హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Indian Railway: ఇండియన్ రైల్వేకు కోట్ల ఆదాయం తెచ్చిన ఆ ముగ్గురు ఉద్యోగులు ..ఎలాగంటే

Indian Railway: ఇండియన్ రైల్వేకు కోట్ల ఆదాయం తెచ్చిన ఆ ముగ్గురు ఉద్యోగులు ..ఎలాగంటే

indian railway(Photo:Twitter)

indian railway(Photo:Twitter)

Indian Railway:రైళ్లలో అనధికార ప్రయాణాలు చేసే వారి నుంచి జరిమానాలు వసూలు చేసే రైల్వే ఉద్యోగుల్లో టాప్‌ ప్లేసులో నిలిచారు టికెట్ ఇన్‌స్పెక్టర్ నందకుమార్. 11నెలల్లో ఆయన రైల్వే సంస్థకు కోటిన్నరకుపైగా ఆదాయం తెచ్చిపెట్టారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Chennai, India

నిత్యం లక్షలాది మందిని గమ్యస్థానాలకు చేర్చే అతి పెద్ద రవాణా వ్యవస్థ ఇండియన్ రైల్వే (Indian Railway)అని చెప్పక తప్పదు. అలాంటి భారతీయ రైల్వేకు ప్రయాణికుల ద్వారా వచ్చే ఆదాయంతో పాటు టికెట్‌ లేకుండా ప్రయాణించే వారికి విధించే జరిమానా, రైల్వే నిబంధనలకు విరుద్దంగా ఓవర్ లగేజీ, ఇతర ఫైన్లతో కలిపి రోజూ లక్షల్లో ఆదాయం వస్తుంది. ఇలాంటి సంస్థలో పని చేస్తున్న ఓ డిప్యూటీ చీఫ్ టికెట్ ఇన్‌స్పెక్టర్‌ ఇప్పుడు వార్తల్లో నిలిచారు. చెన్నై రైల్వే డివిజన్‌(Chennai Railway Division)కి చెందిన ఎస్‌ నందకుమార్ (s Nandakumar)అనే రైల్వే ఉద్యోగి సిన్సియర్‌గా విధులు నిర్వహిస్తూ సంస్థకు ఆదాయం తెచ్చి పెట్టడంలో టాప్‌ ప్లేస్‌లో నిలిచాడు. 11 నెలల వ్యవధిలో కోటి 55లక్షల డబ్బును ప్రయాణికుల నుంచి ఫైన్‌ల ద్వారా వసూలు చేసి పైఅధికారులతో శభాష్ అనిపించుకున్నాడు. ఇండియన్ రైల్వే మొత్తంలో ఈతరహాలో జరిమానాలు విధించిన ముగ్గుర్ని ఎంపిక చేస్తే అందులో 27,878 ఫైన్‌లు విధించిన ఉద్యోగిగా టాప్‌ ప్లేస్‌లో నిలిచాడు నందకుమార్. రెండో స్థానంలో చీఫ్ టిక్కెట్ ఇన్‌స్పెక్టర్ రోసలిన్ అరోకియా మేరీ నిలిచింది. ఇక మూడో స్థానంలో సీనియర్ టిక్కెట్ ఎగ్జామినర్ శక్తివేల్ నిలిచారు.

సిన్సియర్ ఎంప్లాయిస్..

ప్రభుత్వ రవాణా సంస్థకు చెందిన ఏ వాహనాల్లో టికెట్‌ లేకుండా ప్రయాణించడం నేరం. తెలిసి చేసినా, తెలియక చేసినా అందుకు ప్రతీ ఒక్కరూ మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఇలాంటి పొరపాట్లను పర్యవేక్షించడంలో భారతీయ రైల్వే సంస్థ పకడ్బందీగా పని చేస్తుంది. నిత్యం లక్షలాది మందిని తమ రైళ్ల ద్వారా వేర్వేరు ప్రాంతాలకు చేరవేసే సంస్థలో టికెట్‌ లేకుండా ప్రయాణించే వారిని పట్టుకొని వారి దగ్గర భారీగా జరిమానాలు వసూలు చేసిన ముగ్గురు ఉద్యోగుల్ని గుర్తించి...వారిని అభినందించింది. అందులో మొదటి స్థానంలో నిలిచారు చెన్నై రైల్వే డివిజన్‌కు చెందిన ఎస్‌.నందకుమార్. ఈ ఉద్యోగి గత ఏడాది ఏప్రిల్ 1వ తేది నుంచి ఈఏడాది మార్చి 16వ తేదీ వరకు టికెట్‌ లేకుండా ప్రయాణించే వారిపై 27,787మందిపై జరిమానాలు విధించారు. డిప్యూటీ చీఫ్ టికెట్ ఇన్‌స్పెక్టర్‌నందకుమార్‌ ఫైన్‌ల ద్వారా వసూలు చేసిన డబ్బు అక్షరాల కోటి 55లక్షల రూపాయలు. ఈవిషయాన్ని ఇండియన్ రైల్వే అధికారికంగా ప్రకటించింది.

బెస్ట్ టికెట్‌ ఇన్‌స్పెక్టర్స్..

ఈయనతో పాటు చెన్నై రైల్వే డివిజన్‌కు చెందిన మరో ఇద్దరు ఉద్యోగులు కూడా కోటి రూపాయలకు పైగా వసూలు చేశారు. వారిలో రెండో స్థానంలో నిలిచారు చీఫ్ టిక్కెట్ ఇన్‌స్పెక్టర్ రోసలిన్ అరోకియా మేరీ. ఈ ఉద్యోగిని ప్రయాణికుల నుంచి పెనాల్టీల ద్వారా కోటి మూడు లక్షల రూపాయలు వసూలు చేసింది. అంతే కాదు అత్యధిక జరిమానాలు వసూలు చేసిన మహిళా టికెట్ తనిఖీ సిబ్బందిగా పేరు తెచ్చుకున్నారు. ఇక మూడో స్థానంలో నిలిచారు సీనియర్ టిక్కెట్ ఎగ్జామినర్ శక్తివేల్ ఈయన కూడా ఏడాది కాలంలో అనధికార ప్రయాణికుల నుంచి కోటి 10లక్షల జరిమానాలు వసూలు చేశారు. సదరన్ రైల్వేస్ జట్టులో ప్రొఫెషనల్ బాస్కెట్‌బాల్ ప్లేయర్‌గా ఉన్నారు శక్తివేల్.

ఆదాయం పెంచే ఉద్యోగులు..

విధి నిర్వాహణలో అద్భుతంగా, సిన్సియర్‌గా పని చేస్తూ సంస్థకు ఆదాయం తెచ్చిపెట్టడంలో ముందు వరసలో ఉన్న ఈ ముగ్గురు రైల్వే సిబ్బందిని అభినందించారు అధికారులు. అంతే కాదు ప్రయాణికులకు సరైన టికెట్‌ తీసుకొని రైళ్లలో ప్రయాణించాలని..నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.

First published:

Tags: Chennai, Indian Railway, National News

ఉత్తమ కథలు