Home /News /national /

INDIAN RAILWAYS AND THE RACE TO PUNCTUALITY UMG GH

Explained: ఇండియన్ రైల్వేస్‌పై కాగ్ సంచలన రిపోర్ట్.. ఆ విషయంలో మెరుగవ్వాలంటూ సలహా..!

ఇండియన్ రైల్వేస్‌పై కాగ్ సంచలన రిపోర్ట్.. ఆ విషయంలో మెరుగవ్వాలంటూ సలహా..!

ఇండియన్ రైల్వేస్‌పై కాగ్ సంచలన రిపోర్ట్.. ఆ విషయంలో మెరుగవ్వాలంటూ సలహా..!

కంప్ట్రోలర్, ఆడిటర్ జనరల్- CAG నివేదిక ప్రకారం.. 2008, 2019 మధ్య భారతీయ రైల్వే మౌలిక సదుపాయాలపై రూ.2.5 లక్షల కోట్లు ఖర్చు చేశారు. అయినా రైళ్లు ఆలస్యం కావడం ఎక్కువైంది. సమయపాలనలో రైళ్లు 0.18 శాతం మాత్రమే అభివృద్ధిని కనబరిచాయి.

రైలు ఆలస్యం అవడంతో ఫ్లైట్‌ మిస్‌ అయిన వ్యక్తికి నష్టపరిహారం చెల్లించాలని గతేడాది సుప్రీం కోర్టు ఇండియన్ రైల్వేస్‌ను ఒక సందర్భంలో ఆదేశించింది. రైలు ఆలస్యం కారణంగా ఇలా పరిహారం చెల్లించమని ఆదేశించడం మొదటిసారి. గతేడాది సెప్టెంబరులో అజ్మీర్- జమ్మూ ఎక్స్‌ప్రెస్ నాలుగు గంటలు ఆలస్యంగా గమ్యస్థానికి చేరుకోవడంతో.. ఓ ప్రయాణికుడు జమ్మూ-శ్రీనగర్ విమానాన్ని మిస్ అయ్యాడు. దీంతో ప్రయాణికుడికి రూ.30,000 నష్టపరిహారం చెల్లించాలని భారతీయ రైల్వేను సుప్రీంకోర్టు ఆదేశించింది. నష్టపరిహారం చెల్లించడం మొదటిసారే అయినా దశాబ్ధాలుగా రైళ్లు మాత్రం ఆలస్యంగానే నడుస్తున్నాయి. ఈ విషయాలకు కాగ్ రిపోర్ట్ ఎత్తిచూపింది.

కంప్ట్రోలర్, ఆడిటర్ జనరల్- CAG నివేదిక ప్రకారం.. 2008, 2019 మధ్య భారతీయ రైల్వే మౌలిక సదుపాయాలపై రూ.2.5 లక్షల కోట్లు ఖర్చు చేశారు. అయినా రైళ్లు ఆలస్యం కావడం ఎక్కువైంది. సమయపాలనలో రైళ్లు 0.18 శాతం మాత్రమే అభివృద్ధిని కనబరిచాయి. అత్యధికంగా 2017-18 కాలంలో అన్ని రైళ్లలో 30 శాతం ఆలస్యంగా నడిచాయి. ఈ కాలంలో భారతీయ రైల్వే సమయపాలన అధ్వాన్నంగా ఉంది.

 ఇదీ చదవండి: మీరు కంటెంట్ రైటర్సా..? అయితే మీకు బంపరాఫరే.. భారీగా ఇంటర్న్‌షిప్ ఆఫర్స్..!


* సమస్యను పరిష్కరిస్తాయా?
2021-22 నాటికి సరకు రవాణా రైళ్లు, మెయిల్/ఎక్స్‌ప్రెస్ రైళ్ల సగటు వేగాన్ని పెంచే లక్ష్యంతో ప్రభుత్వం 2016లో ‘మిషన్ రాఫ్తార్’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. రైళ్ల వేగాన్ని ఇంకా పెంచాల్సి ఉందని కాగ్ ఆడిట్ పేర్కొంది. భారతీయ రైల్వేలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లు 160-180 కిమీ వేగంతో నడిచే సామర్థ్యంతో ఉన్నాయి. వందే భారత్ రైళ్లు సమయపాలన పాటిస్తున్నాయి. అయితే వేగం ఒక్కటే దోహదపడే అంశం కాదు. స్టేషన్లలో తక్కువ హాల్ట్ సమయం, కనిష్ట టర్నరౌండ్ సమయం, వేగవంతమైన యాక్సెలరేషన్‌, డీసెలరేషన్‌ వంటివి వందే భారత్ సమయపాలనకు ఉపయోగపడుతున్నాయి.

* మౌలిక సదుపాయాల పాత్ర ఏంటి?
రైళ్ల సమయపాలనలో మౌలిక సదుపాయాలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. రైలు ట్రాఫిక్, కొత్త లైన్లు, డబ్లింగ్, ట్రాక్ గేజ్‌లు వంటి ఇతర అంశాలు రైల్వే నెట్‌వర్క్ సాఫీగా నడిచేలా చేస్తాయి. ట్రాఫిక్ నోడ్‌లను తగ్గించడంలో మౌలిక సదుపాయాలు కూడా కీలకంగా పని చేస్తాయి. స్టేషన్లలో రైళ్లకు స్థలం లేకపోవటం వల్ల కూడా రైళ్లు ఆలస్యమవుతున్నాయని CAG గుర్తించింది. ఇంజినీరింగ్, బ్లాక్ & సిగ్నల్, టెలికమ్యూనికేషన్ వంటి అంశాలు రైలు సమయపాలనలో 51 శాతం దోహదం చేస్తాయని కాగ్ నివేదిక పేర్కొంది. ట్రాక్‌లపై రద్దీని తగ్గించడం వల్ల రైళ్లు సమయానికి నడుస్తాయని అభిప్రాయపడింది.



* ఇతర దేశాలలో రైల్వేల నుంచి ఏం నేర్చుకోవచ్చు?
సమయపాలనలో భారతదేశాన్ని పోల్చిచూసే పరిస్థితి ఇంకా రాలేదని కాగ్‌ తెలిపింది. భారతదేశం సమయపాలన ప్రమాణం 15 నిమిషాల వద్ద ఉండగా, ఇతర దేశాలు చాలా తక్కువ స్థాయిని కలిగి ఉన్నాయి. ఉదాహరణకు జపాన్‌లో కొన్ని సెకన్ల థ్రెషోల్డ్ ఉంది. నెదర్లాండ్స్ సమయపాలన ప్రమాణం 3 నిమిషాల్లో ఉంది. చైనా వంటి దేశాలు రైల్వేల సాధారణ నెట్‌వర్క్ నుంచి వేరుగా ఉన్న ప్రత్యేక హై-స్పీడ్ లైన్‌లను అభివృద్ధి చేశాయి. ఈ హై-స్పీడ్ రైల్వే లైన్లు గొప్ప విశ్వసనీయత, సమయపాలన పాటిస్తున్నాయి.
Published by:Mahesh
First published:

Tags: Bullet Train, India Railways, Railways, Train

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు