INDIAN RAILWAYS HAS DIRECTED ITS CATERING AND TICKETING ARM IRCTC TO CANCEL ALL THE EXISTING CONTRACTS OF MOBILE CATERING SERVICES NS GH
Indian Railways: కీలక నిర్ణయం తీసుకున్న IRCTC.. ఆ ఒప్పందాలను రద్దు చేస్తూ ఉత్తర్వులు.. వివరాలివే..
ప్రతీకాత్మక చిత్రం
మొబైల్ క్యాటరింగ్ సేవల విషయంలో రైల్వే శాఖ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత పరిస్థితుల్లో మొబైల్ క్యాటరింగ్ సేవల పునరుద్దరణకు అనుమతించలేమని పేర్కొంది. అంతేకాకుండా..
కరోనా కారణంగా సుదీర్ఘకాలం పాటు నిలిచిపోయిన రైల్వే సర్వీసులు క్రమంగా ప్రారంభమవుతున్నాయి. వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం, కేసులు తగ్గుముఖం పడుతుండటంతో రైల్వే శాఖ కొన్ని ప్రత్యేక రైళ్లను నడుపుతుంది. అంతేకాక, ఐఆర్సీటీసీ అందించే రెడీ టూ ఈట్ లేదా ఈ–కేటరింగ్ సేవలను ఇటీవలే తిరిగి ప్రారంభించింది. అయితే, మొబైల్ క్యాటరింగ్ సేవల విషయంలో రైల్వే శాఖ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత పరిస్థితుల్లో మొబైల్ క్యాటరింగ్ సేవల పునరుద్దరణకు అనుమతించలేమని పేర్కొంది. అంతేకాక, మొబైల్ క్యాటరింగ్ ప్రస్తుత ఒప్పందాలన్నింటినీ రద్దు చేయాలని ఇండియన్ రైల్వే తన క్యాటరింగ్, టికెటింగ్ విభాగానికి ఆదేశించింది. ప్రత్యేక రైళ్లలో కేవలం ఈ–క్యాటరింగ్ లేదా రెడీ- టు -ఈట్ సేవలు మాత్రమే అందుబాటులో ఉంటాయని రైల్వే శాఖ స్పష్టం చేసింది. ఈ నిర్ణయంపై రైల్వే అధికారి మాట్లాడుతూ.. "ప్రస్తుత నిబంధనలు, షరతుల ప్రకారం వండిన ఆహారాన్ని ప్యాకెట్లలో అందించే మొబైల్ క్యాటరింగ్ ఒప్పందాలన్నింటినీ రద్దు చేయాలని ఐఆర్సీటిసి నిర్ణయించింది.
ఈ ఆహారంతో కరోనా సంక్రమణ అవకాశం ఉన్న దృష్ట్యా, ప్రయాణికుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుపెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నాం.” అని అన్నారు. అయితే, మొబైల్ క్యాటరింగ్ సేవలు అందించనందుకు దీన్ని కాంట్రాక్టర్ డిఫాల్ట్‌గా పరిగణించవద్దని, వారికి ఎటువంటి జరిమానా విధించవద్దని, వారి సెక్యూరిటీ డిపాజిట్ (ఎస్డి), అడ్వాన్స్ లైసెన్స్ ఫీజును కూడా తిరిగి ఇవ్వాలని ఐఆర్‌సిటిసిని రైల్వే శాఖ ఆదేశించింది.
రెడీ టూ ఈట్ సేవలకే అనుమతి..
అయితే, దేశంలో రైల్వే సర్వీసులు క్రమంగా ప్రారంభం కావడంతో తమ సర్వీసులను కూడా పునరుద్దరించాలని కోరుతూ ఇండియన్ రైల్వే మొబైల్ క్యాటరర్స్ అసోసియేషన్(ఐఆర్ఎంసిఎ) రైల్వే బోర్డ్‌ను/ఐఆర్‌సిటిసిని కోరింది. లైసెన్స్ ఫీజును తగ్గించి స్ట్రాటిక్ యూనిట్లకు అనుమతిచ్చిన విధంగానే తమ మొబైల్ క్యాటరింగ్ సర్వీసులను కూడా అనుమతించాలని కోరుతూ 2021 జనవరి 4న లేఖ రాసింది. అయితే, ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో మొబైల్ క్యాటరింగ్ సేవలకు అనుమతించలేమని జనవరి 27, ఫిబ్రవరి 8న విడుదల చేసిన లేఖలో రైల్వే బోర్డ్ స్పష్టం చేసింది.
ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఇండియన్ రైల్వే మొబైల్ క్యాటరర్స్ అసోసియేషన్(ఐఆర్ఎంసిఎ) మద్రాసు హైకోర్డులో పిల్ దాఖలు చేసింది. విచారణ చేపట్టిన హైకోర్టు.. రైల్వే బోర్డు నిర్ణయం మేరకు నడుచుకోవడాలని ఇండియన్ రైల్వే మొబైల్ క్యాటరర్స్ అసోసియేషన్(ఐఆర్ఎంసిఎ)ని కోరింది.