Home /News /national /

INDIAN RAILWAYS A NEW RAIL SERVICE BETWEEN GUNTUR KACHEGUDA WILL START FROM APRIL 1 HERE IS THE DETAILS NK

Indian Railways: గుడ్ న్యూస్ చెప్పిన రైల్వే శాఖ... ప్రయాణికులు హ్యాపీ

గుడ్ న్యూస్ చెప్పిన రైల్వే శాఖ (ప్రతీకాత్మక చిత్రం)

గుడ్ న్యూస్ చెప్పిన రైల్వే శాఖ (ప్రతీకాత్మక చిత్రం)

Indian Railways: మ్యాజిక్ చేసేవారు... టోపీ లోంచీ... పావురాలు, చాకెట్లు ఒక్కొక్కటిగా తీస్తూ ఆనందం కలిగిస్తారు. అలాగే భారత రైల్వే శాఖ కూడా ఒక్కో వరాన్నీ ప్రకటిస్తూ ఊరిస్తోంది.

    Indian Railways: ఇండియాలో మరికొన్ని రోజుల్లో కరోనా కేసులు బాగా తగ్గిపోతాయి అని భావిస్తున్న భారతీయ రైల్వే శాఖ... క్రమంగా తన సర్వీసుల్లో మార్పులు చేయడం, అదనపు సర్వీసులు కల్పించడం వంటివి చేస్తోంది. తాజాగా గుంటూరు-కాచిగూడ-గుంటూరు ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌ రైలును ఏప్రిల్‌ 1 నుంచి మళ్లీ పట్టాలెక్కిస్తోంది. ఇదేమీ కొత్త రైలు కాదు. కరోనాకు ముందు ఉన్నదే. కరోనా లాక్‌డైన్ విధించాక... మూలకెళ్లి ఉండిపోయింది. ఇప్పుడు మళ్లీ ట్రాక్‌లోకి తెస్తున్నారు. ఈ రైలు ఏప్రిల్‌ 1 న రాత్రి 7 గంటలకు గుంటూరులో బయలుదేరి నరసరావుపేట, వినుకొండ, మార్కాపురం, గిద్దలూరు, నంద్యాల, డోన్‌, కర్నూల్‌ సిటీ, జోగులాంబ గద్వాల, వనపర్తి రోడ్‌, మహబూబ్‌నగర్‌, జడ్చర్ల, షాద్‌నగర్‌ మీదుగా మర్నాడు ఉదయం 9.45 గంటలకు కాచిగూడకు వెళ్తుంది. ఏప్రిల్‌ 2 న కాచిగూడలో మధ్యాహ్నం 3.10 గంటలకు బయలుదేరి షాద్ నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, వనపర్తిరోడ్, జోగులాంబ గద్వాల, కర్నూల్ సిటీ, డోన్, నంద్యాల, గిద్దలూరు, మార్కాపురం, వినుకొండ, నరసరావుపేట మీదుగా మర్నాడు ఉదయం 6.45కి గుంటూరు వెళ్తుంది.

    ప్యాసింజర్ రైళ్లు రానట్లేనా:
    ఎక్స్‌ప్రెస్‌లు ఎన్ని వస్తున్నా... దేశంలో చాలా మంది ప్రజలు ప్యాసింజర్ రైళ్లు ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తున్నారు. ఆ మధ్య ఏప్రిల్ నుంచి వస్తాయని ప్రచారం జరిగినా... అలాంటిదేమీ లేదని రైల్వే శాఖ క్లారిటీ ఇచ్చింది. దశలవారీగా రైళ్లను తిరిగి తెస్తామని చెప్పింది గానీ... ఎప్పటి నుంచి ప్యాసింజర్ రైళ్లను ప్రవేశపెడుతుందో డేట్ చెప్పలేదు. ప్రస్తుతానికి 65 శాతం రైళ్లు.. ప్రయాణికులకు అందుబాటులో ఉన్నాయని తెలిపింది. తాజాగా కొన్ని టూరిజం ప్యాకేజీలను IRCTC ప్రకటిస్తోంది.


    ఇది కూడా చదవండి: Mole theory: మీకు పుట్టుమచ్చలున్నాయా... వాటికి అర్థాలు తెలుసుకోండి

    దేశంలో కరోనా బాగా తగ్గితే... యాక్టివ్ కేసులు బాగా పడిపోతే... వ్యాక్సిన్ 30 కోట్ల మంది వరకూ పొందితే అప్పుడు రైల్వే శాఖ ప్యాసింజర్ రైళ్లను కూడా అందుబాటులోకి తెస్తుందేమో.
    Published by:Krishna Kumar N
    First published:

    Tags: Indian Railways

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు