హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Train Upper Berth: ట్రైన్‌లో వృద్ధులకు అప్పర్ బెర్త్‌ ఎలా ఇస్తారు? IRCTCని కడిగిపారేసిన నెటిజెన్

Train Upper Berth: ట్రైన్‌లో వృద్ధులకు అప్పర్ బెర్త్‌ ఎలా ఇస్తారు? IRCTCని కడిగిపారేసిన నెటిజెన్

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

IRCTC: ఒక ట్రైన్‌లో ఇద్దరు సీనియర్ సిటిజన్లకు అప్పర్ బెర్త్‌లను కేటాయించడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దాంతో వారి కుటుంబానికి చెందిన ఒక వ్యక్తి ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC)ను ట్విట్టర్ వేదికగా విమర్శించారు.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

Train Upper Berth: రైలు (Train) బోగీలలో ఉండే అప్పర్ బెర్త్‌లు (Upper Berths) చాలామందికి సౌకర్యవంతంగా ఉంటాయి. కానీ వృద్ధులకు వీటిని కేటాయిస్తే ఇబ్బందులు తప్పవు. అందుకే సాధారణంగా రైళ్లలో సీనియర్ సిటిజన్లకు అప్పర్ బెర్తులను కేటాయించరు. అయితే తాజాగా ఇద్దరు సీనియర్ సిటిజన్లకు అప్పర్ బెర్త్‌లను కేటాయించడంతో, వారు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దాంతో వారి కుటుంబానికి చెందిన ఒక వ్యక్తి ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC)ను ట్విట్టర్ వేదికగా విమర్శించారు. సీనియర్ సిటిజన్లకు బెర్త్‌లు కేటాయించడానికి ఎలాంటి సాఫ్ట్‌వేర్‌ ఉపయోగిస్తున్నారని ఐఆర్‌సీటీసీని ప్రశ్నించారు.ఆ ట్విట్టర్ యూజర్ ఐఆర్‌సీటీసీని ఉద్దేశిస్తూ.. “టికెట్‌ జనరేట్ చేయడానికి మీరు ఎలాంటి సాఫ్ట్‌వేర్‌ ఉపయోగిస్తున్నారు? అసలు 70 ఏళ్ల వృద్ధురాలికి సైడ్ అప్పర్ బెర్త్ కేటాయించడం ఏంటి? మీరు మీ 70-80 ఏళ్ల వయస్సులో అప్పర్ బెర్త్‌లు ఎక్కగలరా? మా కుటుంబంలో ఇద్దరు మహిళలు ఉన్నారు. ఒకరు నా తల్లి, రెండోవారు మా బామ్మ. వారిద్దరికీ అప్పర్ బెర్త్ కేటాయించారు! వృద్ధురాలు అంత ఎత్తులో ఉండే బెర్త్ ఎలా ఎక్కుతుంది? మరొకరు ఆర్థరైటిస్ పేషెంట్, ఆమె ఎలా ఎక్కుతుంది? దయచేసి నాకు సమాధానం చెప్పండి. 79 ఏళ్ల మరో వృద్ధుడికి కూడా అప్పర్ బెర్త్ ఇచ్చారు" అని @malayaranjanpat ట్విట్టర్ ఖాతా ద్వారా ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
“ట్రైన్‌లో నా కుటుంబం మొత్తం ప్రయాణం చేస్తోంది. అందులో ముగ్గురు B5 కోచ్‌లో ఉన్నారు. మా అమ్మమ్మకి మరొక కోచ్ B2లో అప్పర్ బెర్త్ ఇచ్చారు! ఇదేనా ప్రజలకు మీరు చేసే సేవ?" అని అతను విమర్శించారు. తన కండిషన్లకు అనుగుణంగా టిక్కెట్‌ను రీప్లేస్ చేయాలని డిమాండ్ కూడా చేశారు. ఈ విమర్శలపై రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన రైల్వే సేవ(Railway Seva) ఒక వివరణ ఇచ్చింది.


Video : బీజేపీ నేత సోనాలి ఫోగట్ మృతి కేసులో కీలక మలుపు..కీలక వీడియో బయటికి


“భారతీయ రైల్వే కంప్యూటరైజ్డ్ రిజర్వేషన్ సిస్టమ్‌లో, 45 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు, మహిళా ప్రయాణికులకు ఆటోమేటిక్‌గా లోయర్ బెర్త్ కేటాయించే నిబంధన ఉంది. ఛాయిస్ ఇవ్వకపోయినా లోయర్ బెర్త్ కేటాయిస్తారు. అయితే ఇది బుకింగ్ సమయంలో లోయర్ బెర్త్‌లు అందుబాటులో ఉండటంపై ఆధారపడి ఉంటుంది. రైళ్లలో బుకింగ్ సమయంలో లోయర్ బెర్త్‌లు అందుబాటులో లేకపోతే మిడిల్/అప్పర్ బెర్త్‌లు సీనియర్ సిటిజన్లకు కేటాయిస్తారు. మళ్లీ వారికి ఖాళీ అయిన లోయర్ బెర్త్‌లను కేటాయించడానికి టిక్కెట్ చెకింగ్ సిబ్బందికి అధికారం ఉంది" అని రైల్వే సేవ ట్వీట్ చేసింది.

అయితే నెటిజన్లు మాత్రం రైల్వే సేవ ఇచ్చిన వివరణ పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మాకు ఇలాంటి అనుభవమే ఎదురైంది ఒక యూజర్ కామెంట్ చేశారు. "ఈ పనికిరాని సమర్థనలు ఇచ్చే బదులు మీ సాఫ్ట్‌వేర్ ఆల్గారిధమ్ మార్చుకోవడం బెటర్" అని ఒక యూజర్ ఘాటుగా స్పందించారు.

Published by:Shiva Kumar Addula
First published:

Tags: Indian Railways, IRCTC, Trains

ఉత్తమ కథలు