Home /News /national /

INDIAN RAILWAYS NO PASSENGER TRAINS FOR ANOTHER 4 MONTHS SPECIAL TRAINS TO BE CONTINUED INDIAN RAILWAY HINTS TO PASSENGERS NK

Indian Railways: ప్రత్యేక రైళ్లు, ప్యాసింజర్ రైళ్లపై రైల్వే శాఖ తాజా ప్రకటన

ప్రత్యేక రైళ్లు, ప్యాసింజర్ రైళ్లపై రైల్వే శాఖ తాజా ప్రకటన (File)

ప్రత్యేక రైళ్లు, ప్యాసింజర్ రైళ్లపై రైల్వే శాఖ తాజా ప్రకటన (File)

Indian Railways: ప్యాసింజర్ రైళ్లను ఎప్పటి నుంచి ప్రవేశ పెడతారా అని దేశ ప్రజలు ఆసక్తిగా చూస్తున్న వేళ... ప్రత్యేక రైళ్లు, ప్యాసింజర్ రైళ్లపై రైల్వే శాఖ ఓ కీలక ప్రకటన చేసింది.

    Indian Railways: ఇండియాలో కరోనా కేసులు మళ్లీ పెరగకపోయి ఉంటే... భారత రైల్వే శాఖ ప్యాసింజర్ రైళ్లను ప్రవేశ పెట్టేదేమో... అందుకు విరుద్ధంగా కేసులు పెరుగుతుంటే... ఇక ఇప్పట్లో ప్యాసింజర్ రైళ్లను తెచ్చే ఉద్దేశంతో రైల్వే శాఖ లేనట్లు కనిపిస్తోంది. తాజా ప్రకటన ప్రకారం... ప్రత్యేక రైళ్లలో కొన్నింటిని జూన్‌ ఆఖరు వరకు, ఇంకొన్నింటిని జులై మొదటి వారం వరకు పొడిగించింది. మరికొన్నింటిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పింది. అందువల్ల ప్రయాణికులు మరో 4 నెలల పాటు ఎక్స్‌ట్రా ఛార్జీలతో ప్రయాణించక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది. అలాంటి రైళ్లలో ప్యాసింజర్లు రైళ్లు లేకపోవడంతో... అదనపు ఛార్జీలు చెల్లించి... అష్ట కష్టాలు పడుతున్నారు ప్రయాణికులు.

    ప్యాసింజర్ రైళ్లలో సీటింగ్ తేవొచ్చుగా?
    ప్యాసింజర్ రైళ్లను పూర్తిగా పక్కన పెట్టేసే బదులు... వాటిని కూడా పట్టాలెక్కించి... ప్రతి టికెట్టుకూ ఓ సీటు కేటాయిస్తే... తక్కువ ధరకే టికెట్ అమ్మే ఛాన్స్ ఉంటుందని కొంత మంది ప్రయాణికులు కోరుతున్నారు. ఎక్స్‌ప్రెస్ రైళ్లలో అధిక ధరకు టికెట్ కొనుక్కునే కంటే... ప్యాసింజర్ రైళ్లలో ఇదివరకటి కంటే కాస్త ఎక్కువ రేటు ఉన్నా... ఎక్స్‌ప్రెస్ రైళ్లతో పోల్చితే తక్కువ ధరకే లభిస్తాయి కాబట్టి వాటిని అమల్లోకి తేవాలని ప్రయాణికులు కోరుతున్నారు. కానీ కరోనా ఎక్కడ మరింత పెరుగుతుందో అనే ఉద్దేశంతో రైల్వే శాఖ ఇప్పట్లో వాటిని తెచ్చే ఉద్దేశంతో కనిపించట్లేదు.

    ఎక్స్‌ప్రెస్‌, సూపర్‌ఫాస్ట్‌ రైళ్లలో 80 శాతానికిపైగా తిరిగి పట్టాలెక్కించినట్లు రైల్వే శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ ఆ మధ్య తెలిపారు. ఆర్టీసీ సంస్థలు, విమానయాన సంస్థలు మామూలు ఛార్జీలతో రెగ్యులర్‌ సర్వీసులుగానే ప్రస్తుతానికి నడిపిస్తున్నాయి. విమాన సంస్థలు టికెట్ల ధరలు పెంచవచ్చని తెలుస్తోంది. రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లు అంటూ... అదనంగా ఛార్జీలు వసూలు చేస్తోందనే విమర్శలు ఎదుర్కొంటోంది. ఇదివరకు ప్రత్యేక రైళ్లలో ప్రయాణికుల మధ్య సేఫ్ డిస్టాన్స్ అనేది ఉండేది. ఇప్పుడు అలాంటిదేమీ లేదు. పక్కపక్కనే కూర్చొని ప్రయాణిస్తున్నారు. అలాంటప్పుడు ఎందుకు అదనంగా ఛార్జీలు వేసేస్తున్నరన్న ప్రశ్నకు సమాధానం లేదు.

    Video: గురుకుల విద్యాలయాల్లో కరోనా కలకలం -

    ఇది కూడా చదవండి: Vastushastra: అదృష్టం తలుపు తట్టాలంటే... ఇంట్లో ఏనుగు బొమ్మను ఇలా ఉంచండి

    గోదావరి, శబరి, తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ వంటి రైళ్లు అవే బోగీలతో కరోనాకు ముందు ఎలా ఉండేవో... ఇప్పుడూ అలాగే ఉన్నాయి. వాటి టైమింగ్స్ కూడా అలాగే ఉన్నాయి. రూట్లు కూడా మారలేదు. ప్రత్యేకం పేరు చెప్పి... రైళ్ల పాత నంబర్లకు ముందు సున్నాను చేర్చింది రైల్వే శాఖ. దసరా, దీపావళి సమయంలో పెంచిన అదనపు ఛార్జీలనే ఇప్పటికీ ఆ రైళ్లలో కొనసాగిస్తోంది. రెగ్యులర్ రైళ్లనే ప్రత్యేక రైళ్లుగా చెబుతూ... అడ్డగోలుగా ఛార్జీలు వసూలు చేస్తున్నారని ప్రయాణికులు మండిపడుతున్నారు. పేదల ప్రయాణానికి వీలుగా ఉండే రైళ్లలో ఈ పరిస్థితి రావడంపై వారు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.
    Published by:Krishna Kumar N
    First published:

    Tags: Indian Railways

    తదుపరి వార్తలు