INDIAN RAILWAYS PASSENGER SERVICE COMMITTEE IMPOSES 1 LAKH FINE FOR IRCTC FOR NOT GIVING TEA TO PASSENGERS AFTER BREAKFAST IN JAN SHATABDI EXPRESS SK
Indian Railways: టిఫిన్ తర్వాత 'టీ' ఇవ్వలేదని భారీగా జరిమానా.. ఎన్ని లక్షలో తెలుసా?
ప్రతీకాత్మక చిత్రం
Indian Railways: బ్రేక్ ఫాస్ట్ తర్వాత ప్రయాణికులకు టీ ఇవ్వడం లేదని కమిటీ సభ్యులు గుర్తించారు. రైలు బోగీలు కూడా అపరిశుభ్రంగా కనిపించాయి. ఈ క్రమంలో ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషనకు భారీగా జరిమానా విధించింది.
ప్రస్తుతం చాలా వరకు రైల్వే స్టేషన్లు, రైళ్లు పరిశుభ్రంగానే ఉంటున్నాయి. రైళ్లు సమయానికి రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రయాణికుల సౌకర్యాలు కూడా బాగానే ఉన్నాయి. గతంలో పోల్చితే పరిస్థితులు కాస్త మెరుగుపడినప్పటికీ.. కొన్ని చోట్ల మాత్రం ఇంకా ఇలాంటి సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయి. రైల్వే ప్రయాణికులకు చేదు అనుభవాలు ఎదురవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే రైళ్లలో ప్రయాణికులకు మెరుగైన వైద్య సేవలు అందించడంపై భారతీయ రైల్వే (Indian Railways) దృష్టిసారించింది. ప్రయాణికుల నుంచి అందుతున్న ఫిర్యాదులను పరిగణలోకి తీసుకొని వాటిని పరిష్కరించేందుకు చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా నిబంధనలను పాటించని కాంట్రాక్టర్లపై భారీగా జరిమానాలు విధిస్తోంది. తాజాగా... బ్రేక్ ఫాస్ట్ తర్వాత ప్రయాణికులకు టీ ఇవ్వనందుకు గాను.. ఏకంగా లక్షరూపాయల ఫైన్ విధించింది.
రైళ్లలో ప్రయాణికులు అందుతున్న సేవలు, సమస్యల గురించి తెలుసుకునేందుకు ప్యాసింజర్ సర్వీస్ కమిటీ టీమ్ బుధవారం ఓ జనశతాబ్ధి ఎక్స్‌ప్రెస్ రైలు (Jan shatabdi express)లో ప్రయాణించింది. ఢిల్లీ నుంచి అమృత్‌సర్‌కి వెళ్లి.. అక్కడి పరిస్థితులను తెలుసుకున్నారు. ప్రయాణికులతో కూడా మాట్లాడారు. సాధారణంగా జనశతాబ్ధి రైళ్లలో ప్రయాణికులకు భోజన వసతి ఉంటుంది. టీ, స్నాక్స్ ఇస్తుంటారు. వీటి చార్జీలు టికెట్‌తో పాటే వసూలు చేస్తారు. ఐతే జనశతాబ్ధి రైల్లో ప్రయాణించిన ప్యాసింజర్ సర్వీస్ కమిటీ.. అందులో ప్రయాణికులకు అందుతున్న సేవలు, సౌకర్యాలపై అసంతృప్తి వ్యక్తం చేసింది. బ్రేక్ ఫాస్ట్ తర్వాత ప్రయాణికులకు టీ ఇవ్వడం లేదని కమిటీ సభ్యులు గుర్తించారు. రైలు బోగీలు కూడా అపరిశుభ్రంగా కనిపించాయి. ఈ క్రమంలో సదరు కాంట్రాక్ట్ కంపెనీ.. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్‌కు(Indian Railway Catering and Tourism Corporation) భారీగా జరిమానా విధించింది.
నిబంధనల ప్రకారం.. బ్రేక్ ఫాస్ట్ చేసిన తర్వాత ప్రతి ప్రయాణికుడికి టీ ఇవ్వాలి. కానీ ఈ రైలులో ఇవ్వడం లేదు. నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను IRCTCకి లక్ష రూపాయలు ప్యాసింజర్ సర్వీస్ కమిటీ జరిమానా విధించింది. అంతేకాదు రైలు బోగీల్లో పరిశుభ్రతను పాటించనందున మరో రూ.50వేలు ఫైన్ వేసింది. అమృత్ రైల్వే స్టేషన్లో లభించే తాగునీరుపైనా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ట్యాంకుల నుంచి నీటి శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కి పంపించారు. దానిపై వారం రోజుల్లోనే రిపోర్టును ఇవ్వాల్సిందిగా అధికారులను ఆదేశించారు. రిపోర్టులో అంతా బాగుంటే ఒకే. ఏదేనా తేడాగా ఉంటే మాత్రం.. సదరు కాంట్రాక్ట్ కంపెనీకి కూడా భారీగా జరిమానా విధిస్తామని ప్యాసింజరర్ సర్వీస్ కమిటీ తెలిపింది. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే తమ లక్ష్యమని స్పష్టం చేసింది.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.