• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • INDIAN RAILWAYS SOUTH CENTRAL RAILWAY INCREASED PLATFORM TICKET CHARGES FROM TODAY DUE TO COVID 19 CASES INCREASE IN INDIA NK

Indian Railways: ట్రైన్ ప్రయాణికులకు షాక్... ఉగాది పండుగ నాడు బ్యాడ్ న్యూస్

Indian Railways: ట్రైన్ ప్రయాణికులకు షాక్... ఉగాది పండుగ నాడు బ్యాడ్ న్యూస్

ట్రైన్ ప్రయాణికులకు షాక్... ఉగాది పండుగ నాడు బ్యాడ్ న్యూస్ (File)

Indian Railways: ఇండియాలో కరోనా కేసులు వేగంగా పెరుగుతుంటే భారతీయ రైల్వే శాఖ ఆందోళన చెందుతోంది. ప్రయాణికులను కట్టడి చేసేందుకు ఓ కఠిన నిర్ణయం తీసుకుంది.

  • Share this:
    Indian Railways: సాధారణంగా రైల్వే శాఖ నుంచి శుభవార్తలను ప్రజలు ఆశిస్తారు. కానీ ఓ బ్యాడ్ న్యూస్ దక్షిణ మధ్య రేల్వే నుంచి వచ్చింది. ఏంటంటే... ప్లాట్ ఫామ్ టికెట్ల ధరలను పెంచేసింది. కరోనా కేసులు పెరిగిపోతున్నాయి అంటూ... కరోనా రూల్స్ పేరుతో... అదనంగా రూ.20 పెంచేశారు. ఇలా పెంచడం వల్ల ప్లాట్‌ఫామ్‌పై ప్రయాణికుల రద్దీ తగ్గుతుంది అని రైల్వే శాఖ భావిస్తోంది. ఇప్పుడు ఇలా పెంచేయడం వల్ల ప్లాట్‌ఫామ్ టికెట్ ధర రూ.30 నుంచి రూ.50 చేశారు. ఈ విషయాన్ని నిర్ధారిస్తూ... సౌత్ సెంట్రల్ రైల్వే (SCR) జనరల్ మేనేజర్ ప్రత్యేక ప్రకటన చేసారు. గతేడాది కూడా ఇలాంటి చర్యలే తీసుకున్నారు. ఇప్పుడు మళ్లీ అవి అమల్లోకి వచ్చాయి. కాకపోతే... ఈ వడ్డన మరీ ఎక్కువగా ఉందని ప్రయాణికులు అంటున్నారు. ఏకంగా రూ.50 అంటే చాలా కష్టం అంటున్నారు. ఈ ఛార్జీల భారం పడకుండా చూసుకోవాలంటే... రైలు ఎక్కేవారు మాత్రమే స్టేషన్‌లోకి వెళ్లి... మిగతావారు బయటి నుంచే సెండాఫ్ చెప్పడం మేలని అంటున్నారు కొందరు ప్రయాణికులు. ఈ పెరిగిన ఛార్జీలు ఇవాళ్టి నుంచి అమల్లో ఉన్నాయి. ప్రస్తుతానికి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో రూ.50 వసూలు చేస్తున్నారు.

    రైల్వే ప్రయాణాల్లో కొత్త రూల్స్:
    రైళ్లలో ప్రయాణించాలంటే ఏయే రూల్స్ పాటించాలో మనకు తెలుసు. ఐతే... ఇప్పుడు సెకండ్ వేవ్ ఉంది కాబట్టి... కొన్ని రూల్స్ తప్పనిసరి చేశారు. రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ రూల్స్ జారీ చేశాయి. ఇప్పుడు రైల్వేలో ప్రయాణించాలంటే... కరోనా నెగెటివ్ సర్టిఫికెట్ తప్పనిసరేమీ కాదు. అది లేకుండానే ప్రయాణించవచ్చు. నెగెటివ్ సర్టిఫికెట్ తప్పనిసరి అని నకిలీ ప్రచారం ఒకటి తెరపైకి రావడంతో... రైల్వే శాఖ అప్రమత్తం అయ్యింది. అలాంటి సర్టిఫికెట్ అవసరం లేదు అని రైల్వే బోర్డ్ ఛైర్మన్ సునీత్ శర్మ స్పష్టం చేశారు. ఐతే... ప్రయాణికులు... ఫేస్ మాస్క్ వాడాలి, సోషల్ డిస్టాన్స్ పాటించాలి.

    కరోనా కేసులు పెరుగుతున్నా... సర్వీసులను ఆపే, తగ్గించే ఉద్దేశం తమకు లేదు అని సునీత్ శర్మ తెలిపారు. అవసరమైనంతవరకూ సర్వీసులు అందిస్తాన్నారు. సమ్మర్‌లో రష్ సాధారణంగా ఉంటుందన్న ఆయన... అందుకు తగినంతగా రైల్వే సర్వీసులు ఉన్నాయి అన్నారు.

    ఇది కూడా చదవండి: Viral Video: అమ్మాయి బొమ్మతో పోలీసులకు షాక్ ఇచ్చాడు... వాళ్లు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు

    ప్రస్తుతం దేశంలో రోజూ 1402 ప్రత్యేక రైళ్ల సర్వీసులు నడుస్తున్నాయి. వీటితోపాటూ... 5381 లోకల్/సబ్ అర్బన్ రైళ్ల సర్వీసులు, 830 ప్యాసింజర్ రైళ్ల సర్వీసులు నడుస్తున్నాయి. వీటికి అదనంగా ఏప్రిల్, మే నెలల్లో కొన్ని సర్వీసులు నడపబోతున్నట్లు రైల్వే శాఖ తెలిపింది.
    Published by:Krishna Kumar N
    First published:

    అగ్ర కథనాలు