INDIAN RAILWAYS NOW NO POWER FOR CHARGING IN TRAINS FROM NIGHT 11 PM TO MORNING 5 HERE IS THE LATEST NEWS NK
Indian Railways: ప్రయాణికులకు షాక్ ఇచ్చిన రైల్వే శాఖ... ఆ ప్రకటనతో తీవ్ర నిరాశ
ప్రయాణికులకు షాక్ ఇచ్చిన రైల్వే శాఖ (image credit - twitter)
Indian Railways: ఇండియన్ రైల్వేస్... పేరులో ఇండియన్ ఉంది కానీ... రైల్వే శాఖ అప్పుడప్పుడూ కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకొని... ప్రయాణికులకు షాక్ ఇస్తోంది. తాజా నిర్ణయమేంటో తెలుసుకుందాం.
Indian Railways: రైళ్లు 24 గంటలూ నడుస్తాయి. కాబట్టి వాటిలో సర్వీసులు 24 గంటలూ నడిస్తేనే ప్రయాణికులకు సౌకర్యంగా ఉంటుంది. ఉదాహరణకు రైల్లో నీరు రోజంతా సప్లై అవ్వాలి. లేదంటే చాలా ఇబ్బంది తప్పదు. అలాగే కరెంటు సరఫరా కూడా. కానీ రైల్వే శాఖ కొత్త నిర్ణయం తీసుకుంది. దాని ప్రకారం... ఇకపై రైళ్లలో రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ... ఛార్జింగ్ స్లాట్లు పనిచేయవని తెలిపింది. అంటే ఎవరైనా మొబైల్, ట్యాబ్లెట్ వంటివి ఛార్జింగ్ పెట్టుకుందామని ఆ సమయంలో ప్రయత్నిస్తే... ఛార్జింగ్ అవ్వవు. అలా ఛార్జింగ్ పాయింట్లు పనిచేయకుండా పశ్చిమ రైల్వే... రెండు వారాల కిందట కొన్ని మార్పులు చేసింది. కాబట్టి ప్రయాణికులకు నిరాశే.
ఎందుకీ నిర్ణయం?
2014లో రైల్వే భద్రతా కమిషనర్... ఇలా రాత్రివేళ ఛార్జింగ్ స్లాట్లు పనిచేయకుండా చెయ్యాలని కోరారు. ఎందుకంటే... అగ్ని ప్రమాదాలు జరిగేందుకు ఇదో ప్రధాన కారణం అవుతోందని అన్నారు. అప్పట్లో ఈ దిశగా నిర్ణయం తీసుకోని రైల్వే శాఖ ఇప్పుడు మాత్రం అమలుచేస్తోంది. దీనిపై అన్ని జోన్లకూ రైల్వే బోర్డు ఆదేశాలు ఇచ్చింది.
Now, you can't charge your mobile phones or laptops at night on trains. Charging points on long-distance trains will be switched off from 11 pm to 5 am : Indian Railways
— Amandeep Singh ਅਮਨਦੀਪ ਮਿਂਘ 🌾🚜 (@singhaman1904) March 30, 2021
సరైన నిర్ణయమేనా?
ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రయాణికులు... రైళ్లు, బస్సులు ఎక్కడం మానేయట్లేదుగా... మరి ప్రమాదాలు జరుగుతున్నాయని ఛార్జింగ్ స్లాట్లకు కరెంటు సరఫరా నిలిపివేయడం కరెక్టు కాదని కొందరు ప్రయాణికులు మండిపడుతున్నారు. చాలా మందికి రైళ్లలో రాత్రివేళ ప్రయాణాలు ఉంటాయి. ఆ సమయంలో మొబైల్స్ ఛార్జింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందనీ... ఆ ఛాన్స్ లేకుండా చెయ్యడమేంటని ఫైర్ అవుతున్నారు. ఐతే... రైల్వే శాఖ మాత్రం... అతిగా ఛార్జింగ్ చేస్తుంటే... మొబైల్ బ్యాటరీలు ఉబ్బిపోయి పేలిపోతున్నాయనీ... అలాంటి సమయంలో చిన్నపాటి ప్రమాదాలు జరుగుతున్నాయని అంటోంది.
ఏది ఏమైనా నిర్ణయం తీసుకున్న తర్వాత అమలు చేయకుండా ఉండరు. కాబట్టి... ఈసారి రాత్రివేళ రైలు ఎక్కే ముందే మొబైల్ ఫుల్ ఛార్జింగ్ ఉండేలా చేసుకుంటే మంచిది. తెల్లారే 5 గంటల వరకూ ఛార్జింగ్ లేక ఇబ్బంది తప్పదు. ఆ సమయంలో మొబైల్ ఛార్జింగ్ అయిపోతే... అప్పుడు ఏదైనా అర్జెంట్ కాల్ వస్తే... మిస్సైపోయినట్లే.
Published by:Krishna Kumar N
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.