• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • INDIAN RAILWAYS REVENUE INCREASED WITH FRIGHT CORRIDORS MS

Fright Corridor: రైల్వే శాఖ ప్లాన్ అదిరింది... ఆ ఒక్క మార్పుతో పరుగులు పెడుతున్న ఆదాయం

Fright Corridor: రైల్వే శాఖ ప్లాన్ అదిరింది... ఆ ఒక్క మార్పుతో పరుగులు పెడుతున్న ఆదాయం

ప్రతీకాత్మక చిత్రం

గతంలో గూడ్స్ రైళ్ల ఆలస్యంగా నడవడంతో అందులో రవాణా చేసే నిత్యావసర వస్తువుల (పాలు, చేపలు, కూరగాయలు) వంటివి పాడయ్యేవి. అంతేగాక ఇది వ్యాపారస్తులపైనా ప్రభావం చూపేది. కానీ భారతీయ రైల్వే తీసుకున్న ఒక నిర్ణయంతో ఆ బాధలు తప్పాయి.

  • News18
  • Last Updated:
  • Share this:
    ఒకప్పుడు భారతీయ రైల్వేలంటే.. ఆలస్యానికి బ్రాండ్ అంబాసిడర్లు. అవి టైంకి రావడం అనేది కలలో మాత్రమే జరిగేది. ఇక గూడ్స్ బండ్ల గురించి చెప్పాలా..? ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి ప్రయాణించడానికి రోజులు వేచి చూడాల్సి వచ్చేది. ప్యాసింజర్ రైళ్లు పెరిగిన తర్వాత వీటికి మరిన్ని కష్టాలు పెరిగాయి. సూపర్ పాస్ట్ ఎక్స్ప్రెస్ లు, శతాబ్ది వంటివి ఎక్కువయ్యాక.. వాటిని సాఫీగా సాగిపోవడానికి గూడ్స్ బళ్లు గంటల తరబడి స్టేషన్లలో వేచి చూడాల్సి వచ్చేది. దీంతో నిత్యావసర వస్తువుల (పాలు, చేపలు, కూరగాయలు) వంటివి పాడయ్యేవి. అంతేగాక ఇది వ్యాపారస్తులపైనా ప్రభావం చూపేది. కానీ భారతీయ రైల్వే తీసుకున్న ఒక నిర్ణయంతో ఆ బాధలు తప్పాయి. అంతకుముందు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్లు కూడా వెళ్లలేని రైళ్లు.. ఇప్పుడు 90 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తున్నాయి.

    రైల్వే నెట్వర్క్ లో సరుకు రవాణా అత్యంత కీలకం. ప్యాసింజర్ రైళ్ల తో సమానంగా దాని ఆదాయం ఉంటుంది. అయితే వాటి వేగం మాత్రం అంతంతమాత్రమే. ప్యాసింజర్ రైళ్లు ప్రయాణించే రైలు పట్టాల మీదే వీటి ప్రయాణం సాగాలి. కానీ కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రారంభించిన ఈస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ (ఇడిఎఫ్సీ) ఈ బాధలకు స్వస్తి చెప్పింది. కొత్త రైల్వే లైన్లను విస్తరించడంతో పాటు.. సరుకు రవాణా కోసమే ప్రత్యేకంగా లైన్లను నిర్మించడంతో వీటి ప్రయాణం సాఫీగా సాగుతున్నది. గూడ్స్ రైళ్లు గంటకు 90 కిలోమీటర్ల వేగంతో రైళ్లు ప్రయాణిస్తున్నాయి.





    ప్రధాని మోడీ ఇటీవలే ఇడిఎఫ్సీ ని ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్ లోని న్యూ ఖుర్జా నుంచి న్యూ భావ్పూర్ ల మధ్య నిర్మించిన ఇడిఎప్సీ ని ఆయన జాతికి అంకితం చేశారు. దీంతో సరుకు రవాణా చేసే గూడ్స్ రైళ్ల వేగం పెరగడమే గాక, రైల్వేల ఆదాయం కూడా పెరిగింది.

    దీనితో పాటు వెస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ (డబ్ల్యూడీఎఫ్సీ) ని కూడా ప్రారంభించారు. ఇది రివారి-మదర్ మధ్య నడుస్తున్నది. భారతీయ రైల్వే అంచనా ప్రకారం.. సరుకు రవాణా మార్గాలు గేమ్ ఛేంజర్లు అవుతాయని భావిస్తున్నారు. అందుకనుగుణంగానే వీటి ప్రయాణం సాగుతుండటం గమనార్హం. ఇది సక్సెస్ అయిన నేపథ్యంలో మరిన్ని సరుకు రవాణా కారిడార్ లను నిర్మించాలని కేంద్రం, రైల్వే మంత్రిత్వ శాఖ యోచిస్తున్నది. యూపీ నుంచి ముంబయికి.. గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, యూపీ, హర్యానా, బీహార్, జార్ఖండ్, బెంగాల్ ను కలుపుతూ ఒక సరుకు రవాణా కారిడార్ ను నిర్మిస్తే ఉపయోగకరంగా ఉంటుందని రైల్వే మంత్రిత్వ శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది.
    Published by:Srinivas Munigala
    First published:

    అగ్ర కథనాలు