సూపర్ అనకొండతో భారతీయ రైల్వే మరో రికార్డు..

గతేడాది ఫిబ్రవరిలో రెండు రైళ్లను ఒక్కటిగా చేసి ఒడిశాలోని సంబల్ పూర్ డివిజన్‌లో అనకొండ పేరుతో రెండు కిలోమీటర్ల పొడవైన రైలును నడపడమూ రికార్డుగా నమోదయ్యింది.

news18-telugu
Updated: July 3, 2020, 2:32 PM IST
సూపర్ అనకొండతో భారతీయ రైల్వే మరో రికార్డు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
భారతీయ రైల్వే మరో సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఇటీవల జూన్‌లో గుజరాత్‌లోని పాలంపూర్- బొటాడ్ స్టేషన్ల మధ్య 7.57మీటర్ల ఎత్తయిన డబుల్ డెక్కర్ కంటైనర్ రైలు నడిపి ప్రపంచ స్థాయి రికార్డు సృష్టించింది. ఇది విద్యుత్తు మార్గంలో ప్రపంచంలోనే అతి ఎత్తైన రైలును పట్టాలపై పరుగులు పెట్టించి కనివినీ ఎరుగని రికార్డు నెలకొల్పింది. గతేడాది ఫిబ్రవరిలో రెండు రైళ్లను ఒక్కటిగా చేసి ఒడిశాలోని సంబల్ పూర్ డివిజన్‌లో అనకొండ పేరుతో రెండు కిలోమీటర్ల పొడవైన రైలును నడపడమూ రికార్డుగా నమోదయ్యింది. తాజాగా 177 వ్యాగన్లతో ఉన్న 2.8 కిలోమీటర్ల పొడవైన గూడ్సు రైలును ఒకేసారి పట్టాల మీద పరుగులు పెట్టించారు. సూపర్ అనకొండగా పిలిచే ఈ రైలు ఒడిశా బిలాస్‌పూర్ డివిజన్‌లోని లజ్‌కురా-రవుర్కెల మధ్య రైలు పరుగులు తీసింది.



నిజానికి ఇది ఒక్క రైలు కాదు. మూడు రైళ్లను కలిపి ఒక్కటిగా చేశారు. అలా 177 వ్యాగన్లలో 15 వేల టన్నుల బొగ్గును ఒకేసారి ట్రాన్స్‌పోర్టు చేయడం గమనార్హం. ఈ మేరకు రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఇదిలావుంటే.. లాక్‌డౌన్ నేపథ్యంలో ప్యాసింజర్ రైళ్లు రద్దు కావడంతో సరుకులను రవాణ చేసే రైళ్లను సరికొత్త విధానంలో పరుగులు పెట్టించేందుకు రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది.
First published: July 3, 2020, 2:19 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading