశారు. ఇవన్నీ గ్రీన్ అండ్ క్లీన్ రైల్వే స్టేషన్ల ఏర్పాటు వైపు అడుగులు పడేలా చేస్తున్నాయి.
Published by: Krishna Kumar N
First published: June 10, 2019, 6:20 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading