Home /News /national /

INDIAN RAILWAY IMPOSES FINE ON 10 THOUSAND RUPEE ON PHONEPE WITH WRITTEN APOLOGY SK

'Phone pe' పై రైల్వేశాఖ చర్యలు.. భారీగా జరిమానా

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

రైల్వేశాఖకు రాతపూర్వక క్షమాపణలు చెప్పడంతో పాటు రూ.10వేల జరిమానా కట్టారు. ఇది మరోసారి పునరావృతం కాదని హామీ ఇచ్చారు. స్వచ్ఛ భారత్‌ కార్యక్రమానికి సహకరిస్తామని తెలిపారు.

    ఆన్‌లైన్ పేమెంట్ యాప్ 'ఫోన్ పే' (Phone pe)పై రైల్వేశాఖ చర్యలు తీసుకుంది. అంతేకాదు ఫోన్ పే చేసిన పనికి భారీగా జరిమానా విధించింది. దాంతో దిగొచ్చిన ఆ సంస్థ ప్రతినిధులు రైల్వేశాఖకు రాతపూర్వక క్షమాపణలు చెప్పి రూ.10వేల జరిమానా కట్టారు. వారణాసిలో ఈ ఘటన జరిగింది. అసలేం జరిగిదంటే.. ఇటీవల వారణాసి రైల్వే స్టేషన్ పరిసరాల్లో ఫోన్ పే యాప్‌కు సంబంధించి ఆ సంస్థ ప్రతినిధులు పోస్టర్లు, స్టిక్కర్లను అంటించారు. రైల్వేశాఖ అనుమతి తీసుకోకుండానే స్టేషన్‌లో ఎక్కడ పడితే అక్కడ పోస్టర్లను ఏర్పాటు చేశారు.

    స్టేషన్ మాస్టర్ సూచన మేరకు చీఫ్ హెల్త్ ఇన్‌స్పెక్టర్ రాకేశ్ పాఠక్ ఫోన్ పే తీరుపై రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోస్టర్లు, స్టిక్కర్లు అంటించి రైల్వే స్టేషన్ సౌందర్యాన్ని పాడు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రైల్వేశాఖ ఆధ్వర్యంలో సెప్టెంబరు 15 నుంచి అక్టోబరు వరకు స్వచ్ఛతా కార్యక్రమాలు జరుగుతున్నాయని.. అలాంటి సమయంలోనే స్టేషన్‌లో స్టికర్లు, పోస్టర్లు అంటించారని ఫోన్‌పేపై ఫిర్యాదు చేశారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

    ఈ అంశానికి సంబంధించి ఫోన్‌పే సంస్థకు రైల్వేశాఖ నోటీసుల పంపడంతో స్థానిక ఫోన్ పే ప్రతినిధి అంకుశ్ సింఘాల్ స్పందించారు. రైల్వేశాఖకు రాతపూర్వక క్షమాపణలు చెప్పడంతో పాటు రూ.10వేల జరిమానా కట్టారు. ఇది మరోసారి పునరావృతం కాదని హామీ ఇచ్చారు. స్వచ్ఛ భారత్‌ కార్యక్రమానికి సహకరిస్తామని తెలిపారు.

    First published:

    Tags: Indian Railways, Phone pe, Uttar pradesh, Varanasi

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు