రైల్వే శాఖ నిర్ణయంతో కూలీలు ‘సైడ్ సైడ్’ అనాల్సిన పనిలేదు..

కూలీల కోసం ప్రత్యేక నడకదారి నిర్మించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. తొలిదశలో దేశంలోని ప్రముఖ రైల్వే స్టేషన్లలో వీటిని నిర్మిస్తారు.

news18-telugu
Updated: March 7, 2019, 8:37 PM IST
రైల్వే శాఖ నిర్ణయంతో కూలీలు ‘సైడ్ సైడ్’ అనాల్సిన పనిలేదు..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: March 7, 2019, 8:37 PM IST
రైల్వే స్టేషన్లలో నెత్తి మీద బరువు పెట్టుకుని, ప్రయాణికుల మధ్య ‘సైడ్ సైడ్’ అంటూ అరుస్తూవెళ్లాల్సిన అవసరం లేకుండా కూలీల నెత్తిన పాలుపోసే నిర్ణయం తీసుకుంది రైల్వే శాఖ. బరువు తీసుకుని వెళ్లే కూలీల కోసం ప్రత్యేకంగా నడకదారులను నిర్మించాలని నిర్ణయం తీసుకున్నట్టు పీటీఐ వార్తాసంస్థ తెలిపింది. రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ నేతృత్వంలోని ఈ ప్రతిపాదనకు ఓకే చెప్పారు. దీని వల్ల అటు ప్రయాణికులకు, ఇటు కూలీలకు కూడా ఉపయోగకరంగా ఉంటుందని రైల్వే శాఖ అభిప్రాయపడింది. జన బాహుళ్యంలో అందరూ రైల్వే కూలీ అని పిలుస్తున్నా.. ఈ పేరును 2016లో మార్చారు. కూలీలను ‘సహాయకులు’గా పేరు మార్చారు. అసంఘటిత రంగంలో ఉండే ఈ సహాయకులకు సామాజిక భద్రత కూడా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని రైల్వే శాఖ తెలిపింది. 2016 నుంచే కూలీల కోసం ప్రత్యేకంగా నడకదారి ఉండాలనే ప్రతిపాదన వచ్చింది. అయితే, ఇప్పటికి మోక్షం కలిగింది.

INDIAN RAILWAYS, INDIAN RAILWAYS NEWS, INDIAN RAILWAYS COOLIE, indian railway coolies, indian railway coolie news, indian railway coolie photo, railways news, ఇండియన్ రైల్వే, కూలీలకు ప్రత్యేక నడకదారి, రైల్వే కూలీలకు న్యూస్,
ప్రతీకాత్మక చిత్రం


కూలీలు తల మీద బరువు మోసుకుంటూ వెళ్తుంటారు. అలాగే, కొంచెం ఎక్కువ సామగ్రి ఉంటే ట్రాలీలతో తీసుకెళ్తుంటారు. అయితే, సెలవులు, పండుగలు, పెళ్లిళ్ల వంటి సందర్భాల్లో రైల్వే స్టేషన్లు కిక్కిరిసి ఉంటాయి. అలాంటి సమయంలో ట్రాలీల మీద తీసుకుని వెళ్లాలన్నా కూడా వారికి ఇబ్బందే. అదే తల మీద మోసుకుని వెళ్లడం మరింత కష్టం. దీంతో వారికి సులువుగా ఉండేలా కూలీల కోసం ప్రత్యేక నడకదారి నిర్మించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. తొలిదశలో దేశంలోని ప్రముఖ రైల్వే స్టేషన్లలో వీటిని నిర్మిస్తారు.

INDIAN RAILWAYS, INDIAN RAILWAYS NEWS, INDIAN RAILWAYS COOLIE, indian railway coolies, indian railway coolie news, indian railway coolie photo, railways news, ఇండియన్ రైల్వే, కూలీలకు ప్రత్యేక నడకదారి, రైల్వే కూలీలకు న్యూస్,
పీయూష్ గోయల్ (File)
రైల్వే కూలీల పిల్లల కోసం కూడా మరో ఏర్పాటు చేసింది రైల్వే శాఖ. వారు ఏ డివిజన్ పరిధిలో పనిచేస్తున్నారో.. ఆడివిజన్ పరిధిలో ఉండే రైల్వే స్కూళ్లు, మహిళా సమితులు నిర్వహించే బడిలో వారి పిల్లలను చదివించుకోవచ్చు. అలాగే, 50 మంది కంటే ఎక్కువ కూలీలు ఉండే రైల్వే స్టేషన్లలో వారి కోసం ప్రత్యేక విశ్రాంతి గది, ఓ టీవీ, రక్షిత మంచినీరు కూడా ఏర్పాటు చేయనున్నారు.
First published: March 7, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...