• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • INDIAN RAILWAYS DISCOURAGING UNNECESSARY TRAVEL BY INCREASING FARE OF SHORT DISTANCE TRAINS NS GH

Indian Railways: ఆ ప్రయాణికులపై భారీగా ఛార్జీల భారం.. ఇండియన్ రైల్వే షాకింగ్ నిర్ణయం.. వివరాలివే

Indian Railways: ఆ ప్రయాణికులపై భారీగా ఛార్జీల భారం.. ఇండియన్ రైల్వే షాకింగ్ నిర్ణయం.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

కరోనా వ్యాప్తి అడ్డుకోవాలనే లక్ష్యంతో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రైళ్లలో అనవసర ప్రయాణాలను తగ్గించేందుకు స్వల్ప దూరం ప్రయాణాలకు ఛార్జీలను పెంచింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

  • Share this:
కరోనా వ్యాప్తి అడ్డుకోవాలనే లక్ష్యంతో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రైళ్లలో అనవసర ప్రయాణాలను తగ్గించేందుకు స్వల్ప దూరం ప్రయాణాలకు ఛార్జీలను పెంచింది. దీనిపై రైల్వే శాఖ మంత్రి పీయూష్​ గోయల్​ మాట్లాడుతూ..‘‘తక్కువ దూరం ప్రయాణించే రైళ్లలో చార్జీలను స్వల్పంగా పెంచాం. కరోనా వ్యాప్తి నేపథ్యంలో అనవసర ప్రయాణాలను నివారించడానికే ఈ నిర్ణయం తీసుకున్నాం.” అని తెలిపారు. కాగా.. COVID-19 మహమ్మారి కారణంగా విధించిన లాక్‌డౌన్​తో 2020 మార్చి 22న భారతీయ రైల్వే సాధారణ రైళ్ల కార్యకలాపాలను నిలిపివేసింది. సుదీర్ఘకాలం తర్వాత లాక్​డౌన్​ ఎత్తివేయడంతో రైళ్ల సంఖ్యను గ్రేడెడ్ పద్ధతిలో పెంచుకుంటూ పోతుంది. అయితే, ప్రభుత్వం లాక్​డౌన్​​ నిబంధనలను సడలించినప్పటికీ, కొన్ని ప్రత్యేక రైళ్లను నడపడానికే అనుమతిచ్చింది. దీంతో.. ప్రారంభంలో సుదూర ప్రయాణీకుల కోసం రైళ్లను ప్రారంభించి, ఇప్పుడు, క్రమంగా తక్కువ దూరం ప్రయాణించే ప్యాసింజర్​ రైళ్లను సైతం నడుపుతుంది. అయితే, ప్యాసింజర్​ రైళ్లలో రద్దీ దృష్ట్యా కరోనా వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని గ్రహించిన రైల్వే శాఖ.. ఒక ప్రత్యేక నిబంధన కింద ఛార్జీల పెంపు నిర్ణయం తీసుకుంది. వీటి ఛార్జీలు ఎక్స్‌ప్రెస్ రైళ్లలో అన్​రిజర్వుడ్​ టికెట్ ధరతో సమానంగా ఉంటాయని రైల్వే శాఖ తెలిపింది.

ప్రస్తుతం, రైల్వే శాఖ దాదాపు 65% మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లను, అలాగే 90% పైగా సబర్బన్ రైళ్లను నడుపుతుంది. పూర్తి స్థాయిలో రైళ్లను ప్రారంభించకపోవడంపై రైల్వే శాఖ స్పందిస్తూ.. “కరోనా ముప్పు ఇంకా పూర్తిగా తొలిగిపోలేదు. కొన్ని రాష్ట్రాల్లో మళ్లీ విజృంభిస్తోంది. రైళ్లలో, రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీని అరికట్టడంతో పాటు ఒకరి నుంచి మరొకరికి కరోనా వ్యాప్తి చెందకుండా నివారించే చర్యలో భాగంగానే పూర్తి స్థాయిలో రైళ్లను పునరుద్ధరించలేదు.” అని తెలిపింది.

పెంపు స్వల్పమే అంటున్న రైల్వే అధికారులు..
కాగా.. రైల్వే శాఖ ప్రస్తుతం, ప్రతిరోజూ 1,250 మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లు, 5,350 సబర్బన్ రైలు సర్వీసులు, 326 కి పైగా ప్యాసింజర్ రైళ్లను నడుపుతుంది. అయితే, మొత్తం ఆపరేషన్​లో ఉన్న రైళ్లలో తక్కువ దూరం ప్రయాణించే రైళ్లు 3 శాతం కన్నా తక్కువే ఉన్నాయని రైల్వే శాఖ స్పష్టం చేసింది. కాబట్టి, ఛార్జీల భారం కూడా తక్కువ మంది ప్రయాణికులపైనే పడుతుందని పేర్కొంది.

మంత్రిత్వ శాఖ ప్రకారం, రైలు ప్రయాణాలకు భారత రైల్వే ఎల్లప్పుడూ సబ్సిడీ అందిస్తుంది. అందువల్ల, ఛార్జీల పెంపు ఉన్నప్పటికీ, భారతీయ రైల్వే ఇప్పటికీ ప్రజల ప్రయాణానికి చౌకైన ఎంపికగా ఉందని అధికారులు తెలిపారు. కోవిడ్ సంక్షోభం కారణంగా, చాలా సవాళ్ల మధ్య రైళ్లు నడుస్తున్నాయని, వీటిలో తక్కువ ఆక్యుపెన్సీ ఉన్నప్పటికీ రైళ్లను నడుపుతున్నామని రైల్వే మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
Published by:Nikhil Kumar S
First published:

అగ్ర కథనాలు