• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • INDIAN RAILWAYS ONE RAILWAY STATION WITH TWO DIFFERENT TIMINGS NETIZENS TARGET INDIAN RAILWAYS FOR THIS TECHNICAL FAULT NK

Indian Railways: ఒకే రైల్వేస్టేషన్‌లో రెండు టైమ్‌లు... పొరపాటుపై రైల్వే శాఖ ఏమందంటే...

Indian Railways: ఒకే రైల్వేస్టేషన్‌లో రెండు టైమ్‌లు... పొరపాటుపై రైల్వే శాఖ ఏమందంటే...

ఒకే రైల్వేస్టేషన్‌లో రెండు టైమ్‌లు (image credit - twitter)

Indian Railways: మన దేశంలో రైళ్లు ఆలస్యంగా నడుస్తాయనేది ఓ విమర్శ... తాజాగా స్టేషన్లలో డిజిటల్ క్లాక్‌లు కూడా తప్పుగా పనిచేస్తాయనే విమర్శ వచ్చింది.

  • Share this:
    Indian Railways: కరోనా లాక్‌డౌన్‌ తర్వాత ప్యాసింజర్ రైళ్లకు బ్రేక్ ఇచ్చి... స్పెషల్ ఎక్స్‌ప్రెస్‌లను మాత్రమే నడుపుతున్న భారత రైల్వే శాఖ... రైళ్లు టైమ్ ప్రకారం నడిచేలా చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. అందువల్ల... ఇప్పుడు చాలా రైళ్లు చెప్పిన టైముకే బయల్దేరుతున్నాయి... చెప్పిన సమయానికే గమ్యాన్ని చేరుతున్నాయి... తద్వారా... ఇండియాలో రైళ్లు ఆలస్యంగా నడుస్తాయనే విమర్శ నుంచి బయటపడేందుకు రైల్వే శాఖ ప్రయత్నిస్తోంది. ఇలాంటి సమయంలో... అడ్వకేట్ అయిన దినేష్ గౌతమ్.. ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేసిన ట్వీట్ హాట్ టాపిక్ అయ్యింది. తన ట్వీట్‌లో ఆయన ఓ రైల్వే స్టేషన్‌ ఫొటో పెట్టారు. అది ఢిల్లీలోని సబ్జీ మండి రైల్వే స్టేషన్. అందులే అక్కడ రెండు ప్లాట్‌ఫామ్‌లపై ఉన్న రెండు డిజిటల్ క్లాక్‌లలో రెండు రకాల టైమింగ్స్ కనిపిస్తున్నాయి.

    ఏపీ మున్సిపల్ ఎన్నికల అప్‌డేట్స్ కోసం ఈ LINK క్లిక్ చెయ్యండి.
    ఒక క్లాక్‌లో టైమ్ రాత్రి 8.46 (20.46) అయినట్లుగా 24 గంటల క్లాక్ చూపిస్తుంటే... మరో ప్లాట్‌ఫామ్‌పై ఉన్న క్లాక్‌లో టైమ్ ఉదయం 10.35 అయినట్లుగా ఉంది. అవి మామూలు క్లాక్స్ అయితే... పనిచేయట్లేదేమో అనుకోవచ్చు. డిజిటల్ క్లాక్స్ అయివుండీ తప్పు టైమ్ చూపిస్తున్నాయి. అందుకే వాటిని ఫొటో తీసి పెట్టారు దినేష్ గౌతమ్. ఇలా ఇండియన్ రైల్వేలో మాత్రమే జరుగుతుంది అంటూ... రైల్వే మంత్రిత్వ శాఖకు ట్యాగ్ చేశారు.


    దీనిపై రైల్వే మంత్రిత్వ శాఖ స్పందించింది. మీ సమస్యను మొబైల్ నంబర్ ద్వారా డైరెక్టు మెసేజ్ (DM) చేయండి. తద్వారా మేము మీకు సహాయ పడతాం. లేదంటే https://railmadad.indianrailways.gov.in లో మీ సమస్యను చెప్పవచ్చు. అని రిప్లై ఇచ్చింది.


    రైల్వే శాఖ రిప్లైకి... కౌంటర్ ఇచ్చారు దినేష్ గౌతమ్. "నాకు ఏ సమస్యా లేదు. ఇది చాలా బాధాకరంగా ఉంది. చాలా మంది ప్రయాణికులు రైల్వేస్టేషన్ దగ్గరున్న గడియారం ప్రకారం రైళ్ల కదలికను ట్రాక్ చేస్తారు" అని తెలిపారు.


    చివరకు సమస్యను అర్థం చేసుకున్న రైల్వే శాఖ... సంబంధిత అధికారులకు ఈ విషయాన్ని చేరవేసి... పరిష్కరిస్తామని తెలిపింది.


    ఇది కూడా చదవండి:Bitter gourd: కాకరకాయ గింజలు, ఆకులు, వేర్లతో ఆరోగ్యం... ఇలా వాడేసుకోండి

    ఆ రైల్వే స్టేషన్ నుంచి రోజూ వందల మంది ప్రయాణికులు వచ్చి, వెళ్తున్నారు. నాకెందుకులే అని రాజీ పడకుండా... దినేష్ గౌతమ్... ఇలా ట్వీట్ చేసి... రైల్వే శాఖకు ట్యాగ్ చెయ్యడంతో ఓ సమస్య తెరపైకి రావడమే కాదు... రైల్వేస్టేషన్లలో నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చినట్లైంది.
    Published by:Krishna Kumar N
    First published:

    అగ్ర కథనాలు