ఇండియన్ రైల్వే (Indian Railways) ప్రయాణికులను ఆకట్టుకొనేందుకు కొత్త పద్ధతులకు స్వీకారం చుట్టింది. కరోనా తరువాత నెమ్మదిగా పుంజుకొంటున్న రవాణారంగాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకొంది. ప్రయాణికుల కోసం ప్యా సింజర్ సర్వీ సులు, సరకు రవాణా కోసం గూడ్సు సర్వీసులను నడుపుతున్న రైల్వే శాఖ (Railway Department).. పర్యా టక రంగ అభివృ ద్ధి కోసం ‘భారత్ గౌరవ్’ పేరిట 190 రైళ్లను నడపనుంది. ఈ మేరకు రైల్వే శాఖ మం త్రి (Railway Ministry) అశ్వినీ వైష్ణవ్ వెల్లడిం చారు. ఈ రైలు సర్వీ సులను ఐఆర్సీటీసీ సహా ప్రైవేటు రంగంలోనూ నడపనున్నటట్లు తెలిపారు. భారత్ గౌరవ్ రైలు సర్వీ సుల కోసం 3,033 కోచ్లు.. లేదా 190 రైళ్లను గుర్తిం చినట్లు వివరిం చారు. దేశ సాంస్కృతిక, వారసత్వ సంపదను ఈ తరానికి చాటేందుకు భారత్ గౌరవ్ రైలు సర్వీ సులను ప్రారంభిం చనున్న ట్లు చెప్పా రు.
వీటి కోసం మంగళవారం నుంచే దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కేంద్రమంత్రి తెలిపారు. ఈ రైలు సర్వీసుల్లో ఛార్జీలను సంబంధిత టూర్ ఆపరేటర్లు నిర్ణయిస్తారని ఆయన వెల్లడించారు. భారత్ గౌరవ్ రైళ్ల కోసం కర్ణాటక, తమిళనాడు (Tamil Nadu), ఒడిశా, రాజస్థాన్ (Rajastan) రాష్ట్రాలు ఆసక్తి కనబరిచినట్లు వివరించారు.
IIT Madras Survey: మహిళా పారిశ్రామిక వేత్తలు అక్కడే అధికం.. IIT మద్రాస్ అధ్యయనం
తెలంగాణలోని శ్రీరామ భక్తులకు శుభవార్త. ఐఆర్సీటీసీ శ్రీ రామాయణ యాత్రలో భద్రాచలాన్ని కూడా చేర్చింది భారతీయ రైల్వే (Indian Railways). ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) నవంబర్ 7న ఢిల్లీలోని సఫ్దర్జంగ్ రైల్వే స్టేషన్లో శ్రీ రామాయణ యాత్రను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ యాత్రలో వెళ్లే భక్తులు రామాయణానికి సంబంధించిన ప్రాంతాలన్నీ చూడొచ్చు. అయితే రామాయణానికి సంబంధం ఉన్న భద్రాచలాన్ని ఈ యాత్రలో చేర్చకపోవడంపై విమర్శలొచ్చాయి. దీంతో భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఐఆర్సీటీసీ శ్రీ రామాయణ యాత్రలో భద్రాచలాన్ని కూడా చేర్చినట్టు దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) ట్విట్టర్లో వెల్లడించింది.
వివాదస్పద నిర్ణయాలు వెనక్కి..
రామాయణ సర్క్యూ ట్ ప్రత్యేక రైళ్లలో వివాదాస్ప దమైన వెయిటర్ల డ్రెస్ కోడ్ను ఐఆర్సీటీసీ ఉపసం హరిం చుకుంది. వెయిటర్ల వేషధారణపై విమర్శలు రావడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
ఈ రైళ్లలో ఆహారాన్ని అం దిస్తున్న వారంతా సాధువుల వేషధారణలో ఉండటం విమర్శలు వచ్చాయి. దీంతో ఈ నిర్ణయాలను రైల్వే వెనక్కి తీసుకొంది.
వీరి వేషధారణలను అఖాడా పరిషత్ తీవ్రంగా తప్పుబట్టింది. వస్త్రధారణ మార్చకుంటే సర్క్యూట్ రైళ్లను అడ్డుకుంటామని రైల్వేశాఖ మంత్రికి లేఖ రాసింది. దీంతో రైల్వే శాఖ వెనక్కి తగ్గింది. వస్త్రధారణను మార్చింది. అయితే కాషాయ రంగు మాస్కులు, చేతి గ్లౌజుల్లో మార్పు లు చేయలేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Indian Railway, IRCTC Tourism