Home /News /national /

INDIAN RAILWAYS HAS INCREASED THE PRICE OF PLATFORM TICKETS AT MOST STATIONS SSR

దేశవ్యాప్తంగా ప్లాట్‌ఫాం టికెట్ ధరను భారీగా పెంచిన రైల్వే.. లోకల్ ట్రైన్ కనీస చార్జీ కూడా...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

రైల్వే స్టేషన్లలో రద్దీని తగ్గించి కోవిడ్-19 వ్యాప్తిని అడ్డుకునేందుకే తాత్కాలికంగా ప్లాట్‌ఫాం టికెట్ ధరలను పెంచినట్లు రైల్వే శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు రైల్వే శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. పెంచిన ప్లాట్‌ఫాం టికెట్ ధరలను వెంటనే అమల్లోకి తీసుకురావాలని...

ఇంకా చదవండి ...
    న్యూఢిల్లీ: భారతీయ రైల్వే కీలక ప్రకటన చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే స్టేషన్లలో ప్లాట్‌ఫాం టికెట్ ధరలను పెంచుతున్నట్లు తెలిపింది. రైల్వే ప్లాట్‌ఫాం టికెట్ ధరను పది రూపాయల నుంచి ముప్పై రూపాయలకు పెంచుతున్నట్లు భారతీయ రైల్వే తెలిపింది. రైల్వే స్టేషన్లలో రద్దీని తగ్గించి కోవిడ్-19 వ్యాప్తిని అడ్డుకునేందుకే తాత్కాలికంగా ప్లాట్‌ఫాం టికెట్ ధరలను పెంచినట్లు రైల్వే శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు రైల్వే శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. పెంచిన ప్లాట్‌ఫాం టికెట్ ధరలను వెంటనే అమల్లోకి తీసుకురావాలని అన్ని రైల్వే జోన్లనూ ఆదేశించింది. ప్లాట్‌ఫాం టికెట్ కొనుగోలు చేసిన వారు రెండు గంటల పాటు ప్లాట్‌ఫామ్‌పై ఉండవచ్చు.

    ప్లాట్‌ఫాం టికెట్ ధరలు మాత్రమే కాదు లోకల్ ట్రైన్ టికెట్ ధరలను కూడా రైల్వే శాఖ భారీగా పెంచడం గమనార్హం. లోకల్ ట్రైన్స్‌లో కనీస చార్జీ 30 రూపాయలుగా రైల్వే శాఖ నిర్ణయించింది. దేశంలో కరోనా కేసులు మళ్లీ క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో అవసరం లేని ప్రయాణాలను నియంత్రించేందుకే చార్జీలను పెంచుతున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. ప్లాట్‌ఫామ్ టికెట్ ధరల పెంపుపై ప్రజలు మండిపడుతున్నారు. కోవిడ్ పేరు చెప్పి రైల్వే అధికారులు ప్రజలను దోచుకుంటున్నారని విమర్శిస్తున్నారు.
    Published by:Sambasiva Reddy
    First published:

    Tags: Indian Railways, Train

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు