Indian Railways : సూపర్‌ అనకొండ రైలు... భారత రైల్వే శాఖ సరికొత్త రికార్డు

Indian Railways : గూడ్స్ రైలు ఉండటమే చాలా పొడవుగా ఉంటుంది. అలాంటిది... ఏకంగా మూడు గూడ్స్ రైళ్లు... ఒకే రైలుగా వెళ్తే... అది చరిత్రే.

news18-telugu
Updated: July 1, 2020, 11:03 AM IST
Indian Railways : సూపర్‌ అనకొండ రైలు... భారత రైల్వే శాఖ సరికొత్త రికార్డు
సూపర్‌ అనకొండ రైలు... భారత రైల్వే శాఖ సరికొత్త రికార్డు (File)
  • Share this:
#SuperAnakonda : ఇది నిజంగా మనం ఆశ్చర్యపోయే అంశమే. ఎందుకంటే... భారత రైల్వే శాఖ ప్రపంచంలో ఎక్కడా లేని సరికొత్త రికార్డు సృష్టించింది. ఏకంగా మూడు గూడ్సు రైళ్లను కలిపి... ఒకే రైలుగా విజయవంతంగా నడిపి చూపించింది. బిలాస్‌పూర్ డివిజన్ సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే జోన్‌కు చెందిన మూడు గూడ్స్‌ రైళ్లను ఒకదాని వెనక ఒకటి జతచేసి నడిపి అందరూ ఆశ్చర్యపోయేలా చేసింది రైల్వే శాఖ. సాధారణంగా... గూడ్స్ రైలు ఉండటమే చాలా పొడవుగా ఉంటుంది. అలాంటిది... ఏకంగా మూడు గూడ్స్ రైళ్లు... ఒకే రైలుగా వెళ్లడం, పైగా వాటిలో నిండా సరుకులు ఉండటమంటే మాటలా. వాటిని లాగేందుకు ఇంజిన్‌కి ఎంత పవర్ ఉండాలి?

లోడుతో ఉన్న మూడు రైళ్లను జతకలిపి బిలాస్‌పుర్‌-చక్రధర్‌పూర్‌ డివిజన్ల మధ్య విజయవంతంగా నడిపింది రైల్వే శాఖ. 15 వేల టన్నులకు పైగా సరకుతో ఉన్న మూడు రైళ్లను వేగంగా నడుపుతూ... సూపర్ అనకొండ అని హ్యాష్ ట్యాగ్ పెట్టింది. గూడ్స్‌ రైలు సర్వీసుల రవాణా సమయాన్ని తగ్గించేందుకే ఈ కొత్త ప్రయోగం చేసినట్లు రైల్వే శాఖ వివరించింది.



నిన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ... మరో ఐదు నెలలపాటూ... పేదలకు ఉచిత బియ్యం ఇస్తామని చెప్పారు. ఇలా సరుకులు చేరవేయడానికి ఎక్కువ టైమ్ పడుతుండటంతో... సమయాన్ని బాగా తగ్గించేందుకు ఏం చెయ్యాలో రైల్వే మంత్రి పియూష్ గోయల్ అధికారులతో చర్చలు జరిపారు. కరోనా టైమ్ కాబట్టి ఆహార ధాన్యాలు, ఎరువులు, బొగ్గు, ఇతర ముఖ్యమైన వాటిని త్వరగా పంపాలని కోరారు. శ్రామిక్‌ ప్రత్యేక రైళ్ల ద్వారా వలసకూలీలను వారి గమ్యస్థానాలకు చేరుస్తున్నట్లే... సరుకుల్ని కూడా గమ్యస్థానాలకు వేగంగా పంపాలని కోరడంతో... అధికారులు, రైల్వే శాఖ అందరూ కలిసి ఇలాంటి ప్రయోగం చేసి అద్భుతం అనిపించారు.
First published: July 1, 2020, 11:03 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading