INDIAN Railways : ఇకనుంచి రైల్లోనూ షాపింగ్ చేయొచ్చు.. సరికొత్త నిర్ణయం తీసుకున్న రైల్వే శాఖ

రైళ్లలోనే షాపింగ్ చేసే సదుపాయం పశ్చమ రైల్వే చేపట్టింది. ఇది అక్కడ బాగానే సక్సెస్ అయింది. ఈ సదుపాయాన్ని మన దగ్గర కూడా అమలు చేసేందుకు రైల్వేశాఖ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.

Amala Ravula | news18-telugu
Updated: March 27, 2019, 1:31 PM IST
INDIAN Railways : ఇకనుంచి రైల్లోనూ షాపింగ్ చేయొచ్చు.. సరికొత్త నిర్ణయం తీసుకున్న రైల్వే శాఖ
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మనం దూరప్రాంతాలకు రైళ్లల్లో వెళ్తున్నప్పుడు కొన్నిసార్లు బోర్‌గా ఫీల్ అవుతుంటాం. త్వరగా టైమ్ అయితే బాగుండు అనుకుంటాం. ఎందుకంటే జర్నీకే ఇంత టైమ్ అని ఆలోచిస్తాం కాబట్టి.. కానీ, ఇకనుంచి ఇలాంటి సమస్య ఉండదు.. ఓ వైపూ ట్రెయిన్‌లో ప్రయాణిస్తూనే మరోవైపు ఏంచక్కా షాపింగ్ చేసుకోవచ్చు. ఇందుకు అనుగుణంగా ఇండియన్ రైల్వేస్ సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పశ్చిమ రైల్వే ఈ ప్రాజెక్ట్ సక్సెస్‌ఫుల్‌గా రన్ చేస్తుండగా.. ఆ విధంగానే ప్రణాళికలు చేస్తోంది రైల్వేశాఖ.
గృహోపకరణాలు దగ్గర్నుంచి ఫిట్‌నెస్ పరికరాల వరకూ అన్నీ వస్తువులను మనం ట్రైయిన్‌లోనే ఏంచక్కా షాపింగ్ చేయొచ్చు. అయితే, 2017లోనే రైళ్లలో చిన్నారులకు పాలు, బేబీ ఫుడ్ విక్రయాలను చేసింది రైల్వేశాఖ. కానీ, అంతగా సక్సెస్ కాకపోవడంతో ఆపివేసింది. మళ్లీ ఇన్నిరోజుల తర్వాత సరొకత్త ఆలోచనలతో విస్తృతంగా ఏర్పాటు చేసేందుకు సరికొత్త వ్యూహాలు చేస్తోంది.

First published: March 27, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>