Indian Railways: రైతులకు కేంద్రం శుభవార్త… వచ్చే బడ్జెట్‌లో ఆ ప్రయోజనం...

ప్రతీకాత్మక చిత్రం

Indian Railways: ఓవైపు కేంద్రం తెచ్చిన మూడు వ్యవసాయ సంస్కరణ బిల్లులపై సందిగ్ధత కొనసాగుతుంటే… మరోవైపు కేంద్రం రైతులకు మేలు చేసేలా ఆ ప్రయోజనం కల్పించబోతోందా?

  • Share this:
    Indian Railways: తమది రైతుల సంక్షేమం కోసం ఆలోచించే ప్రభుత్వం అని చెప్పేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ సారి బడ్జెట్‌లో రైతులకు మేలు చేసే కీలక ప్రకటనలు కొన్ని చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా కిసాన్ రైల్ సేవ (Kisan Rail Sewa) సేవలను దేశవ్యాప్తంగా విస్తరించబోతున్నట్లు తెలిసింది. దీని వల్ల రైతులకు ఏం ప్రయోజనం అన్న డౌట్ మనకు రావచ్చు. ఇది రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తుందని కేంద్రం చెబుతోంది. రైతుల కోసం 2021-2022 బడ్జెట్‌లో కేంద్రం 1000కి పైగా కిసాన్ రైళ్ల సర్వీసులను అందించాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. డిసెంబర్ 28న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ… 100వ కిసాన్ రైలు సర్వీసును జెండా ఊపి ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇది జరిగింది. ఈ రైలు… మహారాష్ట్రలోని షంగోలా నుంచి… బెంగాల్‌లోని షాలిమార్‌కు వెళ్లింది.

    కిసాన్ రైలుతో లాభమేంటి:
    కిసాన్ రైలును మల్టీ కమోడిటీ సర్వీస్‌గా చెబుతున్నారు. అంటే ఈ రైలులో కాలీఫ్లవర్, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, క్యాబేజీ, కాప్సికమ్, ములక్కాయలు వంటి కూరగాయలు… అరటిపండ్లు, ద్రాక్షపండ్లు, దానిమ్మ, సీతాఫలం, కమలాలు వంటి పండ్లను రవాణా చేస్తారు. త్వరగా పాడైపోయే కూరగాయలను కూడా కిసాన్ రైలు సర్వీసుల్లో రవాణా చేసేందుకు కేంద్రం అనుమతి ఇవ్వనున్నట్లు తెలిసింది.

    సబ్సిడీ కూడా:
    కూరగాయలు, పండ్లు వంటి వాటి రవాణాపై కేంద్రం 50 శాతం సబ్సిడీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఈ కిసాన్ రైలుకు రైతుల నుంచి మంచి స్పందన వచ్చింది. రైళ్ల సర్వీసులు ఇది వరకు వారానికి ఒకటే ఉండేవి… ఇప్పుడు ప్రతి మూడు రోజులకు ఓ సర్వీస్ ఇస్తున్నారు.

    రైతులకు కిసాన్ రైలు సర్వీసులు:
    - ఎక్స్‌ప్రెస్, ఫ్రైట్ కిసాన్ రైలు సర్వీసుల్లో రిఫ్రిజిరేటెడ్ కోచ్‌లు ఉన్నాయి.
    - కిసాన్ రైళ్లలో సరుకు రవాణా ద్వారా రైతులు మంచి ధర పొందటంతోపాటూ… వేగంగా తమ సరుకులను రవాణా చేయించుకోవడానికి వీలవుతుంది. అలాగే… రవాణా ఖర్చు కూడా తక్కువే.
    - అధిక పంట పండించిన రైతులు ఆ పంటను పారేసుకునే పని లేకుండా ఈ రైళ్ల ద్వారా రైతులు వేర్వేరు ప్రాంతాలకు తరలించుకొని అమ్ముకునేందుకు వీలవుతోంది.
    - రైతులు తమ పండ్లను 50 శాతం సబ్సిడీ ధరకు దేశవ్యాప్తంగా సరఫరా చేయడానికి వీలవుతుంది.

    ఇది కూడా చదవండి:Papaya Leaves: బొప్పాయి ఆకులతో ఆరోగ్యసిద్ధి... ఇలా చెయ్యండి

    మొదటి కిసాన్ రైలును 2020 ఆగస్టు 7న ప్రారంభించారు. ఆ తర్వాత రెండో రైలును ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం నుంచి ఢిల్లీలోని ఆదర్శ్ నగర్ కు సెప్టెంబర్ 9, 2020న ప్రారంభించారు. ఈ రైలు ప్రతి వారం వెళ్తుంది. ఇలా నాలుగు రైళ్లను ఇప్పటివరకూ ప్రారంభించారు.
    Published by:Krishna Kumar N
    First published: