• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • INDIAN RAILWAYS NORMAL PASSENGER TRAIN SERVICES RESUME SOON SAYS RAJNI HASIJA CMD OF IRCTC NK

Indian Railways: భారత రైల్వే గుడ్‌న్యూస్... ప్యాసింజర్ రైళ్లు, పార్శిళ్లపై కీలక వ్యాఖ్యలు

Indian Railways: భారత రైల్వే గుడ్‌న్యూస్... ప్యాసింజర్ రైళ్లు, పార్శిళ్లపై కీలక వ్యాఖ్యలు

ప్యాసింజర్ రైళ్లు, పార్శిళ్లపై కీలక వ్యాఖ్యలు (ప్రతీకాత్మక చిత్రం)

Indian Railways: ఒకే సమయంలో రెండు కీలకమైన అంశాలపై భారత రైల్వేశాఖ స్పందించింది. ఈ రెండు విషయాలూ ప్రయాణికులకు సంబంధించినవే. అవేంటో తెలుసుకుందాం.

  • Share this:
    Indian Railways: ఇండియాలో ప్యాసింజర్ రైళ్లు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి అని దేశ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. లాక్‌డౌన్ తర్వాత రెండుసార్లు ఇదే అంశంపై స్పందించిన రైల్వే శాఖ... అప్పుడే చెప్పలేం అని అంది. ఇప్పుడు తాజాగా మరోసారి ఇదే అంశంపై IRCTC... CMD రజనీ హసీజా స్పందించారు. మరికొన్ని నెలల్లోనే అన్ని ప్యాసింజర్ రైళ్లనూ పట్టాలు ఎక్కిస్తామని ఆమె చెప్పారు. ఎప్పుడు పట్టాలు ఎక్కించేదీ నిర్ణయం త్వరలోనే తీసుకుంటామని ఆమె అన్నారు. పర్యాటక రంగం మెరుగవుతోందనీ... అన్నీ తెరచుకుంటున్నాయనీ అన్నారు. ఈ మాట అనడానికి కారణమేంటంటే... ఈ మధ్య ఇండియన్ రైల్వే... కొన్ని పర్యాటక ప్యాకేజీలు, టూర్లు ప్రకటించింది. అది అలా ఉంచితే... ప్యాసింజర్ రైళ్లు ఎప్పుడు పట్టాలెక్కేదీ ఇప్పుడు కూడా క్లారిటీగా చెప్పలేదనే మనం అనుకోవచ్చు. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి కాబట్టి అవి తగ్గే వరకూ ప్యాసింజర్ రైళ్లను తేకపోవచ్చు అని మనం అంచనా వేసుకోవచ్చు. మొత్తానికి ఎప్పుడోకప్పుడు పట్టాలైతే ఎక్కుతాయని అర్థమవుతోంది.



    రెండో గుడ్ న్యూస్ ఏంటంటే... రైల్వే పార్శిల్‌ సేవలను ప్రజలకు మరింతగా అందుబాటులోకి తెస్తున్నారు. అంటే వాటిని కూడా అప్‌డేట్ చేస్తున్నారు. కొత్తగా పార్శిల్ సేవల్ని కంప్యూటర్‌లో ఫీడ్ చేస్తున్నారు. ఇలాంటి టెక్నాలజీ వ్యవస్థ ముందుగా 84 స్టేషన్లలో అందుబాటులోకి వస్తుంది. ఆ తర్వాత 143 స్టేషన్లకు పెంచుతారు. ఆ తర్వాత 523 స్టేషన్లలో అమలు చేస్తారు. ఇందులో భాగంగానే ఇప్పుడు ప్రజలు 120 రోజుల ముందే పార్శిల్‌ ఆర్డర్ పెట్టుకోవచ్చు. తద్వారా వారికంటూ తగినంత స్పేస్ కేటాయిస్తారు. అందువల్ల పార్శిల్ ఓకే అవుతుందో లేదో అనే టెన్షన్ అక్కర్లేదు. ప్రశాంతంగా వెళ్లి... ముందుగానే చేసుకున్న ఆర్డర్ ప్రకారం పార్శిల్ పంపుకోవచ్చు. దాని అదనంగా బార్ కోడింగ్ కూడా ఇస్తున్నారు. కాబట్టి... మన సరుకు అత్యంత సేఫ్టీగా గమ్యస్థానానికి చేరుతుంది.


    ఇది కూడా చదివేయండి: Tulsi - Milk Recipe: పాలలో తులసి ఆకులు కలిపి తాగవచ్చా? అలా చేస్తే ఏమవుతుంది?

    చివరిగా మరో ఉపయోగపడే విషయం ఒకటి రజనీ హసీజా చెప్పారు. ఏంటంటే... రైళ్లలో ప్రయాణించేవారు... ఈ-కేటరింగ్ సర్వీస్ వాడుకోవచ్చట. అంటే... మొబైల్‌లో IRCTC యాప్ ద్వారా... ఫుడ్ ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ సదుపాయం 157 స్టేషన్లలో అందుబాటులో ఉంది. త్వరలో మరిన్ని స్టేషన్లకు విస్తరిస్తారట. అందువల్ల ఫుడ్ విషయంలో టెన్షన్ లేకుండా ప్రయాణించేందుకు వీలవుతుంది.
    Published by:Krishna Kumar N
    First published: