Home /News /national /

INDIAN RAILWAYS IRCTC INTRODUCES SPECIAL MENU FOR NAVRATRI 2022 MKS GH

Indian Railways: రైలు ప్రయాణికులకు శుభవార్త -నవరాత్రుల్లో IRCTC స్పెషల్ మెనూ -రూ.99 నుంచి..

నవరాత్రుల్లో ఐఆర్‌సీటీసీ స్పెషల్ మెనూ

నవరాత్రుల్లో ఐఆర్‌సీటీసీ స్పెషల్ మెనూ

హిందువులు నిష్టతో జరుపుకొనే చైత్ర నవరాత్రులు ఈ ఏడాది ఏప్రిల్‌ 2వ తేదీన మొదలై ఏప్రిల్ 11వ తేదీన ముగుస్తాయి. ఈ సందర్భంగా ప్రయాణికుల కోసం భారతీయ రైల్వే ప్రత్యేక మెనూ ప్రకటించింది.

హిందువులు ఛైత్ర నవరాత్రులను ప్రత్యేకంగా జరుపుకొంటారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 2వ తేదీ నుంచి 11వ తేదీ వరకు భక్తి శ్రద్ధలతో దుర్గామాతకు పూజలు చేస్తారు. తొమ్మిది రోజుల ఉత్సవాలలో రోజుకో విధంగా అమ్మవారిని కొలుస్తారు. దేశంలోని అమ్మవారి ఆలయాలను సందర్శిస్తారు. ఈ సందర్భంగా ఛైత్ర నవరాత్రులను పురస్కరించుకొని ప్రయాణికుల కోసం భారతీయ రైల్వే(Indian Railway) ప్రత్యేక ఆహార పదార్థాలతో కూడిన మెనూ(Food Menu)ను ప్రకటించింది.

తొమ్మది రోజుల ఛైత్ర నవరాత్రులు ఏప్రిల్‌ 2వ తేదీనే మొదలుకానుండటంతో తాజాగా కొత్త మెనూను భారత రైల్వే తీసుకొచ్చింది. నవరాత్రి సమయంలో ప్రయాణించే వారు ఇప్పుడు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) అందిస్తున్న కొత్త వంటకాలను ఆనందించవచ్చు. నవరాత్రి ప్రత్యేక ఆహారపదార్థాలు అందుబాటులో ఉన్నాయి. ధరలు కేవలం రూ.99 నుంచి ప్రారంభమవుతాయి.

Chaitra Navratri: ఉగాది నుంచి 9 రోజులు ఈ పనులు చేస్తే నష్టపోతారు.. అనుగ్రహం పొందాలంటే..


ప్రత్యేక దినాలలో భారత రైల్వే అందిస్తున్న ఆహారపదార్థాలు ఇవే..
* స్టార్టర్స్ (ఉల్లిపాయలు, వెల్లుల్లి లేకుండా రాతి కళ్లు ఉప్పుతో తయారు చేస్తారు)
1. ఆలూ చాప్ ఉపవాస సమయంలో తీసుకోవాల్సిన చక్కటి చిరుతిండి. ఉపవాసం సమయంలో ఆకలి వేయకుండా తాజా కొబ్బరి, వేరుశెనగ, సగ్గుబియ్యంతో చేసిన ఈ పదార్థాన్ని స్నాక్స్‌గా తీసుకోవచ్చు.
2. సగ్గుబియ్యం టిక్కీ.. సగ్గుబియ్యంను బంగారు గోధుమ రంగు వచ్చేవరకు బాగా వేయించి, క్రీముతో కూడిన పెరుగుతో వడ్డిస్తారు.

Russia Ukraine War: ఉక్రెయిన్ వణికిస్తున్నా కిల్లర్ డ్రోన్స్ బయటికి తీయని రష్యా.. ఏంటి వ్యూహం?


* మమెయిన్‌ కోర్స్‌ వంటకాలు(ఉల్లిపాయ, వెల్లుల్లి లేకుండా రాతి కళ్లు ఉప్పుతో చేసినవి)
1. పనీర్ మఖ్మలి, సగ్గుబియ్యం ఖిచ్డీ నవరాత్రి థాలీ (ఉల్లిపాయలు, వెల్లుల్లి వినియోగించకుండా రాతి కళ్లు ఉప్పు ఉపయోగిస్తారు). మెనూలో సగ్గుబియ్యం ఖిచ్డీ, సింఘధా ఆలూ పరాఠా, పనీర్ మఖ్మాలి, అర్బీ మసాలా, ఆలూ చాప్, సీతాఫల్ ఖీర్ ఉన్నాయి.
2. కోఫ్తా కర్రీ, సగ్గుబియ్యం ఖిచ్డీ నవరాత్రి థాలీలో సగ్గుబియ్యం ఖిచ్డీ, సింఘాధా ఆలూ పరాటా, కోఫ్తా కర్రీ, అర్బీ మసాలా, ఆలూ చాప్,సీతాఫల్ ఖీర్ ఉన్నాయి.
3. పరాఠాలతో పనీర్ మఖ్మాలి, అర్బీ మసాలాలో పనీర్ మఖ్మాలి, అర్బీ మసాలా, సింఘాధా ఆలూ పరాటా ఉన్నాయి.
4. పచ్చిమిర్చి, ఆవాలు మరియు వేయించిన వేరుశెనగతో తయారు చేసిన సగ్గుబియ్యం ఖిచ్డీ. పెరుగుతో కలిపి ఇస్తారు.

Hottest Summer: 122 ఏళ్లలో అత్యధిక ఉష్ణోగ్రత -మార్చిలోనే మాడు పగిలింది -ఏప్రిల్‌లో మంటలే!


* డెసెర్ట్‌లు
1.సీతాఫల్ ఖీర్.. సీతాఫలం గుజ్జు మరియు క్రీమ్‌తో తయారు చేస్తారు. ఈ సీతాఫల్ ఖీర్.. ఉపవాస భోజనానికి తీపి ముగింపునిస్తుంది.

టిక్కెట్లను బుక్ చేసుకునే సమయంలో ప్రయాణికులు తమ ఉపవాస థాలీని బుక్ చేసుకోవచ్చు. IRCTC ఇ-క్యాటరింగ్ సేవను ఉపయోగించుకొని ఆర్టర్‌ చేసుకొనే అవకాశం ఉంది. లేదా 1323లో సంప్రదించి బుక్ చేసుకోవచ్చు.
Published by:Madhu Kota
First published:

Tags: Indian Railway, Indian Railways, IRCTC

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు