రైళ్లకు గ్రీన్ సిగ్నల్.. టికెట్లు బుక్ చేసుకోండి.. డేట్ ప్రకటించిన రైల్వే శాఖ..

ఈనెల 12వ తేదీ నుంచి ప్రయాణికుల రైళ్లను నడుపుతున్నట్టు రైల్వే శాఖ స్పష్టం చేసింది.

news18-telugu
Updated: May 10, 2020, 9:30 PM IST
రైళ్లకు గ్రీన్ సిగ్నల్.. టికెట్లు బుక్ చేసుకోండి.. డేట్ ప్రకటించిన రైల్వే శాఖ..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ప్రయాణికుల రైళ్లు ప్రారంభమయ్యే తేదీని రైల్వే శాఖ ప్రకటించింది. ఈనెల 12వ తేదీ నుంచి ప్రయాణికుల రైళ్లను నడుపుతున్నట్టు రైల్వే శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ ప్రకటన జారీ చేసింది. న్యూ ఢిల్లీ నుంచి దేశంలోని 15 గమ్యస్థానాలకు ఈ రైళ్లను (మొత్తం 30 సర్వీసులు) నడపనున్నారు. వీటిని స్పెషల్ ట్రైన్లుగా పిలుస్తారు. న్యూఢిల్లీ నుంచి సికింద్రాబాద్, దిబ్రూగఢ్, అగర్తలా, హౌరా, పాట్నా, బిలాస్ పూర్, రాంచీ, భువనేశ్వర్, బెంగళూరు, చెన్నై, తిరువనంతపురం, మడ్‌గావ్, ముంబై సెంట్రల్, అహ్మదాబాద్, జమ్మూతావీ రైల్వే స్టేషన్లకు ప్రయాణికుల రైళ్లను నడుపుతున్నట్టు రైల్వే ప్రకటించింది. ఈనెల 11వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి ఐఆర్‌సీటీసీలో టికెట్లను బుక్ చేసుకోవచ్చు. పరిస్థితిని బట్టి, రైలు బోగీలు అందుబాటులో ఉన్న దాన్ని బట్టి దేశంలోని మరిన్ని ప్రాంతాలకు రైలు సర్వీసులను పునరుద్ధరిస్తామని కేంద్రం ప్రకటించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 20వేల రైలు కోచ్‌లు కరోనా వైరస్ బాధితుల కోసం కేటాయించారు. ప్రతిరోజూ వలస కూలీలను తరలించేందుకు 300 శ్రామిక్ రైళ్లు నడుపుతున్నారు.



ఈ ట్రైన్లకు టికెట్ బుకింగ్ కేవలం IRCTC ద్వారానే ఉంటుందని రైల్వే శాఖ ప్రకటించింది. మే 11వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి టికెట్లు బుక్ చేసుకోవచ్చు. రైల్వే స్టేషన్లలో టికెట్ బుకింగ్ కేంద్రాల్లో ఈ టికెట్లు విక్రయించరు. ప్లాట్ ఫాం టికెట్లు కూడా అమ్మరు. కన్ ఫాం టికెట్ ఉన్న వారికి మాత్రమే రైల్వే స్టేషన్‌లోకి అనుమతి ఉంటుంది. ప్రయాణికులు తప్పనిసరికి మాస్కులు ధరించాలి. కరోనా వైరస్ లక్షణాలు లేని వారికి మాత్రమే అనుమతి ఉంటుంది. మార్చి 24న లాక్ డౌన్ ప్రకటించినప్పటి నుంచి దేశవ్యాప్తంగా ప్రయాణికుల రైలు సేవలు నిలిచిపోయాయి. గూడ్స్ రైలు సేవలు కొనసాగుతున్నాయి.
Published by: Ashok Kumar Bonepalli
First published: May 10, 2020, 9:11 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading