హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

రైల్లో ప్రయాణించే వారికి మామూలు గుడ్ న్యూస్ కాదు..! ఇక అవన్నీ తక్కువ ధరకే అంట..!!

రైల్లో ప్రయాణించే వారికి మామూలు గుడ్ న్యూస్ కాదు..! ఇక అవన్నీ తక్కువ ధరకే అంట..!!

రైల్వేలో ఇక టీ, కాఫీ ఛార్జీల తగ్గింపు

రైల్వేలో ఇక టీ, కాఫీ ఛార్జీల తగ్గింపు

ఆన్‌బోర్డ్ ట్రైన్‌లో ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ద్వారా ఆర్డర్ చేసే టీ, కాఫీ విషయంలో సర్వీస్ ఛార్జీలను తాజాతా తొలగించారు. దీంతో ప్రయాణికులకు పెద్ద ఊరట కల్పించినట్లు అయ్యింది.

భారతీయ రైళ్లలో ప్రయాణించే ప్యాసింజర్లు బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్‌తో పాటు కాఫీ, టీల కోసం కూడా కేటరింగ్ సర్వీస్‌ (IRCTC)లపైనే ఆధారపడుతున్నారు. అయితే ముందస్తుగా రైల్ టికెట్‌తో పాటే ఫుడ్ ఆర్డర్ చేయకపోతే.. రూ.50 సర్వీస్ ఛార్జ్ (Service Charge) కట్టక తప్పదు. ఈ సర్వీస్ ఛార్జ్ కాఫీ, టీలకు కూడా వర్తిస్తుంది. అంటే కేవలం రూ.20 టీ లేదా కాఫీకి రూ.70 కట్టాల్సి ఉంటుంది. ఇది చాలా అన్యాయం అంటూ ప్యాసింజర్లు కొంతకాలంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా తాజాగా టీ, కాఫీలపై సర్వీస్ ఛార్జీ తొలగిస్తున్నట్లు కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఒక ఉత్తర్వు జారీచేసింది. శతాబ్ది ఎక్స్‌ప్రెస్, రాజధాని ఎక్స్‌ప్రెస్, వందే భారత్ ఎక్స్‌ప్రెస్, తేజస్ ఎక్స్‌ప్రెస్, శతాబ్ది ఎక్స్‌ప్రెస్, దురంతో ఎక్స్‌ప్రెస్‌లతో సహా అన్ని ప్రీమియం రైళ్లకు కొత్తగా తీసుకొచ్చిన కేటరింగ్ ఛార్జీలు వర్తిస్తాయి.

ఆన్‌బోర్డ్ ట్రైన్‌లో ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ద్వారా ఆర్డర్ చేసే టీ, కాఫీ విషయంలో సర్వీస్ ఛార్జీలను తాజాతా తొలగించారు. దీంతో ప్రయాణికులకు పెద్ద ఊరట కల్పించినట్లు అయ్యింది. కొత్త రేటు ప్రకారం, ఇకపై మూవింగ్ ట్రైన్స్‌లో ఇచ్చే టీ, కాఫీల ఆర్డర్లకు కూడా రూ.20 చెల్లిస్తే సరిపోతుంది. భారతీయ రైల్వే బోర్డు జులై 15న జారీ చేసిన ఆర్డర్ ప్రకారం కొత్త రేట్ చార్ట్‌లో రైల్వే ప్రయాణికులకు అందించే వివిధ ఫుడ్స్‌కు సంబంధించి డీటెల్డ్‌ రేట్ చార్ట్ ఉంది. ఈ రేట్ చార్ట్‌లో టీ, కాఫీల ధరలు ముందుగా బుక్ చేసుకున్న లేదా రైలులో ప్రయాణిస్తూ ఆర్డర్ చేసిన ప్రయాణికులందరికీ ఒకే విధంగా ఉంటాయి. ఈ రేట్లలో పెరుగుదల కనిపించదు. తాజా నోటిఫికేషన్‌లో ముందస్తుగా కాకుండా రైలులోనే ఫుడ్ ఆర్డర్ ఇచ్చిన ప్రయాణికుల నుంచి రూ.50 అదనపు ఛార్జీ వసూలు చేస్తామని స్పష్టంగా భారతీయ రైల్వే పేర్కొంది.

ఇదీ చదవండి: ఆధార్ భద్రత కోసం యూఐడీఏఐ కొత్త ప్రయోగం.. ఏకంగా హ్యాకర్లను దించుతోంది! చదివితే ఆశ్చర్యపోతారు..


రాజధాని, దురంతో, శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లలో 1A లేదా ECలో ప్రయాణించే ప్రయాణికుల ఫుడ్ చార్ట్ గమనిస్తే.. టికెట్ బుకింగ్ సమయంలో ఫుడ్ ఆర్డర్ చేసుకోనివారు బ్రేక్‌ఫాస్ట్, సాయంత్రం స్నాక్స్ కోసం రూ.140కి బదులుగా రూ.190 చెల్లించాలి. డిన్నర్ కోసం రూ.240కి బదులుగా రూ.290 చెల్లించాల్సి ఉంటుంది. రాజధాని, దురంతో, శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లోని 2AC/3A/CCలో ప్రయాణించే ప్రయాణికులు బ్రేక్‌ఫాస్ట్ కోసం రూ.105కి బదులుగా రూ.155, సాయంత్రం స్నాక్స్‌కు రూ.90కి బదులుగా రూ.140.. లంచ్, డిన్నర్ కోసం రూ.185కి బదులుగా రూ.235 చెల్లించాలి.

దురంతో ఎక్స్‌ప్రెస్‌లోని స్లీపర్ క్లాస్ కేటగిరీలో ప్రయాణించే ప్రయాణికుల ఛార్జీల కోసం రైల్వే ప్రత్యేక చార్ట్‌ను కూడా విడుదల చేసింది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించే ప్రయాణికులు బ్రేక్‌ఫాస్ట్ కోసం రూ.155కి బదులుగా రూ.205, సాయంత్రం స్నాక్స్ కోసం రూ.105కి బదులుగా రూ.155 చెల్లించాల్సి ఉంటుంది. లంచ్, డిన్నర్ కోసం రూ.244కి బదులుగా రూ.294 చెల్లించాల్సి ఉంటుంది.

Published by:Mahesh
First published:

Tags: Coffee, Indian Railways, Railway news, Tea

ఉత్తమ కథలు